ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

GK TEST-24 DATE : 2021 FEBRUARY 20

1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్నియమించిన 'ముందస్తు నిర్బంధ చర్యల (PREVENTIVE DETENTION) సలహా కమిటీ' చైర్మన్ ?  
(ఎ) జస్టిస్ నీలం సంజీవరెడ్డి 
(బి) జస్టిస్ పి.దుర్గాప్రసాద్  
(సి) జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి  
(డి) జస్టిస్ సంజీవ్ బెనర్జీ 

2. అంగారక గ్రహం (MARS PLANET) పై అత్యంత అధునాతనమైన, 'తెలివైన' రోవర్ "పర్సెవరెన్స్"  (PERSEVERANCE) ను 'అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ' (NASA) 2021 ఫిబ్రవరి 19న విజయవంతంగా దించింది. 'మార్స్ 2020' ప్రాజెక్ట్ లో భాగంగా "పర్సెవరెన్స్" (PERSEVERANCE) ను 'నాసా' ప్రయోగించిన తేదీ ?['అరుణ గ్రహం (MARS PLANET) పై గతంలో జీవం ఉండేదా' అన్న కీలక ప్రశ్నకు ఇది సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తుంది]    
(ఎ) 2020 జూలై 28 
(బి) 2020 జూలై 29  
(సి) 2020 జూలై 30  
(డి) 2020 జూలై 31 

3. "అంగారకుడిపై రోవర్ విజయవంతంగా దిగిందని సంకేతం వచ్చింది. పర్సెవరెన్స్ .. సురక్షితంగా ఆ గ్రహంపై అడుగుపెట్టింది" అని ప్రకటించిన భారత సంతతికి చెందిన 'నాసా' ఫ్లైట్ కంట్రోలర్ ?   
(ఎ) డాక్టర్ బాబ్ బలరామ్   
(బి) సోనాలీ నిజ్వాన్ 
(సి) డాక్టర్ వందనా వర్మ 
(డి) డాక్టర్ స్వాతి మోహన్ 



4. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) లో 2018లో బ్లాక్-1లో 46 ఉన్న పెద్దపులుల సంఖ్య .. ప్రస్తుతం ఎంతకు పెరిగింది ? 
(ఎ) 61 
(బి) 62 
(సి) 63 
(డి) 64 

5. టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) గణాంకాల ప్రకారం .. వినియోగంలో ఉన్న కనెక్షన్ల పరంగా 'ఏపీ, తెలంగాణ ఉమ్మడి టెలికం సర్కిల్' స్థానం ? [దేశవ్యాప్తంగా జూన్ 2020 నాటికి 55.41% మంది ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ / ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండగా సెప్టెంబర్ కు అది 57.29 శాతంగా ఉంది] 
(ఎ) 1   
(బి) 2  
(సి) 3  
(డి) 4 

6. బ్రిటన్ యువరాజు 'హ్యారీ' (HARRY), భార్య 'మేఘన్ మార్కెల్' (MEGHAN MARKLE) రాజరికపు బంధనాలకు దూరంగా, స్వతంత్రంగా బతకాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు ? [ఇక నుంచి 'హ్యారీ, మేఘన్' లకు "హిజ్ రాయల్ హైనెస్, హర్ రాయల్ హైనెస్" (HIS ROYAL HIGHNESS, HER ROYAL HIGHNESS) బిరుదులు, "డ్యూక్ ఆఫ్ ససెక్స్, డచెస్ ఆఫ్ ససెక్స్" (DUKE OF SUSSEX, DUCHESS OF SUSSEX ) హోదాలు ఉండవు] 
(ఎ) 2020 జనవరి 
(బి) 2020 ఫిబ్రవరి 
(సి) 2020 మార్చ్ 
(డి) 2020 ఏప్రిల్ 



7. భూమి నుంచి పంపిన సంకేతం .. అంగారకుడి (MARS PLANET) ని చేరడానికి దాదాపు ఎంత సమయం పడుతుంది ?  
(ఎ) 11 నిముషాల 22 సెకన్లు 
(బి) 12 నిముషాల 22 సెకన్లు 
(సి) 13 నిముషాల 22 సెకన్లు 
(డి) 14 నిముషాల 22 సెకన్లు 

8. అరుణ గ్రహం (MARS PLANET) పైకి 'నాసా' విజయవంతంగా దించిన రోవర్ "పర్సెవరెన్స్" (PERSEVERANCE) సేకరించే నమూనాలను తీసుకొచ్చే ఆర్బిటర్ ఏ సంవత్సరంలో భూమికి తిరిగొస్తుంది ? ['నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ESA)' లు 2026లో సంయుక్తంగా ఈ ఆర్బిటర్ ను ప్రయోగించనున్నారు]  
(ఎ) 2028  
(బి) 2031  
(సి) 2034 
(డి) 2037  

9. అంగారకుడి (MARS PLANET) పై ఒక రోజును "సోల్" (SOL) అని పిలుస్తారు. 'సోల్' (SOL) యొక్క నిడివి ?
(ఎ) 27 గంటల 39 నిముషాల 35.244 సెకన్లు 
(బి) 26 గంటల 39 నిముషాల 35.244 సెకన్లు 
(సి) 25 గంటల 39 నిముషాల 35.244 సెకన్లు  
(డి) 24 గంటల 39 నిముషాల 35.244 సెకన్లు  



10. భారత్ లో కరోనా వాక్సినేషన్ ప్రారంభించిన ఎన్ని రోజుల్లో 'కోటి' (1,01,88,007) మార్కును దాటినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ? [అమెరికాలో కేవలం 31 రోజుల్లోనే కోటి వాక్సిన్ డోసులను అందించగా బ్రిటన్ 56 రోజుల్లో ఈ ఘనతను అందుకుంది] 
(ఎ) 31 రోజులు 
(బి) 32 రోజులు 
(సి) 33 రోజులు 
(డి) 34 రోజులు              

కీ (KEY) (GK TEST-24 DATE : 2021 FEBRUARY 20)
1) ఎ    2) సి    3) డి    4) సి    5) బి    6) సి    7) ఎ    8) బి    9) డి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి