ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

GK TEST-20 DATE : 2021 FEBRUARY 16

1. జాతీయ స్థాయిలో 'స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆన్ ఈ-గవర్నెన్స్-2020' (Special Interest Group on e-Governance-2020) అవార్డును దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖ ? [ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2021 ఫిబ్రవరి 12న 'లఖ్ నవూ' లో ఉత్తర్ ప్రదేశ్ సీఎం 'యోగి ఆదిత్యనాథ్' చేతులమీదుగా అందుకున్నారు] 
(ఎ) ఏ పీ ఎస్ ఆర్ టీ సీ 
(బి) ఏపీ పశుసంవర్ధక శాఖ  
(సి) ఏపీ వైద్య ఆరోగ్య శాఖ  
(డి) ఏపీ విద్యా శాఖ 

2. భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే ఆటగాళ్లకు 'యోయో' (YO-YO) పరీక్ష తప్పనిసరి. లేదంటే 2 వేల మీటర్ల పరుగును కూడా ఫిట్నెస్ (Fitness) కు ప్రమాణంగా భావిస్తారు. తాము ఫిట్ అని నిరూపించుకోవడానికి ఈ రెండింట్లో ఒక దాన్ని క్రికెటర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. 2 కి.మీ పరుగును పేసర్లు మరియు మిగిలినవాళ్లు పూర్తి చేయవలసిన సమయాలు వరుసగా ... ?   
(ఎ) 6 నిముషాల 15 సెకన్లలోనూ, 6 నిముషాల 30 సెకన్లలోనూ 
(బి) 7 నిముషాల 15 సెకన్లలోనూ, 7 నిముషాల 30 సెకన్లలోనూ  
(సి) 8 నిముషాల 15 సెకన్లలోనూ, 8 నిముషాల 30 సెకన్లలోనూ  
(డి) 9 నిముషాల 15 సెకన్లలోనూ, 9 నిముషాల 30 సెకన్లలోనూ 

3. భారతదేశంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించతలపెట్టిన 150 రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లు ఎన్ని ? 
(ఎ) 23  
(బి) 24 
(సి) 25 
(డి) 26 



4. ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 'జస్టిస్ పీవీ సంజయ్' (జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్) 2021 ఫిబ్రవరి 12న నియమితులయ్యారు ? [ఇతను హైదరాబాద్ కు చెందినవారు] (JUSTICE PV SANJAY) 
(ఎ) గువహటి 
(బి) మేఘాలయ 
(సి) మణిపూర్ 
(డి) త్రిపుర 

5. 'విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం' (Vijayawada Airport) నుంచి వివిధ ఉత్పత్తులను దేశంలోని ఏ చోటుకైనా గంటల్లో చేరవేసేందుకు పూర్తిస్థాయి ప్రత్యేక కార్గో సర్వీస్ ను 2021 ఫిబ్రవరి 13న ప్రారంభించిన విమానయాన సంస్థ ? [2018లో కార్గో సర్వీసు ప్రారంభమైనప్పటికీ సాధారణ విమానాల్లో సరకు రవాణా చేసేవారు] 
(ఎ) ఇండిగో ఎక్స్ ప్రెస్    
(బి) గోఎయిర్ ఎక్స్ ప్రెస్    
(సి) ట్రూజెట్ ఎక్స్ ప్రెస్  
(డి) స్పైస్ ఎక్స్ ప్రెస్ 

6. అతి చిన్న (38 సంవత్సరాల) వయసులో దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి (ఆంధ్రప్రదేశ్) గా "దామోదరం సంజీవయ్య" బాధ్యతలు స్వీకరించిన తేదీ ? (The First Dalit Chief Minister of an Indian State) 
(ఎ) 1960 జనవరి 10 
(బి) 1960 జనవరి 11 
(సి) 1960 జనవరి 12 
(డి) 1960 జనవరి 13 



7. భారత నౌకాదళం తాజా అవసరాలకు తగ్గట్టుగా ఏ దేశంతో కలిసి 'రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ' (DRDO) "ఎల్ ఆర్ సామ్" (LRSAM) లను అభివృద్ధి చేసింది ? ['డీ ఆర్ డీ ఓ' (DRDO) అభివృద్ధి చేసిన 'దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతల క్షిపణి' (LRSAM) తుది బ్యాచ్ ఉత్పత్తి రవాణాను 2021 ఫిబ్రవరి 14న ఆరంభించారు]   
(ఎ) అమెరికా 
(బి) రష్యా 
(సి) ఫ్రాన్స్ 
(డి) ఇజ్రాయెల్ 

8. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 'డీ ఆర్ డీ ఓ' (DRDO) అభివృద్ధి చేసిన అతిపెద్ద ఆయుధం "అర్జున్ మార్క్ 1ఏ" (ARJUN MARK 1A) యుద్ధ ట్యాంకును భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2021 ఫిబ్రవరి 14న భారత సైన్యానికి అప్పగించిన ప్రదేశం ? ['తేజస్' తర్వాత 'ఆత్మనిర్భర్ భారత్' కింద భారత దళాలకు అందిన అతి పెద్ద ఆయుధం ఈ 'అర్జున్ యుద్ధ ట్యాంకు']   
(ఎ) చెన్నై  
(బి) కొచ్చి  
(సి) విశాఖపట్నం 
(డి) పారాదీప్  

9. "సాగరిక" పేరుతో అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ ["SAGARIKA" International Cruise Terminal] ను ఏ నగరంలో నిర్మించారు ? 
(ఎ) చెన్నై  
(బి) కొచ్చి  
(సి) విశాఖపట్నం 
(డి) కోల్ కతా  



10. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'జో బైడెన్' విజయాన్ని ధృవీకరించడానికి 2021 జనవరి 6న 'సెనేట్' సమావేశమైనప్పుడు కేపిటల్ భవంతిపై తన మద్దతుదారులు దాడికి పాల్పడేలా 'డొనాల్డ్ ట్రంప్' ప్రేరేపించారంటూ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై 2021 ఫిబ్రవరి 13న జరిగిన ఓటింగ్ లో 50 మంది డెమొక్రాట్లు, ఏడుగురు రిపబ్లికన్లు అనుకూలంగా ఓటు వేసినా ఆ తీర్మానం ఎన్ని ఓట్ల తేడాతో వీగిపోయింది ? [ప్రతినిధుల సభలో రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్'. పదవీకాలం అయిపోయాక దీనిని ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ఆయనే]   
(ఎ) 5 
(బి) 10 
(సి) 15 
(డి) 20              

కీ (KEY) (GK TEST-20 DATE : 2021 FEBRUARY 16)
1) బి    2) సి    3) డి    4) సి    5) డి    6) బి    7) డి    8) ఎ    9) బి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి