ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, ఫిబ్రవరి 2021, మంగళవారం

GK TEST-6 DATE : 2021 FEBRUARY 2

1. భారతదేశంలో జరిగిన ఏ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా "నోటా" (NOTA) ను ఉపయోగించారు ? [కానీ ఈ ఎన్నికలకు ముందు సంవత్సరంలో జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 'నోటా' (NOTA) ను 'ఈవీఎం' (EVM) లలో ప్రవేశపెట్టారు] 
(ఎ) 2004 
(బి) 2009  
(సి) 2014  
(డి) 2019 

2. భారతదేశంలో కొవిడ్ టీకా (కొవిషీల్డ్) బట్వాడా (2021 జనవరి 12) లో తొలి సర్వీస్ ను నిర్వహించిన విమానయాన సంస్థ ? 
(ఎ) స్పైస్ జెట్ 
(బి) గో ఎయిర్  
(సి) ఇండిగో  
(డి) ట్రూజెట్ 

3. భారతదేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల (కోవిషీల్డ్, కొవాగ్జిన్) కార్యక్రమం మొదలైన తేదీ ? 
(ఎ) 2021 జనవరి 14  
(బి) 2021 జనవరి 15 
(సి) 2021 జనవరి 16 
(డి) 2021 జనవరి 17 



4. 2020 డిసెంబర్ 31న భారత రైల్వే బోర్డ్ నూతన చైర్మన్, సీఈఓ గా (Indian Railway Board new Charman and CEO) నియమితులైనది ? 
(ఎ) సురేశ్ చంద్ర శర్మ 
(బి) ప్రదీప్త కుమార్ బిషోయ్ 
(సి) సునీత్ శర్మ 
(డి) ఆర్.సి.భార్గవ 

5. గోవాకు చెందిన 14 ఏళ్ల "లియోన్ మెండొంకా" (LEON MENDONCA) ఇటలీలో జరిగిన 'వెర్గాని కప్' లో మూడో నార్మ్ గెలుచుకుని గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. ఇతను భారతదేశానికి సంబంధించి ఎన్నవ గ్రాండ్ మాస్టర్ ? [ఇతను గోవా నుంచి గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన రెండో ఆటగాడు. ఇతని ప్రస్తుత ఎలో రేటింగ్ : 2544]  
(ఎ) 66   
(బి) 67  
(సి) 68  
(డి) 69 

6. "సీ వింగ్ గ్లైడర్స్" (Sea Wing Gliders) అనే 12 జలాంతర్గత డ్రోన్లను హిందూ మహాసముద్రంలో మోహరించిన దేశం ? [ప్రత్యర్థి యుద్ధ నౌకల కదలికలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ విశ్లేషకుడు 'హెచ్ ఐ సట్టన్' పేర్కొన్నారు] 
(ఎ) అమెరికా 
(బి) పాకిస్థాన్ 
(సి) ఉత్తర కొరియా 
(డి) చైనా 



7. 2021 జనవరి 1న వర్చువల్ విధానంలో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో 'ఉత్తమ సమర్ధత చూపిన నగరపాలక సంస్థ' విభాగంలో మొదటి ర్యాంక్ సాధించినది ? ['పీఎంఎవై (పట్టణ)' ఇళ్ల నిర్మాణ కార్యక్రమ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది]  
(ఎ) జీవీఎంసి (విశాఖపట్నం) 
(బి) తుడా (తిరుపతి) 
(సి) విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 
(డి) కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ 

8. 2021 జనవరి 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ "జీ హెచ్ టీ సీ - ఇండియా" (GHTC-INDIA) కింద ఎన్ని లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు ?  
(ఎ) 10  
(బి) 4  
(సి) 6 
(డి) 8  

9. 2021 జనవరి 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా "జస్టిస్ జోయ్ మల్య బాగ్చి" (Justice Joymalya Bagchi) బాధ్యతలు స్వీకరించకముందు ఏ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు ?
(ఎ) మద్రాస్ హైకోర్ట్ 
(బి) సిక్కిం హైకోర్ట్ 
(సి) కలకత్తా హైకోర్ట్  
(డి) అసోం హైకోర్ట్  



10. "బీమా కోరేగావ్ యుద్ధం" (BATTLE OF KOREGAON) జరిగిన తేదీ ? [అంటరానితనానికి వ్యతిరేకంగా .. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, మరాఠాల్లోని పేష్వా వర్గానికి మధ్య ఈ యుద్ధం జరిగింది] 
(ఎ) 1808 జనవరి 1 
(బి) 1818 జనవరి 1 
(సి) 1828 జనవరి 1 
(డి) 1838 జనవరి 1              

కీ (KEY) (GK TEST-6 DATE : 2021 FEBRUARY 2)
1) సి    2) ఎ    3) సి    4) సి    5) బి    6) డి    7) ఎ    8) సి    9) సి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి