ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, ఫిబ్రవరి 2021, శనివారం

GK TEST-28 DATE : 2021 FEBRUARY 24

1. ఏ దేశంతో భారత్ తొలి డేనైట్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ (INDIA'S FIRST DAY-NIGHT TEST CRICKET MATCH) ఆడింది ? 
(ఎ) శ్రీలంక 
(బి) ఆస్ట్రేలియా  
(సి) బంగ్లాదేశ్  
(డి) ఇంగ్లాండ్ 

2. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏయే తరగతులకు  ప్రభుత్వ పాఠశాలల్లో 'సీబీఎస్ఈ' (CBSE) సిలబస్ ను బోధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అధికారులను ఆదేశించారు ? [2024 నాటికి పదో తరగతి వరకూ బోధించనున్నారు] 
(ఎ) 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు  
(బి) 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు  
(సి) 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు  
(డి) 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 

3. 'వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్' సలహాదారుగా నియమితులైన వ్యక్తి ? [ఇతను వేతనం తీసుకోకుండా స్వచ్చందంగా రెండేళ్లపాటు ట్రస్ట్ కు సేవలందిస్తారు] 
(ఎ) అనిల్ కుమార్ సింఘాల్  
(బి) డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి 
(సి) మారుతీ ప్రసాద్  
(డి) ఆర్.గోవింద్ హరి 



4. 100 'పీ ఎస్ యూ' (PSU) ల్లో ప్రైవేటు పెట్టుబడుల ద్వారా ఎంత మొత్తం రాబట్టాలని నిర్ణయించినట్లు భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' తెలిపారు ? [ఈ సందర్భంగా నాలుగు వ్యూహాత్మక రంగాలు (1. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ 2. రవాణా-టెలీ కమ్యూనికేషన్లు 3. విద్యుత్తు, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు 4. బ్యాంకింగ్, బీమా, ఆర్ధిక సేవలు) తప్ప అన్ని 'పీ ఎస్ యూ' (PSU) లను ప్రైవేటీకరించనున్నట్లు ప్రధాని పునరుద్ఘాటించారు]    
(ఎ) రూ. 1.5 లక్షల కోట్లు 
(బి) రూ. 2.0 లక్షల కోట్లు 
(సి) రూ. 2.5 లక్షల కోట్లు 
(డి) రూ. 3.0 లక్షల కోట్లు 

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 'ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు' (PACS) ఎన్నికల్లో ఎంత షేరుధనంపైన ఉన్నవారే ఓటు హక్కు కలిగి ఉంటారు ? [రెండేళ్లలో రూ. 5 వేలు, ఆరు నెలల్లో రూ. 10వేల మేర డిపాజిట్లు ఉన్న సభ్యులకూ ఓటు హక్కు ఉంటుంది. సభ్యులు తీసుకున్న బాకీ వాయిదా .. సంవత్సరం దాటి ఉంటే అలాంటివారు ఓటు హక్కును కోల్పోతారు] 
(ఎ) రూ. 100   
(బి) రూ. 300  
(సి) రూ. 500  
(డి) రూ. 700 

6. 2021 మార్చ్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఎన్ని సంవత్సరాలు పైబడిన వారందరికీ 'కొవిడ్-19 టీకాలు' ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? 
(ఎ) 45 
(బి) 50 
(సి) 55 
(డి) 60 



7. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన 'మొతేరా' మైదానానికి పునర్నిర్మాణం తర్వాత ఏమని నామకరణం చేశారు ? [భారత రాష్ట్రపతి 'రామ్ నాథ్ కోవింద్' 2021 ఫిబ్రవరి 24న ఈ స్టేడియం ను ప్రారంభించారు] 
(ఎ) రామ్ నాథ్ కోవింద్ స్టేడియం 
(బి) సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ స్టేడియం 
(సి) నరేంద్ర మోదీ స్టేడియం 
(డి) శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియం 

8. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర క్యాబినెట్ 2021 ఫిబ్రవరి 24న ఆమోదముద్ర వేసింది. 'పుదుచ్చేరి' (PUDUCHERRY) లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది ఎన్నోసారి ?  
(ఎ) 5  
(బి) 6  
(సి) 7 
(డి) 8  

9. 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన' (PM-KISAN) అమలులో "పీఎం కిసాన్ ఖాతాలకు ఆధార్ కార్డుల అనుసంధానం, పరిశీలన" కేటగిరిలో మరియు "రైతుల ఫిర్యాదుల పరిష్కారం" విభాగంలో అవార్డులు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు వరుసగా .. ? ['పీఎం కిసాన్' పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా 2021 ఫిబ్రవరి 24న ఈ అవార్డులను అందజేశారు]
(ఎ) అనంతపురం, చిత్తూరు 
(బి) అనంతపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు  
(సి) అనంతపురం, వైఎస్సార్ (కడప)  
(డి) అనంతపురం, ప్రకాశం  



10. ఒకసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని ఏ సంవత్సరం నాటికల్లా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ? [ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు "6ఆర్" (REDUCE, RECYCLE, REUSE, RECOVER, REDESIGN, REMANUFACTURE) - 6R విధానాన్ని అనుసరించాలని ప్రధాని 'నరేంద్ర మోదీ' చెప్పారు] 
(ఎ) 2021 
(బి) 2022 
(సి) 2023 
(డి) 2024              

కీ (KEY) (GK TEST-28 DATE : 2021 FEBRUARY 24)
1) సి    2) బి    3) డి    4) సి    5) బి    6) డి    7) సి    8) సి    9) బి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి