"ఈ-వాచ్" యాప్(eWatch App)
- 2021 ఫిబ్రవరి 3న విజయవాడలో "ఈ-వాచ్" యాప్ (eWatch App) ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏడీజీ సంజయ్, ఎన్నికల సంఘ కార్యదర్శి కన్నబాబుతో కలిసి 'ఎస్ఈసీ' (SEC) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆవిష్కరించారు.
- భారత ఎన్నికల సంఘం దగ్గర కొన్ని విధానాలు తీసుకుని ఎస్ఈసీ (SEC) "ఈ-వాచ్" యాప్ (eWatch App) ను తీసుకొచ్చింది.
- "ఈ-వాచ్" యాప్ (eWatch App) గూగుల్ ప్లే స్టోర్ లో 2021 ఫిబ్రవరి 4 నుంచి అందుబాటులోకి వస్తుంది.
- ప్రభుత్వ సర్వర్ మీదే ఈ యాప్ (eWatch App) ను హోస్ట్ చేశారు.
"ఈ-వాచ్" యాప్ (eWatch App) ప్రత్యేకతలు మరియు ప్రయోజనాలు :
- కంప్యూటర్ లో, మొబైల్ లో పని చేస్తుంది.
- ఫోన్ నంబర్ ఆధారంగా ఫిర్యాదుదారుడిని గుర్తిస్తుంది.
- ముందుగా కాల్ సెంటర్ కు, అక్కడి నుంచి కలెక్టర్ కు ఫిర్యాదులు అందజేస్తుంది.
- డబ్బు, మద్యం పంపిణీ, అనుమతి లేని లౌడ్ స్పీకర్లు, ఉద్యోగుల విధుల్లో అలసత్వం తదితర అంశాలపై "ఈ-వాచ్" యాప్ (eWatch App) లో ఫిర్యాదు చేయొచ్చు.
- ఫోటోలు, వీడియోలు 5 ఎంబీ (5 MB) వరకు పంపొచ్చు.
- ముఖ్యమైన ప్రతి ఫిర్యాదుపై ఎస్ఈసీ (SEC) పరిశీలన జరుపుతుంది.
- తీవ్రమైన ఫిర్యాదులపై తక్షణ స్పందన, మిగిలినవి దశల వారీగా పరిష్కారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి