ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, ఫిబ్రవరి 2021, బుధవారం

GK TEST-21 DATE : 2021 FEBRUARY 17

1. ఏ తేదీ నుంచి జాతీయ రహదారుల్లోని అన్ని టోల్ ప్లాజాలు 'నగదు రహిత మార్గాలు' గా ఉంటాయని 'జాతీయ రహదారి, రవాణా శాఖ' ప్రకటించింది ? [ఇక మీదట జాతీయ రహదారుల్లోని టోల్ గేట్లకు ఫాస్టాగ్ లేకుండా వచ్చే వాహనాల నుంచి రెండింతల టోల్ రుసుము వసూలు చేస్తారు. అయినప్పటికీ భారీ నుంచి అతి భారీ వాహనాలకు వెసులుబాటు కల్పించేందుకు ఒక మార్గంలో నగదు చెల్లింపులను కొనసాగిస్తారు] (FASTag) 
(ఎ) 2021 ఫిబ్రవరి 14 
(బి) 2021 ఫిబ్రవరి 15  
(సి) 2021 ఫిబ్రవరి 16  
(డి) 2021 ఫిబ్రవరి 17 

2. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ? 
(ఎ) కపిల్ దేవ్ 
(బి) అనిల్ కుంబ్లే  
(సి) రవిచంద్రన్ అశ్విన్  
(డి) హర్భజన్ సింగ్ 

3. తమిళనాడులోని ఏ జిల్లాలో ఆసియాలోనే ఎత్తైన 'సుబ్రహ్మణ్యస్వామి' విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ? [సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం 123 అడుగుల ఎత్తు, పీఠం 12 అడుగుల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించారు]  
(ఎ) ఈరోడ్  
(బి) శివగంగై 
(సి) తూత్తుకుడి 
(డి) దిండిగల్ 



4. భారతదేశంలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ "హట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ లిమిటెడ్" (Hutti Gold Mines Company Limited) ఏ రాష్ట్రంలో ఉంది ? 
(ఎ) ఝార్ఖండ్ 
(బి) కర్ణాటక 
(సి) చత్తీస్ గఢ్ 
(డి) తమిళనాడు 

5. పేద ప్రజలకు రూ. 5 కే భోజనం అందించే "మా" (Maa) పథకాన్ని 2021 ఫిబ్రవరి 15న ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? [ఇందులో రూ. 15 రాయితీని ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు ఈ వంటశాలలు అందుబాటులో ఉంటాయి]  
(ఎ) అసోం   
(బి) పశ్చిమ బెంగాల్  
(సి) తమిళనాడు  
(డి) కేరళ 

6. భారత స్పిన్నర్ 'రవిచంద్రన్ అశ్విన్' కంటే ఎక్కువసార్లు (5) ఒకే టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ, ఐదు వికెట్ల ఘనతను సాధించిన క్రికెటర్ ? [అశ్విన్ ఇలాంటి ఘనతను 3 సార్లు సాధించాడు]
(ఎ) ఇయాన్ బోథమ్ 
(బి) ఇమ్రాన్ ఖాన్ 
(సి) షకిబ్ అల్ హసన్ 
(డి) అనిల్ కుంబ్లే 



7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 'పీ ఎం జీ ఎస్ వై' (PMGSY) ద్వారా చేపట్టే రహదారులు, వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధుల శాతం వరుసగా ... ?  
(ఎ) 40%, 60% 
(బి) 50%, 50% 
(సి) 60%, 40% 
(డి) 70%, 30% 

8. 'మ్యాప్ ల తయారీ, జియోస్పేషియల్ డేటా ఉత్పత్తి' పై ఏ తేదీ నుంచి ప్రభుత్వ నియంత్రణలు తొలగిపోయాయి ? [ఇప్పటివరకూ మ్యాపింగ్ ప్రక్రియను ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'సర్వే ఆఫ్ ఇండియా' (SURVEY OF INDIA) సంస్థ నిర్వహించేది. తాజా సరళీకరణతో దేశంలోని ఏ సంస్థ అయినా ఈ ప్రక్రియలో పాల్గొని లబ్ది పొందొచ్చు. సర్వే, మ్యాపింగ్, వాటి ఆధారంగా వినియోగ సాధనాల రూపకల్పనకు ముందస్తు అనుమతులు పొందాల్సిన అవసరం లేదు]   
(ఎ) 2021 ఫిబ్రవరి 13  
(బి) 2021 ఫిబ్రవరి 14  
(సి) 2021 ఫిబ్రవరి 15 
(డి) 2021 ఫిబ్రవరి 16  

9. 'ఇస్రో' (ISRO) 50 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా 2021 ఫిబ్రవరి 28న దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' చిత్రపటాన్ని అంతరిక్షంలోకి పంపనున్న సంస్థ ?
(ఎ) పిక్సెల్ (బెంగళూరు) 
(బి) స్పేస్ కిట్జ్ ఇండియా (చెన్నై) 
(సి) జిట్ శాట్ (శ్రీపెరంబూదురు)  
(డి) శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు)  



10. "సాహస బాలలు - 2020" పురస్కారానికి ఎంపికైన "పోతప్రగడ బాలసాయిశ్రీ సాహితీ వినూత్న" స్వస్థలం ? 
(ఎ) తణుకు 
(బి) ఏలూరు 
(సి) భీమవరం 
(డి) తాడేపల్లిగూడెం              

కీ (KEY) (GK TEST-21 DATE : 2021 FEBRUARY 17)
1) బి    2) బి    3) సి    4) బి    5) బి    6) ఎ    7) సి    8) సి    9) బి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి