ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, ఫిబ్రవరి 2021, శనివారం

GK TEST-23 DATE : 2021 FEBRUARY 19

1. భారత్ లో టెలికాం పరికరాల తయారీకి ఊతమిచ్చేందుకు రూ. 12,195 కోట్ల విలువైన "ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకం" (PLI) పథకం అమలులో 'తయారీ వస్తువుల సమ్మిళిత విక్రయాలు' పై వేసే పన్నును నిర్ణయించడానికి ఏ ఏడాదిని 'ప్రాతిపదిక సంవత్సరం' గా భావిస్తారు ? 
(ఎ) 2017-18 
(బి) 2018-19  
(సి) 2019-20  
(డి) 2020-21 

2. భారత్ లో 'క్రిప్టో కరెన్సీ' (CRYPTOCURRENCY) ట్రేడింగ్ పై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడు ఎత్తేసింది ? 
(ఎ) 2020 జనవరి  
(బి) 2020 ఫిబ్రవరి  
(సి) 2020 మార్చ్  
(డి) 2020 ఏప్రిల్ 

3. 'జాతీయ ఎస్సీ కమిషన్' (NCSC) చైర్మన్ గా నియమితులైన పంజాబ్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి ? 
(ఎ) నందకుమార్ సాయి   
(బి) రామ్ శంకర్ కటారియా 
(సి) యోగేంద్ర పాశ్వాన్ 
(డి) విజయ్ సాంప్లా  



4. 'మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ'ఆధ్వర్యంలో 2019లో ఏర్పడిన "రాష్ట్రీయ కామధేను ఆయోగ్" (RKA) 'ఆవు' పై దేశవ్యాప్తంగా 'కామధేను గౌ విజ్ఞాన్ ప్రచార్-ప్రసార్' ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తున్న తేదీ ? [ఈ సంస్థ దేశీయ ఆవుల ఆర్ధిక, శాస్త్రీయ, పర్యావరణ, వ్యవసాయ, ఆరోగ్య, ఆథ్యాత్మిక ప్రయోజనాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తోంది]  
(ఎ) 2021 ఫిబ్రవరి 22 
(బి) 2021 ఫిబ్రవరి 23 
(సి) 2021 ఫిబ్రవరి 24 
(డి) 2021 ఫిబ్రవరి 25 

5. 'ఐపీల్' వేలం చరిత్రలో అత్యధిక ధర (రూ. 16 కోట్ల 25 లక్షలు) పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించినది ? [ఇంతకుముందు ఆ రికార్డు 'యువరాజ్ సింగ్' (2015లో దిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్లు) పేరిట ఉంది] 
(ఎ) కైల్ జెమీసన్ (న్యూజీలాండ్)     
(బి) క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)  
(సి) గ్లెన్ మ్యాక్స్ వెల్ (ఆస్ట్రేలియా)  
(డి) జే రిచర్డ్ సన్ (ఆస్ట్రేలియా) 

6. భారత ప్రభుత్వం నియమించిన 'టీకా ప్రయోగాల పరిశీలన కమిటీ' (VEC) చైర్మన్ ? 
(ఎ) జి.పద్మనాభన్ 
(బి) రామభద్రన్ ఎస్. తిరుమలై 
(సి) సి.వేణుగోపాల్ 
(డి) బ్రిజేష్ పటేల్  



7. సైన్యంలో పనిచేసి అవార్డులు పొందిన సాహస యోధులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేసే నజరానాను ఎన్ని రెట్లు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2021 ఫిబ్రవరి 18న తిరుపతిలో జరిగిన 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' (SWARNIM VIJAY VARSH) కార్యక్రమంలో ప్రకటించారు ?  
(ఎ) 5  
(బి) 10 
(సి) 15 
(డి) 20 

8. అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండా 'ఐపీల్' వేలంలో అత్యధిక ధర (రూ. 9 కోట్ల 25 లక్షలు) పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించినది ?  
(ఎ) కృష్ణప్ప గౌతమ్ (కర్ణాటక)  
(బి) షారుఖ్ ఖాన్ (తమిళనాడు)  
(సి) చేతన్ సకారియా (సౌరాష్ట్ర) 
(డి) కే ఎస్ భరత్ (ఆంధ్రప్రదేశ్)  

9. రూ. 3,231 కోట్ల వ్యయంతో నిర్మించిన "మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్ట్" ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2021 ఫిబ్రవరి 18న వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ ను ఏ రాష్ట్రంలో నిర్మించారు ? 
(ఎ) అరుణాచల్ ప్రదేశ్  
(బి) అసోం 
(సి) మేఘాలయ   
(డి) పశ్చిమ బెంగాల్  



10. రాజస్థాన్ లోని 'లోంగేవాలా' వద్ద పాకిస్థాన్ సైన్యంతో 1971లో భారత్ సాగించిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి  50వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న నేపథ్యంలో వైమానిక దళ ఉన్నతాధికారి రచించిన "ద ఎపిక్ బ్యాటిల్ ఆఫ్ లోంగేవాలా" (THE EPIC BATTLE OF LONGEWALA) అనే పుస్తకాన్ని 2021 ఫిబ్రవరి 18న ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత పేరు ?  
(ఎ) ఆర్.కె.ఎస్.భదౌరియా 
(బి) భరత్ కుమార్ 
(సి) సి.వేణుగోపాల్ 
(డి) అరుణ్ కుమార్              

కీ (KEY) (GK TEST-23 DATE : 2021 FEBRUARY 19)
1) సి    2) సి    3) డి    4) డి    5) బి    6) ఎ    7) బి    8) ఎ    9) బి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి