ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఫిబ్రవరి 2021, బుధవారం

SOLAR POWER PROJECTS UNDER VGF

"వయబిలిటీ గ్యాప్ ఫండింగ్" విధానంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు
(SOLAR POWER PROJECTS UNDER 'VIABILITY GAP FUNDING')


  • ప్రభుత్వరంగ సంస్థల విద్యుత్తు అవసరాల కోసం 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్' (VGF) విధానంలో దేశవ్యాప్తంగా 12వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని 'కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ' (MNRE) భావిస్తోంది.

నిబంధనలు (RULES) :

  1. ఈ పథకం కింద యూనిట్ ధర రూ. 2.20కి మించకూడదు.
  2. మెగావాట్ కు రూ. 70 లక్షలను కేంద్రం గ్రాంటు రూపేణా అందిస్తుంది. సోలార్ పార్కులను ప్రోత్సహించడానికి మెగావాట్ కు రూ. 20 లక్షల వంతున ఇచ్చే ప్రయోజనమూ అందుతుంది. అంటే మెగావాట్ కు రూ. 90 లక్షలు కేంద్రం నుంచి గ్రాంటు రూపేణా వస్తుంది.
  3. కనీసం 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి. దీన్ని 24 నెలల్లో పూర్తి చేయాలి. అంతకు మించి సామర్థ్యం ఉంటే అదనంగా 6 నెలల గడువు ఇస్తారు.
  4. 5వేల మెగావాట్ల ప్రాజెక్టులకు అవసరమైన సౌర విద్యుత్ ఫలకాలను స్థానిక కంపెనీల్లో తయారైన వాటినే వినియోగించాలి.    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి