1. మానవ రహిత వాహనాలు (UAV), రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్' (RPAS) ల్లో శిక్షణ కోసం 'ఎయిర్ బస్' (AIRBUS) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న భారత వైమానిక శిక్షణ సంస్థ ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) ఇగ్రువ (IGRUA) - రాయ్ బరేలి
(బి) ఆర్ జీ ఏవియేషన్ - హైదరాబాద్
(సి) ఏపీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్
(డి) ఫ్లై టెక్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్
2. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల స్థానాలు ? [తెలంగాణ హైకోర్ట్ లో 10 జడ్జీల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా సుప్రీంకోర్ట్ లో నాలుగు, 25 అన్ని హైకోర్టుల్లో కలిపి 419 జడ్జీల స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది]
(ఎ) 15
(బి) 16
(సి) 17
(డి) 18
3. 'ఏపీసీసీ' (APCC) మత సామరస్య పరిరక్షణ కమిటీ చైర్మన్ గా నియమితులైనది ?
(ఎ) గిడుగు రుద్రరాజు
(బి) కనుమూరి బాపిరాజు
(సి) కొరివి వినయ్ కుమార్
(డి) నులుకుర్తి వెంకటేశ్వరరావు
4. 'కేంద్ర దర్యాప్తు సంస్థ' (CBI) తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన 1988 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ (IPS) అధికారి ? [సీబీఐ డైరెక్టర్ పదవీ విరమణ అనంతరం తాత్కాలిక డైరెక్టర్ ను నియమించడం 2014 నుంచి ఇది నాలుగోసారి]
(ఎ) రుషి కుమార్ శుక్లా
(బి) ప్రవీణ్ సిన్హా
(సి) అనిల్ సిన్హా
(డి) రంజిత్ సిన్హా
5. విజయవాడలో "ఈ-వాచ్" యాప్ (eWatch App) ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏడీజీ సంజయ్, ఎన్నికల సంఘ కార్యదర్శి కన్నబాబుతో కలిసి 'ఎస్ఈసీ' (SEC) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆవిష్కరించిన తేదీ ?
(ఎ) 2021 ఫిబ్రవరి 1
(బి) 2021 ఫిబ్రవరి 2
(సి) 2021 ఫిబ్రవరి 3
(డి) 2021 ఫిబ్రవరి 4
6. ముచ్చటగా మూడోసారి 50,000 పాయింట్లు స్థాయిని అధిగమించిన "సెన్సెక్స్" (BSE SENSEX) .. ఈసారి కిందకు దిగిరాలేదు. చరిత్రలో తొలిసారిగా ఆ కీలక స్థాయి కంటే ఎగువనే (50,255 పాయింట్లు) ముగిసిన తేదీ ?
(ఎ) 2021 ఫిబ్రవరి 2
(బి) 2021 ఫిబ్రవరి 3
(సి) 2021 ఫిబ్రవరి 4
(డి) 2021 ఫిబ్రవరి 5
7. ప్రతిష్ఠాత్మక 'అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ' (ASGE) సంస్థ ప్రకటించిన అత్యున్నత పురస్కారానికి ఎంపికైన ప్రఖ్యాత భారతీయ జీర్ణకోశ వైద్య నిపుణుడు ? ['అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్' వ్యవస్థాపకులు "డాక్టర్ రుడాల్ఫ్ వి.షిండ్లర్" పేరిట జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో విశేష సేవలందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు]
(ఎ) డాక్టర్ జి. పార్థసారథి
(బి) డాక్టర్ అనురాగ్ టాండన్
(సి) డాక్టర్ వివేక్ రాజ్
(డి) డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి
8. వాషింగ్టన్ లోని లింకన్ స్మారక చిహ్నం వద్ద ఒక నల్ల జాతీయురాలి చిత్రపటాన్ని (గాజుతో రూపొందించినది) తాజాగా ఆవిష్కరించారు. ఈ అరుదైన గౌరవాన్ని పొందిన మహిళ ?
(ఎ) ఓప్రా విన్ఫ్రె
(బి) కమలా హారిస్
(సి) మిషెల్ ఒబామా
(డి) కల్పనా చావ్లా
9. డాక్టర్ కేఎస్ భండారీ రాసిన "పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్" (PARLIAMENTARY MESSENGER IN RAJASTHAN) అనే పుస్తకాన్ని బారత ఉపరాష్ట్రపతి 'ఎం.వెంకయ్య నాయుడు' 2021 ఫిబ్రవరి 5న ఆవిష్కరించారు. ఒక భారత పార్లమెంట్ సభ్యుడు తన 'ఎంపీ లాడ్స్' (MPLADS) ను ఖర్చు చేయడం ద్వారా చేపట్టిన వైద్య, విద్య కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఈ పుస్తకం రాయడం జరిగింది. ఆ పార్లమెంట్ సభ్యుని పేరు ?
(ఎ) థావర్ చంద్ గహ్లోత్
(బి) హనుమాన్ బేణీవాల్
(సి) అభిషేక్ మను సింఘ్వీ
(డి) ఓం బిర్లా
10. పిడుగుపాటు (THUNDERBOLT) పై పరిశోధన కోసం భారత దేశంలో తొలిసారిగా ఎక్కడ ఒక ప్రయోగ వేదికను ఏర్పాటు చేయబోతున్నారు ? [దీన్ని 'భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ', 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (DRDO), 'భారత అంతరిక్ష పరిశోధన సంస్థ' (ISRO) భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని 'ఐఎండీ' (IMD) డైరెక్టర్ జనరల్ 'మృత్యుంజయ్ మహాపాత్ర' వెల్లడించారు]
(ఎ) బాలేశ్వర్ (ఒడిశా)
(బి) భోపాల్ (మధ్యప్రదేశ్)
(సి) శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)
(డి) తిరువనంతపురం (కేరళ)
కీ (KEY) (GK TEST-10 DATE : 2021 FEBRUARY 6)
1) డి 2) డి 3) బి 4) బి 5) సి 6) బి 7) డి 8) బి 9) సి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి