ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, ఫిబ్రవరి 2021, మంగళవారం

GK TEST-25 DATE : 2021 FEBRUARY 21

1. శత్రు ట్యాంకుల భరతం పట్టే 'యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్' (ATGM) ను భారత సైన్యం 2021 ఫిబ్రవరి 19న రాజస్థాన్ లోని 'పోఖ్రాన్' లో విజయవంతంగా పరీక్షించింది. 'డీ ఆర్ డీ ఓ' (DRDO) రూపొందించిన ఈ క్షిపణి ఎన్నో తరానికి చెందినది ? [ఈ క్షిపణిని సైన్యంలో "హెలినా" (HELINA) అని, వాయుసేనలో "ధృవాస్త్ర" (DHRUVASTRA) అని పిలుస్తారు. దీన్ని 'ఫైర్ అండ్ ఫర్ గెట్ మిస్సైల్' (Fire-and-Forget Missile) అని కూడా అంటారు]  
(ఎ) ఒకటో తరం 
(బి) రెండో తరం  
(సి) మూడో తరం  
(డి) నాలుగో తరం 

2. 2021 ఫిబ్రవరి 19న దిల్లీలో "విద్యుత్తు వైపు వెళ్దాం" ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ? 
(ఎ) నితిన్ గడ్కరీ 
(బి) ఆర్.కె.సింగ్  
(సి) రాజ్ నాథ్ సింగ్  
(డి) అమిత్ షా 

3. విజయవాడకు సమీపంలోని ఏ గ్రామం వద్ద 'అశోక్ లేలాండ్' (ASHOK LEYLAND) నెలకొల్పిన బస్సుల తయారీ యూనిట్ లో 2021 ఫిబ్రవరి 19న ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ? [బీఎస్-6 (BS-VI) ప్రమాణాలు గల బస్సులనే ఈ యూనిట్ లో తయారు చేయనున్నారు] 
(ఎ) మల్లవల్లి  
(బి) తాడేపల్లి 
(సి) వేమవరం 
(డి) రాయనపాడు 



4. పోలవరం డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ (Polavaram Dam Design Review Committee) ప్రస్తుత చైర్మన్ ? 
(ఎ) చంద్రశేఖర్ అయ్యర్ 
(బి) ఏబీ పాండ్యా 
(సి) హరికేశ్ కుమార్ 
(డి) ఆదిత్యామిశ్రా  

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ? 
(ఎ) జస్టిస్ కనగరాజ్   
(బి) జస్టిస్ ఈశ్వరయ్య  
(సి) జస్టిస్ కాంతారావు  
(డి) జస్టిస్ ప్రవీణ్ కుమార్ 

6. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేళ తాను కొత్తగా రూపొందించిన ఫాంట్స్ (ఖతులు) ను 2021 ఫిబ్రవరి 21న తెలుగువారికి బహుమతిగా అందించబోతున్న సినీ ప్రముఖుడు ?
(ఎ) అప్పాజీ అంబరీష 
(బి) సిరివెన్నెల సీతారామశాస్త్రి 
(సి) త్రివిక్రమ్ శ్రీనివాస్ 
(డి) చంద్రబోస్ 



7. 2021 ఫిబ్రవరి 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన 'నీతి ఆయోగ్' (NITI AAYOG) పాలకమండలి సమావేశం ఎన్నోది ? 
(ఎ) 4 
(బి) 5 
(సి) 6 
(డి) 7 

8. 'నీతి ఆయోగ్' (NITI AAYOG) ప్రస్తుత ఉపాధ్యక్షుడు ?  
(ఎ) రాజీవ్ కుమార్  
(బి) అమితాబ్ కాంత్   
(సి) కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ 
(డి) నరేంద్ర మోదీ  

9. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 (AUSTRALIAN OPEN 2021) మహిళల సింగిల్స్ విజేత ? [రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), మోనికా సెలెస్ (అమెరికా) తర్వాత ఆడిన తొలి నాలుగు ఫైనల్స్ లో టైటిళ్లు సొంతం చేసుకున్న ఘనతను కూడా ఈ క్రీడాకారిణి సాధించింది]
(ఎ) నవోమి ఒసాకా (జపాన్) 
(బి) సెరెనా విలియమ్స్ (అమెరికా) 
(సి) జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)  
(డి) ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)  



10. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన "మొతేరా" స్టేడియం (MOTERA CRICKET STADIUM) ఏ రాష్ట్రంలో ఉంది ? [ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా మైదానాలు తీసుకుంటే .. 1,14,000 సామర్ధ్యమున్న ఉత్తర కొరియా 'రన్ గ్రాడో మే డే' స్టేడియం తర్వాతి స్థానం (1,10,000) 'మొతేరా' దే] 
(ఎ) తెలంగాణ 
(బి) గుజరాత్ 
(సి) మహారాష్ట్ర 
(డి) పశ్చిమ బెంగాల్              

కీ (KEY) (GK TEST-25 DATE : 2021 FEBRUARY 21)
1) సి    2) ఎ    3) ఎ    4) బి    5) సి    6) ఎ    7) సి    8) ఎ    9) ఎ    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి