1. భారత ఔషధ నియంత్రణ మండలి (DCGI) వద్ద కొవిడ్-19 టీకా అత్యవసర వినియోగ అనుమతి కోసం ముందుగా దరఖాస్తు చేసిన సంస్థ ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) భారత్ బయోటెక్
(బి) ఆస్ట్రాజెనెకా
(సి) ఫైజర్
(డి) గమలేయా
2. 2021 ఫిబ్రవరి 4న జరిగిన ఆన్లైన్ వేలంలో 'ఈషా ఫౌండేషన్' (ISHA FOUNDATION) వ్యవస్థాపకుడు 'సద్గురు జగ్గీవాసుదేవ్' గీసిన మూడో పెయింటింగ్ "సిర్కా-2020" (CIRCA-2020) సొంతం చేసుకున్న మొత్తం ? [గతంలో సద్గురు రెండు పెయింటింగులు రూ. 9.24 కోట్లకు విక్రయమయ్యాయి]
(ఎ) రూ. 1.3 కోట్లు
(బి) రూ. 2.3 కోట్లు
(సి) రూ. 3.3 కోట్లు
(డి) రూ. 4.3 కోట్లు
3. 1971 జనవరి 20న భారత ప్రధాని 'ఇందిరా గాంధీ' శంకుస్థాపన చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (RINL) ను 1992లో జాతికి అంకితం చేసిన ప్రధాని ?
(ఎ) చంద్రశేఖర్ సింగ్
(బి) పీ.వీ.నరసింహారావు
(సి) ఐ.కే.గుజ్రాల్
(డి) రాజీవ్ గాంధీ
4. చరిత్రలోనే తొలిసారిగా 'బీఎస్ఈ' (BSE) లో మదుపర్ల సంపద రూ. 200 లక్షల కోట్లు దాటిన తేదీ ? ['బీఎస్ఈ' (BSE) లో మదుపర్ల సంపద 2002 మార్చ్ ఆఖరుకు రూ. 6 లక్షల కోట్లు, 2014 నవంబర్ 14న రూ. 100 లక్షల కోట్ల మార్క్ ను చేరుకుంది]
(ఎ) 2021 ఫిబ్రవరి 2
(బి) 2021 ఫిబ్రవరి 4
(సి) 2021 ఫిబ్రవరి 6
(డి) 2021 ఫిబ్రవరి 8
5. కరోనా విరామం తర్వాత భారత్ (చెన్నై) లో 2021 ఫిబ్రవరి 5న ప్రారంభమైన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ (టెస్ట్ మ్యాచ్) లో భారత జట్టుతో తలపడిన ప్రత్యర్థి జట్టు ?
(ఎ) ఇంగ్లాండ్
(బి) ఆస్ట్రేలియా
(సి) న్యూజీలాండ్
(డి) దక్షిణాఫ్రికా
6. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా (మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు) "చక్కా జామ్" (రాస్తా రోకో) నిర్వహించిన తేదీ ?
(ఎ) 2021 ఫిబ్రవరి 5
(బి) 2021 ఫిబ్రవరి 6
(సి) 2021 ఫిబ్రవరి 7
(డి) 2021 ఫిబ్రవరి 8
7. కర్ణాటకలోని 'మడికేరి' పట్టణంలో "జనరల్ కె.ఎస్.తిమ్మయ్య మ్యూజియం" (General K.S.Thimayya Memorial Museum) ను 2021 ఫిబ్రవరి 6న జాతికి అంకితం చేసినది ? [తిమ్మయ్య 1957 నుంచి 1961వ సంవత్సరం వరకు సైన్యంలో జనరల్ గా సేవలందించారు]
(ఎ) రామ్ నాథ్ కోవింద్
(బి) ఎం.వెంకయ్య నాయుడు
(సి) నరేంద్ర మోదీ
(డి) రాజ్ నాథ్ సింగ్
8. తన వందో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ ? [సిక్సర్ తో ద్విశతకం పూర్తిచేసిన తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా కూడా అతను నిలిచాడు]
(ఎ) ఆలిస్టర్ కుక్
(బి) గ్రాహం గూచ్
(సి) జో రూట్
(డి) అలెక్ స్టీవార్ట్
9. ఓ పర్యటక జట్టు కెప్టెన్ (క్లైవ్ లాయిడ్) భారత్ లో టెస్టుల్లో సాధించిన అత్యధిక స్కోరు ?
(ఎ) 241 నాటౌట్
(బి) 242 నాటౌట్
(సి) 243 నాటౌట్
(డి) 244 నాటౌట్
10. దట్టమైన అడవుల్లో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 'సీ ఆర్ పీ ఎఫ్' (CRPF) లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన "కోబ్రా" (CoBRA) దళంలో తొలిసారిగా 34 మంది మహిళా సిబ్బందిని గురుగ్రామ్ లోని 'కదార్ పుర్' గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'సీ ఆర్ పీ ఎఫ్' డీజీ 'ఏపీ మహేశ్వరి' సమక్షంలో లాంఛనంగా తీసుకున్న తేదీ ? [దట్టమైన అటవీ ప్రాంతాల్లో విధి నిర్వహణ కోసం 'సీ ఆర్ పీ ఎఫ్' లో "కోబ్రా" పేరుతో 2009లో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు]
(ఎ) 2021 ఫిబ్రవరి 5
(బి) 2021 ఫిబ్రవరి 6
(సి) 2021 ఫిబ్రవరి 7
(డి) 2021 ఫిబ్రవరి 8
కీ (KEY) (GK TEST-12 DATE : 2021 FEBRUARY 8)
1) సి 2) బి 3) బి 4) బి 5) ఎ 6) బి 7) ఎ 8) సి 9) బి 10) బి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి