ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

GK TEST-11 DATE : 2021 FEBRUARY 7

1. వేతనాలు, ప్రతిభ ఆధారంగా 'హెచ్-1బి' (H-1B) వీసాలు జారీ చేసేందుకు వీలుగా 'డోనాల్డ్ ట్రంప్' హయాంలో తీసుకొచ్చిన నూతన విధానం అమలును ప్రస్తుత 'జో బైడెన్' సర్కారు ఏ తేదీ వరకు తాత్కాలికంగా వాయిదా వేసింది ? [అప్పటి వరకు పాత లాటరీ విధానంలోనే ఆప్రక్రియను పూర్తి చేయనున్నారు]  
(ఎ) 2021 జూన్ 30 
(బి) 2021 డిసెంబర్ 31  
(సి) 2022 మార్చ్ 31  
(డి) 2022 జూన్ 30 

2. భారతదేశంలో ఇప్పటివరకూ సార్వత్రిక, సంప్రదాయ విశ్వవిద్యాలయాలు తరగతి గది ద్వారా బోధించే విద్యా కార్యక్రమాల్లో కేవలం ఎంత శాతం కోర్సులను మాత్రమే ఆన్లైన్ (ONLINE) లో అందించేందుకు అనుమతి ఉంది ?  
(ఎ) 20% 
(బి) 40%  
(సి) 60%  
(డి) 80%% 

3. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి (SOUTHERN ZONAL COUNCIL) 29వ సమావేశం 'తిరుపతి'లో ఏ తేదీన జరగనుంది ? 
(ఎ) 2021 మార్చ్ 1  
(బి) 2021 మార్చ్ 2 
(సి) 2021 మార్చ్ 3 
(డి) 2021 మార్చ్ 4 



4. దిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల పరేడ్ లో ప్రధాన మంత్రి ట్రోఫీ (Prime Minister's Trophy) గెలుపొందిన 'ఎన్ సీ సీ' (NCC) కేడెట్ లకు ఒక్కొక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రకటించిన నగదు ప్రోత్సాహకం ? [ట్రోఫీ సాధించిన కేడెట్ లు "శ్రేయాసీ భక్త, శ్రీసాయి ప్రియ, భార్గవి, జ్యోత్స్న, హరి ప్రసాద్, భరత్ నాయక్, నాగ సురేష్, రామ్ ప్రశాంత్, సతీష్ కుమార్ రెడ్డి" లను సీఎం జగన్ అభినందించారు]   
(ఎ) రూ. 50,000 
(బి) రూ. 1,00,000 
(సి) రూ. 2,00,000 
(డి) రూ. 3,00,000 

5. 2021 ఫిబ్రవరి 5న జరిగిన ఆర్బీఐ 'పరపతి విధాన కమిటీ' (MPC) సమీక్ష వివరాల ప్రకారం .. ప్రస్తుతం కొనసాగుతున్న "రెపో" (REPO = బ్యాంకులు ఆర్బీఐ నుంచి తెచ్చుకునే నిధులకు చెల్లించే వడ్డీ రేటు) మరియు "రివర్స్ రెపో" (REVERSE REPO = బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై పొందే వడ్డీ) రేట్లు వరుసగా ... ?  
(ఎ) 8%, 7.35%    
(బి) 6%, 5.35%  
(సి) 4%, 3.35%  
(డి) 2%, 1.35% 

6. 2021 ఏప్రిల్ 1తో మొదలయ్యే ఆర్ధిక సంవత్సరంలో 'జీడీపీ' (GDP) వృద్ధి రేటు ఎంతగా నమోదు కావొచ్చని 'ఆర్బీఐ' అంచనా ? [ప్రభుత్వ ఆర్ధిక సర్వే అంచనా 11 శాతంగా ఉంది] 
(ఎ) 10% 
(బి) 10.5% 
(సి) 11% 
(డి) 11.5% 



7. 2021-22లో ద్రవ్య లోటు ఎంత శాతంగా నమోదవవచ్చని 'ఆర్బీఐ' అంచనా ? 
(ఎ) 6.5 % 
(బి) 6.6 % 
(సి) 6.7 % 
(డి) 6.8 % 

8. ప్రభుత్వ రుణాలను నేరుగా ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిన తొలి ఆసియా దేశం ?  
(ఎ) ఇండియా  
(బి) ఇండోనేషియా  
(సి) జపాన్ 
(డి) ఫిలిప్పీన్స్  

9. భారత ప్రభుత్వం 2021-22 ఆర్ధిక సంవత్సరంలో స్థూలంగా మార్కెట్ నుంచి సమీకరించనున్న రుణం ?
(ఎ) రూ. 10 లక్షల కోట్లు 
(బి) రూ. 11 లక్షల కోట్లు 
(సి) రూ. 12 లక్షల కోట్లు  
(డి) రూ. 13 లక్షల కోట్లు  



10. బ్యాంకులు తప్పనిసరిగా పక్కన పెట్టాల్సిన డిపాజిట్ల నిష్పత్తిని ఏమని పిలుస్తారు ? 
(ఎ) ఎస్ ఎల్ ఆర్ (SLR) 
(బి) ఎన్ ఎస్ ఎఫ్ ఆర్ (NSFR) 
(సి) ఎమ్ సీ ఎల్ ఆర్ (MCLR) 
(డి) సీ ఆర్ ఆర్ (CRR)               

కీ (KEY) (GK TEST-11 DATE : 2021 FEBRUARY 7)
1) బి    2) బి    3) డి    4) సి    5) సి    6) బి    7) డి    8) ఎ    9) సి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి