తూర్పు కోస్తా ఫ్రైట్ కారిడార్
(EAST COAST DEDICATED FREIGHT CORRIDOR)
- విశాఖపట్నం మీదుగా వెళ్లే 'రైల్వే రవాణా కారిడార్' ను 2021-22 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మార్గం (ROUTE) :
- పశ్చిమబెంగాల్ లోని 'ఖరగ్ పూర్' (KHARAGPUR) నుంచి విశాఖపట్నం, కాకినాడ లాంటి వివిధ పోర్టుల మీదుగా 'విజయవాడ' (VIJAYAWADA) వరకు ఈ కారిడార్ కొనసాగుతుంది.
దూరం (DISTANCE) :
- 'తూర్పు కోస్తా ఫ్రైట్ కారిడార్' (EAST COAST DFC) మొత్త్తం దూరం 1100 కి.మీ. ఉంటుంది.
అంచనా వ్యయం (ESTIMATED COST) :
- 'తూర్పు కోస్తా ఫ్రైట్ కారిడార్' (EAST COAST DFC) ప్రాజెక్ట్ మొత్త్తం వ్యయం రూ. 44వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
చేపట్టే సంస్థ :
- "డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్" (DFCCIL) ఈ 'తూర్పు కోస్తా ఫ్రైట్ కారిడార్' (EAST COAST DFC) ప్రాజెక్ట్ ను చేపడుతుంది.
ప్రత్యేకత (SPECIALITY) :
- ప్రయాణికుల రైళ్ల మార్గంతో సంబంధం లేకుండా కేవలం సరకు రవాణా కోసమే రైల్వే మార్గం ఏర్పాటు చేస్తారు. ఆటంకాల్లేకుండా రవాణాకు ఇది ఉపయోగపడుతుంది.
- 'డబుల్ కంటైనర్' (DOUBLE CONTAINER) విధానంలో ఈ కారిడార్ ను నిర్వహిస్తారు. అంటే ఒక కంటైనర్ మీద మరో కంటైనర్ ఉంచి సరకుల్ని రవాణా చేస్తారు. దీనికి తగ్గట్లే రైల్వే పట్టాలపై విద్యుత్తు తీగల ఏర్పాటు ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి