ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, ఫిబ్రవరి 2021, గురువారం

GK TEST-26 DATE : 2021 FEBRUARY 22

1. ప్రపంచంలోనే అతి పెద్ద జంతుప్రదర్శనశాల (జంతువుల సంఖ్య రీత్యా) (Greens Zoological Rescue and Rehabilitation Kingdom) ను 'ఆర్ ఐ ఎల్' చైర్మన్ 'ముకేశ్ అంబానీ' గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ప్రాంతం ? [ఈ జూ (ZOO) 2023లో సందర్శకులకు అందుబాటులోకి రానుంది] 
(ఎ) గాంధీనగర్ 
(బి) జామ్ నగర్   
(సి) జునాగఢ్  
(డి) భావ్ నగర్ 

2. ఏటీఎం ల నుంచి డబ్బులు తీసుకున్న తరహాలోనే రేషన్ బియ్యం, గోధుమలనూ పొందేలా 'ఆటోమేటిక్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మిషన్' (AUTOMATIC GRAIN DISPENSING MISSION) లను దేశంలోని 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి మిషన్ ను ప్రయోగాత్మకంగా ఏ నగరంలో ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం అంగీకరించింది ?  
(ఎ) అహ్మదాబాద్ 
(బి) రాజ్ కోట్  
(సి) వడోదర  
(డి) సూరత్ 

3. ఏ ప్రభుత్వరంగ బ్యాంక్ కు 'మేనేజింగ్ డైరెక్టర్ (MD), ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) గా తెలుగువారైన "మాతం వెంకటరావు" (MATAM VENKATA RAO) 2021 మార్చ్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు ? 
(ఎ) పంజాబ్ నేషనల్ బ్యాంక్  
(బి) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
(సి) యూకో బ్యాంక్ 
(డి) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 



4. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 (AUSTRALIAN OPEN 2021) పురుషుల సింగిల్స్ ఫైనల్ లో ఎవరిని ఓడించడం ద్వారా 'నొవాక్ జకోవిచ్' (సెర్బియా) విజేతగా నిలిచాడు ? [ఈ విజయంతో 'రోజర్ ఫెదరర్' (310) ను దాటి అత్యధిక వారాలు (311) నంబర్ వన్ గా ఉన్న రికార్డును కూడా 'నొవాక్ జకోవిచ్' సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో పురుషుల్లో అత్యధిక టైటిళ్ల రికార్డు కూడా ఇతనిదే] 
(ఎ) స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్)  
(బి) డానియెల్ మెద్వేదేవ్ (రష్యా)  
(సి) అస్లాన్ కరాత్సేవ్ (రష్యా)  
(డి) రఫెల్ నాదల్ (స్పెయిన్) 

5. ఐపీల్ 2021 (IPL 2021) ఆటగాళ్ల వేలం పాటలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల జట్టు సారథి ? 
(ఎ) స్టీవెన్ స్మిత్   
(బి) డేవిడ్ వార్నర్  
(సి) ఆరోన్ ఫించ్  
(డి) పాట్ కమిన్స్ 

6. 2021 ఏడాదికి సంబంధించి 'బ్రిక్స్' (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) (BRICS) అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన దేశం ?
(ఎ) దక్షిణాఫ్రికా 
(బి) ఇండియా 
(సి) రష్యా 
(డి) బ్రెజిల్ 



7. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణికి సంబంధించిన నిట్టనిలువు ప్రయోగ వెర్షన్ (VL-SRSAM) ను భారత్ 2021 ఫిబ్రవరి 22న ఒడిశా తీరంలోని చాందీపూర్ లో ఉన్న 'సమీకృత పరీక్ష వేదిక' (ITR) నుంచి రెండుసార్లు విజయవంతంగా పరీక్షించింది. భారత ఏ రక్షణ దళ అవసరాల కోసం ఈ అస్త్రాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో 'డీ ఆర్ డీ ఓ' (DRDO) రూపొందించింది ? 
(ఎ) పదాతి దళం 
(బి) నౌకా దళం 
(సి) వాయుసేన 
(డి) పదాతి దళం మరియు వాయుసేన 

8. అవినీతి కేసుల్లో ఏసీబీ (ACB) కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల కేసుల విచారణను ఎన్ని రోజుల్లో పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ? [ఈ మేరకు చట్టసవరణ చేయనున్నారు] 
(ఎ) 50  
(బి) 100 
(సి) 150 
(డి) 200 

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద దేవాలయాలలో విజయవాడ దుర్గ గుడి (శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం) స్థానం ?
(ఎ) 1 
(బి) 2 
(సి) 3  
(డి) 4  



10. 'ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్' (ESIC) ఆరోగ్య బీమా పథకం కింద వైద్య సేవలను మెరుగుపర్చడం కోసం 350 పడకల ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?  
(ఎ) తిరుపతి 
(బి) విజయవాడ 
(సి) విశాఖపట్నం 
(డి) శ్రీకాకుళం              

కీ (KEY) (GK TEST-26 DATE : 2021 FEBRUARY 22)
1) బి    2) ఎ    3) డి    4) బి    5) సి    6) బి    7) బి    8) బి    9) బి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి