1. 2021 ఫిబ్రవరి 9న అంగారక గ్రహ కక్ష్యలోకి విజయవంతంగా ఒక వ్యోమనౌక "అమల్" (AMAL) ను పంపిన తొలి అరబ్ దేశం ? [అరబ్ దేశాలకు ఇదే తొలి గ్రహాంతర యాత్ర. రోదసిలో దాదాపు 7 నెలల పాటు .. 30 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన 'అమల్' అనే ఈ వ్యోమనౌక నిర్దేశిత రీతిలో అంగారక గ్రహానికి చేరువైంది]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) సౌదీ అరేబియా
(బి) జోర్డాన్
(సి) పాలస్తీనా
(డి) యూఏఈ
2. తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ, తెలుగు వారికి 'అల్పసంఖ్యాక హోదా' (MINORITIES STATUS) కల్పిస్తూ ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది ?
(ఎ) ఒడిశా
(బి) పశ్చిమబెంగాల్
(సి) కర్ణాటక
(డి) తమిళనాడు
3. 2020-21 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా .. వాస్తవంగా సమీకరించిన మొత్తం ? (కొవిడ్ కారణంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వలన ఈ విధంగా జరిగింది]
(ఎ) రూ. 30,000 కోట్లు
(బి) రూ. 31,000 కోట్లు
(సి) రూ. 32,000 కోట్లు
(డి) రూ. 33,000 కోట్లు
4. జాతీయ ప్రాధాన్యం ఉన్న 'స్మారక చిహ్నాలు' (MONUMENTS) దేశంలో ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి ? [వీటిలో .. ఆంధ్రప్రదేశ్ కు చెందినవి 135 కాగా, తెలంగాణ లో 8 ఉన్నాయి]
(ఎ) 3,691
(బి) 3,692
(సి) 3,693
(డి) 3,694
5. ఆంధ్రప్రదేశ్ లో 'ఎస్సీ' (SC) రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పరిశీలనకు 'జస్టిస్ ఉషా మెహ్రా' నేతృత్వంలో ఏర్పాటైన జాతీయ కమిషన్ (Justice Usha Mehra Commission) నివేదిక ఇచ్చిన తేదీ ? ['ఎస్సీ' కులాలను ఉప కులాలుగా, ఉప-ఉపకులాలుగా వర్గీకరించడానికి వీలుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని సవరించాలని 'ఉషా మెహ్రా కమిషన్' సిఫారసు చేసింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది]
(ఎ) 2008 మే 1
(బి) 2008 మే 2
(సి) 2008 మే 3
(డి) 2008 మే 4
6. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి 'నరేంద్ర సింగ్ తోమర్' లోక్ సభలో తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై ఉన్న రుణ భారం ? [తెలంగాణ రైతు కుటుంబాలపై సగటున రూ. 68,028 అప్పు ఉంది]
(ఎ) రూ. 85,555
(బి) రూ. 86,666
(సి) రూ. 87,777
(డి) రూ. 88,888
7. రాబోయే ఎల్ఐసీ తొలి పబ్లిక్ ఇష్యూ (IPO) పరిమాణంలో ఎంత శాతం వరకు పాలసీదార్లకు కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి 'అనురాగ్ ఠాకూర్' పేర్కొన్నారు ? [పాలసీదార్ల ప్రయోజనాల దృష్ట్యా 'ఎల్ఐసీ' (LIC) లో మెజారిటీ వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుంది]
(ఎ) 10%
(బి) 15%
(సి) 20%
(డి) 25%
8. ప్రపంచాన్ని కుదిపేసిన 'కరోనా' వైరస్ .. చైనాలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్ (Wuhan Institute of Virology) నుంచి లీకై ఉంటుందన్న వాదనను కొట్టిపారేస్తూ .. అది గబ్బిలాల నుంచి అలుగు లేదా బెంబూ ర్యాట్ అనే మరో జంతువు ద్వారా మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయని చెప్పిన 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) నిపుణుల బృందానికి నాయకత్వం వహించినది ?
(ఎ) పీటర్ బెన్ ఎంబ్రేక్
(బి) మరియన్ కూప్ మాన్స్
(సి) లియాంగ్ వానియన్
(డి) పీటర్ డాస్జాక్
9. నియంత్రణ సంస్థల నిబంధనలు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (PSB) కి 2021-22లో కేంద్ర ప్రభుత్వం చొప్పించనున్న నిధుల విలువ ? [2020-21 ఆర్ధిక సంవత్సరంలో మూలధన పునర్వ్యవస్థీకరణ కోసం రూ. 20,000 కోట్లను కేటాయించారు]
(ఎ) రూ. 20,000 కోట్లు
(బి) రూ. 30,000 కోట్లు
(సి) రూ. 40,000 కోట్లు
(డి) రూ. 50,000 కోట్లు
10. దేశీయ బీమా కంపెనీల్లో ప్రస్తుతం 49 శాతం విదేశీ పెట్టుబడికి (FDI) అనుమతి ఉంది. దీన్ని ఎంత శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించారు ?
(ఎ) 51%
(బి) 62%
(సి) 74%
(డి) 87%
కీ (KEY) (GK TEST-16 DATE : 2021 FEBRUARY 12)
1) డి 2) బి 3) సి 4) సి 5) ఎ 6) సి 7) ఎ 8) ఎ 9) ఎ 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి