ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఫిబ్రవరి 2021, శనివారం

GK TEST-9 DATE : 2021 FEBRUARY 5

1. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-2020 విద్యా సంవత్సరం మొదట్లో అంతర్గత మార్కులు, బిట్ పేపర్ తొలగించారు. ఈ రెండు మార్పులతోపాటు ఈసారి 11 పరీక్షలను ఏడుకు కుదించారు. సామాన్య శాస్త్రానికి రెండు పరీక్షలు కాగా మిగతా వాటికి ఒక్కో పరీక్ష ఉంటుంది. ఈ సంస్కరణలు తీసుకు వచ్చిన తరవాత నిర్వహిస్తున్న మొదటి వార్షిక పరీక్షలు ఏ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి ? [1-9 తరగతులకు 2021 మే 3 నుంచి వార్షిక పరీక్షలు జరుగుతాయి]  
(ఎ) 2021 జూన్ 5 
(బి) 2021 జూన్ 6  
(సి) 2021 జూన్ 7  
(డి) 2021 జూన్ 8 

2. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో ఇచ్చింది వెయ్యి రూపాయలు కాగా.. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇచ్చిన మొత్తం ? [వాస్తవానికి 106 కి.మీ. నిడివి కలిగిన ఈ లైను అంచనా వ్యయం రూ. 2,679 కోట్లు] 
(ఎ) రూ. 1,000 
(బి) రూ. 2,000  
(సి) రూ. 3,000  
(డి) రూ. 4,000 

3. జోన్లవారీ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి భారతీయ రైల్వే శాఖ 'పింక్ బుక్' (PINK BOOK) ను విడుదల చేసిన తేదీ ?  
(ఎ) 2021 ఫిబ్రవరి 1  
(బి) 2021 ఫిబ్రవరి 2 
(సి) 2021 ఫిబ్రవరి 3 
(డి) 2021 ఫిబ్రవరి 4 



4. భారతదేశంలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. ఏ పాప్ గాయని (అమెరికా) చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది ? ["మనమెందుకు దీని గురించి మాట్లాడడం లేదు" అంటూ ఆ గాయని ట్వీట్ చేసింది]  
(ఎ) అమందా సెర్నీ 
(బి) మియా ఖలీఫా 
(సి) గ్రెటా థన్ బర్గ్ 
(డి) రిహానా 

5. "దీపం" (DIPAM) కార్యదర్శి 'తుహిన్ కాంత పాండే' 2021 ఫిబ్రవరి 3న చేసిన ట్వీట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం .. "ప్రైవేటీకరణ ద్వారా యాజమాన్య హక్కులతోపాటు, 'రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100% షేర్ హోల్డింగ్ ను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర" వేసిన తేదీ ? [2010 నవంబర్ 17న ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (RINL) కు "నవరత్న" (NAVRATNA) హోదా కల్పించారు]  
(ఎ) 2021 జనవరి 24   
(బి) 2021 జనవరి 25  
(సి) 2021 జనవరి 26  
(డి) 2021 జనవరి 27 

6. వ్యవసాయదారులు, వ్యవసాయ సంస్థలు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఏడాదికి రెండుసార్లు దేశవ్యాప్తంగా నాలుగు విభాగాల్లో (తక్నీక్ ఛాంపియన్, మహిళా కిసాన్ ఛాంపియన్, యువ కిసాన్ ఛాంపియన్, రెంటల్ పార్ట్నర్ ఛాంపియన్) "కృష్-ఇ" (Krish-e) పురస్కారాలను అందిస్తామని ప్రకటించిన సంస్థ ?   
(ఎ) మహీంద్రా & మహీంద్రా 
(బి) టఫె
(సి) సోనాలిక 
(డి) జాన్ డీర్ 



7. 2021 ఫిబ్రవరి 3న 'హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్' (HAL) తో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రూ. 48 వేల కోట్ల విలువైన ఒప్పందంలో భాగంగా ఎన్ని 'తేజస్ ఎంకే1ఏ - ఎల్ సీ ఏ' (Tejas Mk 1A - LCA) యుద్ధ విమానాలను భారతీయ వైమానిక రంగానికి 'హెచ్ ఏ ఎల్' (HAL) అందించనుంది ?   
(ఎ) 81 
(బి) 82 
(సి) 83 
(డి) 84 

8. రానున్న ఏడేళ్లలో భారత సైనిక వ్యవస్థ ఆధునికీకరణకు సుమారు ఎంత మొత్తం వ్యయం చేయనున్నట్లు రక్షణ మంత్రి 'రాజ్ నాథ్ సింగ్' తెలిపారు ?  
(ఎ) రూ. 7,48,000 కోట్లు  
(బి) రూ. 8,48,000 కోట్లు  
(సి) రూ. 9,48,000 కోట్లు 
(డి) రూ. 10,48,000 కోట్లు  

9. 2021 ఫిబ్రవరి 3న బెంగళూరు లోని 'యలహంక' లో ప్రారంభమైన "వైమానిక ప్రదర్శన" (AERO INDIA 2021) ఎన్నవది ?
(ఎ) 10 
(బి) 11 
(సి) 12  
(డి) 13  



10. ఏ సంవత్సరం నాటికి వైమానిక, రక్షణ ఉత్పత్తులు, సేవా విభాగంలో రూ. 35 వేల కోట్ల ఎగుమతులతో మొత్తం రూ. 1,75,000 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు భారత రక్షణ మంత్రి చెప్పారు ? 
(ఎ) 2024 
(బి) 2025 
(సి) 2026  
(డి) 2027              

కీ (KEY) (GK TEST-9 DATE : 2021 FEBRUARY 5)
1) సి    2) ఎ    3) సి    4) డి    5) డి    6) ఎ    7) సి    8) సి    9) డి    10) ఎ  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి