1. సమర్ధవంతమైన, పారదర్శక పాలనకు ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' కి "స్కోచ్ ఈ ఏటి ముఖ్యమంత్రి" (SKOCH CM OF THE YEAR) అవార్డును 2021 ఫిబ్రవరి 16న అందజేసిన స్కోచ్ గ్రూప్ చైర్మన్ ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) గుర్జిత్ సింగ్ కొచ్చర్
(బి) దీపక్ కొచ్చర్
(సి) సమీర్ కొచ్చర్
(డి) చందా కొచ్చర్
2. తాజా కేంద్ర బడ్జెట్ 2021-22 (UNION BUDGET 2021-22) లో కిరోసిన్ సబ్సిడీకి కేటాయించిన మొత్తం ?
(ఎ) రూ. 0
(బి) రూ. 100
(సి) రూ. 1,000
(డి) రూ. 10,000
3. ఏ రాష్ట్రంలోని 'బహ్రెయిచ్' జిల్లాలో నిర్మించనున్న "మహారాజా సుహేల్ దేవ్" (Warrior King SUHELDEV) విగ్రహానికి 2021 ఫిబ్రవరి 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' శంకుస్థాపన నిర్వహించారు ?
(ఎ) ఉత్తర్ ప్రదేశ్
(బి) గుజరాత్
(సి) మహారాష్ట్ర
(డి) పశ్చిమ బెంగాల్
4. కేంద్రపాలిత ప్రాంతమైన 'పుదుచ్చేరి' ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ? (Puducherry present Lieutenant-Governor)
(ఎ) కిరణ్ బేడీ
(బి) ఆనందీ బెన్ పటేల్
(సి) తమిళిసై సౌందరరాజన్
(డి) బిశ్వభూషణ్ హరిచందన్
5. 'సిల్వర్ స్ప్రింగ్' (అమెరికా) బిట్ కాయిన్ (SILVER SPRING Bitcoin) చరిత్రలో తొలిసారిగా 50,000 డాలర్ల మైలురాయిని అధిగమించిన తేదీ ?
(ఎ) 2021 ఫిబ్రవరి 13
(బి) 2021 ఫిబ్రవరి 14
(సి) 2021 ఫిబ్రవరి 15
(డి) 2021 ఫిబ్రవరి 16
6. ఓపెన్ శకంలో గ్రాండ్ స్లామ్ అరంగేట్రంలోనే సెమీఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించిన "అస్లాన్ కరాత్సెవ్" (ASLAN KARATSEV) ది ఏ దేశం ? ['ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021' (Australian Open 2021) టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ 114వ ర్యాంకర్ అయిన 'అస్లాన్ కరాత్సెవ్' పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో 2-6, 6-4, 6-1, 6-2 తో 18వ సీడ్ 'దిమిత్రోవ్' (బల్గెరియా) ను ఓడించాడు]
(ఎ) అమెరికా
(బి) కెనడా
(సి) రష్యా
(డి) సెర్బియా
7. అరంగేట్ర టెస్టులో ఓ ఇన్నింగ్స్ లో అయిదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్లలో "అక్షర్ పటేల్" ఎన్నవ వాడు ? [దిలీప్ (1979లో ఆస్ట్రేలియాపై 6/103) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా ఇతనే]
(ఎ) 6
(బి) 7
(సి) 8
(డి) 9
8. 2021 ఫిబ్రవరి 17న టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన "ఫాఫ్ డుప్లెసిస్" (Faf du Plessis retired from Test Cricket) ది ఏ దేశం ? [36 ఏళ్ల డుప్లెసిస్ ఆ దేశం తరపున 69 టెస్టుల్లో 40.02 సగటుతో 4,163 పరుగులు చేశాడు]
(ఎ) ఆస్ట్రేలియా
(బి) ఇంగ్లాండ్
(సి) న్యూజీలాండ్
(డి) దక్షిణాఫ్రికా
9. కెరీర్ లో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో రికార్డు సృష్టించాలనుకున్న స్పెయిన్ బుల్ 'రఫెల్ నాదల్' ను 'ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021' (AUSTRALIAN OPEN 2021) క్వార్టర్ ఫైనల్స్ లో 3-6, 2-6, 7-6 (7-4), 6-4, 7-5 స్కోర్ తో ఓడించినది ? [కెరీర్ లో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 225 సార్లు తొలి రెండు సెట్లు గెలుచుకున్న నాదల్ .. ఓటమి చవిచూడడం ఇది రెండోసారి మాత్రమే]
(ఎ) మెద్వేదేవ్ (రష్యా)
(బి) అస్లాన్ కరాత్సెవ్ (రష్యా)
(సి) సిట్సిపాస్ (గ్రీస్)
(డి) జకోవిచ్ (సెర్బియా)
10. ప్రపంచ నంబర్ వన్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి 'ఆష్లే బార్టీ' (ఆస్ట్రేలియా) ను 'ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021' (AUSTRALIAN OPEN 2021) క్వార్టర్ ఫైనల్స్ లో 1-6, 6-3, 6-2 స్కోర్ తో ఓడించినది ?
(ఎ) జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)
(బి) జెస్సికా పెగులా అమెరికా)
(సి) కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)
(డి) నవోమి ఒసాకా (జపాన్)
కీ (KEY) (GK TEST-22 DATE : 2021 FEBRUARY 18)
1) సి 2) ఎ 3) ఎ 4) సి 5) డి 6) సి 7) డి 8) డి 9) సి 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి