1. స్ప్రింటర్ "హిమదాస్" (HIMA DAS) ని 'డీఎస్పీ' (DSP) గా నియమించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? [ఒలింపిక్, ఆసియా, కామన్వెల్త్ పతక విజేతలను క్లాస్-1 అధికారులుగా నియమించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) ఒడిశా
(బి) పంజాబ్
(సి) పశ్చిమ బెంగాల్
(డి) అసోం
2. భారతదేశం అధికారికంగా ఆస్కార్ పోటీకి పంపిన చిత్రం ? [కానీ తుది జాబితా (SHORTLIST) లో ఈ మలయాళ చిత్రం చోటు సంపాదించలేకపోయింది]
(ఎ) లూసిఫర్
(బి) రన్నింగ్ పాజిటివ్
(సి) బిట్టు
(డి) జల్లికట్టు
3. తమ భూభాగంలోకి వచ్చే మూడు పంచాయితీల పేర్లు మార్చి .. అక్కడ ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ 2021 ఫిబ్రవరి 10 రాత్రి సుప్రీంకోర్టు లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్రం ?
(ఎ) తమిళనాడు
(బి) ఒడిశా
(సి) కర్ణాటక
(డి) తెలంగాణ
4. కొవిడ్-19 వ్యాధి నివారణ కోసం ముక్కు ద్వారా ఇచ్చే టీకా [చింపాంజీ ఆడెనోవైరస్ వెక్టార్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ (BBV154) (INTRANASAL)] పై మొదటి దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని 'సీ డీ ఎస్ సీ ఓ' (CDSCO) కు చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (SEC) ఏ సంస్థకు అనుమతి ఇచ్చింది ?
(ఎ) భారత్ బయోటెక్
(బి) బయోలాజికల్ ఇ. లిమిటెడ్
(సి) ఇండియన్ ఇమ్మ్యూనోలాజికల్స్ లిమిటెడ్
(డి) సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
5. "తేజస్విని 2.0" (TEJASWINI 2.0) పథకం కింద నైపుణ్యం లేని మహిళా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఇనుప గనుల్లో భారీ యంత్రాల (Heavy Earthmoving Machinery) నిర్వహణ కోసం తొలిసారిగా 22 మంది మహిళా ఆపరేటర్లను నియమించిన ప్రముఖ ఉక్కు ఉత్పత్తి సంస్థ ?
(ఎ) టాటా స్టీల్
(బి) జే ఎస్ డబ్ల్యు స్టీల్
(సి) ఎస్సార్ స్టీల్
(డి) జిందాల్ స్టీల్
6. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల నుంచి బలగాల ఉపసంహరణకు భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయని భారత రక్షణశాఖా మంత్రి 'రాజ్ నాథ్ సింగ్' పార్లమెంటులో పేర్కొన్న తేదీ ? [పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో రెండు దేశాల మధ్య గత ఏడాది మే 5న తీవ్ర ఘర్షణ జరిగింది]
(ఎ) 2021 ఫిబ్రవరి 10
(బి) 2021 ఫిబ్రవరి 11
(సి) 2021 ఫిబ్రవరి 12
(డి) 2021 ఫిబ్రవరి 13
7. దేశంలోనే తొలి 'సీ ఎన్ జీ' (CNG) ట్రాక్టర్ ను కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' దిల్లీలో ఆవిష్కరించిన తేదీ ? [ఈ ట్రాక్టర్ ను వినియోగిస్తే ఇంధన ఖర్చుల రూపంలో ఏటా రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు ఆదా చేయవచ్చు]
(ఎ) 2021 ఫిబ్రవరి 10
(బి) 2021 ఫిబ్రవరి 11
(సి) 2021 ఫిబ్రవరి 12
(డి) 2021 ఫిబ్రవరి 13
8. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) మేయర్ గా ఎన్నికైనది ? [తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక .. వరుసగా రెండోసారి గ్రేటర్ పీఠాన్ని 'తెరాస' (TRS) దక్కించుకున్నట్లయింది]
(ఎ) గద్వాల్ విజయలక్ష్మి
(బి) మోతె శ్రీలతా రెడ్డి
(సి) రాధా ధీరజ్ రెడ్డి
(డి) శంకర్ యాదవ్
9. పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం ప్రకారం .. "మక్కళ్ నీది మయ్యం" (MNM) పార్టీ శాశ్వత అధ్యక్షుడు ? ['ఎంఎన్ఎం' (MNM) పార్టీ తొలి సర్వసభ్య సమావేశం చెన్నైలో 2021 ఫిబ్రవరి 11న జరిగింది]
(ఎ) శరత్ కుమార్
(బి) రజనీకాంత్
(సి) విజయకాంత్
(డి) కమల్ హాసన్
10. 'వి ఎల్ సీ సీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2020' (VLCC Femina Miss India World-2020) విజేత ?
(ఎ) సుమన్ రావు
(బి) మాన్యా సింగ్
(సి) మానస వారణాసి
(డి) మణికా షియోకండ్
కీ (KEY) (GK TEST-18 DATE : 2021 FEBRUARY 14)
1) డి 2) డి 3) బి 4) ఎ 5) ఎ 6) బి 7) సి 8) ఎ 9) డి 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి