1. 'ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ - 2021' (FT Global MBA Ranking 2021) జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ? [ఈ జాబితాలో 'ఐ ఎస్ బీ' - హైదరాబాద్ (ISB-Hyderabad) భారతదేశానికి చెందిన మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో అగ్రస్థానంలోనూ, ప్రపంచ జాబితాలో 23వ స్థానంలోనూ, ఆసియాలో 5వ స్థానంలోనూ నిలిచింది]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) లండన్ బిజినెస్ స్కూల్ (యూకే)
(బి) ఇన్ సీడ్ (ఫ్రాన్స్, సింగపూర్)
(సి) యూనివర్సిటీ ఆఫ్ చికాగో - బూత్ (అమెరికా)
(డి) లెసే బిజినెస్ స్కూల్ (స్పెయిన్)
2. భారత భూగర్భ పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ ?
(ఎ) ఫరూక్ అజం
(బి) వివేక్ కుమార్ పాండే
(సి) ఎం.ఎస్.రావత్
(డి) రంజిత్ రథ్
3. టెస్టు క్రికెట్లో గత వందేళ్ల పైకాలంలో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి స్పిన్నర్ గా రికార్డు సృష్టించినది ?
(ఎ) రవిచంద్రన్ అశ్విన్
(బి) ముత్తయ్య మురళీధరన్
(సి) అనిల్ కుంబ్లే
(డి) షేన్ వార్న్
4. భారతీయ ఎడ్యు-టెక్ కంపెనీ "బైజుస్" (BYJU'S) ఐసీసీ (ICC) ఈవెంట్లకు స్పాన్సర్ గా వ్యవహరించబోయే కాలపరిమితి ? [2019 ఆగస్ట్ లో టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్ గా 'బైజుస్' ఎంపికైంది]
(ఎ) 2021 నుంచి 2022 వరకు
(బి) 2021 నుంచి 2023 వరకు
(సి) 2021 నుంచి 2024 వరకు
(డి) 2021 నుంచి 2025 వరకు
5. 2021 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2021-22 ఆర్ధిక సంవత్సరానికి "ఆత్మనిర్భర్" (ATMANIRBHAR) పేరుతో లోక్ సభలో తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Union Budget 2021-22) అంచనా విలువ ?
(ఎ) రూ. 34,63,236 కోట్లు
(బి) రూ. 34,73,236 కోట్లు
(సి) రూ. 34,83,236 కోట్లు
(డి) రూ. 34,93,236 కోట్లు
6. ఎన్ని మూలస్తంభాలపై ప్రధానంగా '2021-22 కేంద్ర బడ్జెట్' (Union Budget 2021-22) ప్రతిపాదనలు రూపొందాయని కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తెలిపారు ? [ప్రధానంగా కేటాయింపులను వాటికే పరిమితం చేశారు]
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8
7. పద్నాలుగో ఆర్ధిక సంఘంతో పోల్చితే 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో అయిదేళ్లలో ఎంత మొత్తం నష్టం జరగనుంది ? [గత ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి 4.305 శాతం వాటా దక్కగా ఈసారి అది 4.047 శాతానికి పడిపోయింది. 0.258 శాతం మేర వెయిటేజీ కోల్పోవడంతో ఈ నష్టం జరగనుంది]
(ఎ) రూ. 7,900 కోట్లు
(బి) రూ. 8,900 కోట్లు
(సి) రూ. 9,900 కోట్లు
(డి) రూ. 10,900 కోట్లు
8. 2021-22 కేంద్ర బడ్జెట్ (Union Budget 2021-22) లో పత్తి దిగుమతిపై 10% కస్టమ్స్ సుంకం విధించగా .. ముడి పట్టు, పట్టు దారంపై ఉన్న సుంకాన్ని 10% నుంచి ఎంత శాతానికి పెంచారు ?
(ఎ) 13%
(బి) 15%
(సి) 17%
(డి) 19%
9. ఉపాధి హామీ పథకానికి 2020-21 సవరించిన బడ్జెట్ అంచనాల్లో రూ. 1,11,500 కోట్లు కేటాయించగా ఈసారి 2021-22 కేంద్ర బడ్జెట్ (Union Budget 2021-22) లో కేటాయించిన మొత్తం ?
(ఎ) రూ. 71,000 కోట్లు
(బి) రూ. 72,000 కోట్లు
(సి) రూ. 73,000 కోట్లు
(డి) రూ. 74,000 కోట్లు
10. 2021-22 కేంద్ర బడ్జెట్ (Union Budget 2021-22) లో పింఛను, డిపాజిట్లపై వడ్డీ పొందుతున్న ఏ వయసు వృద్ధులకు పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు ?
(ఎ) 60 ఏళ్లు పైబడిన వృద్ధులు
(బి) 65 ఏళ్లు పైబడిన వృద్ధులు
(సి) 70 ఏళ్లు పైబడిన వృద్ధులు
(డి) 75 ఏళ్లు పైబడిన వృద్ధులు
కీ (KEY) (GK TEST-14 DATE : 2021 FEBRUARY 10)
1) బి 2) డి 3) ఎ 4) బి 5) సి 6) బి 7) డి 8) బి 9) సి 10) డి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి