1. "డబ్బీ బాడిగ" (DABBI BYADGI) అనేది ఏ పంటకు సంబంధించిన రకం ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) పత్తి
(బి) పొగాకు
(సి) మిర్చి
(డి) చెరకు
2. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ తన రెండేళ్ల పదవీ కాలాన్ని (2021-22) 2021 జనవరి 1 నుంచి ప్రారంభించింది. ప్రపంచ శాంతిభద్రతలను పర్యవేక్షించే ఈ అత్యున్నత విధాన నిర్ణయ మండలిలో భారత్ కు చోటు దక్కడం ఇది ఎన్నోసారి ?
(ఎ) 6
(బి) 7
(సి) 8
(డి) 9
3. కొవిడ్-19 మహమ్మారిని రూపుమాపడానికి 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) ఆమోదం తెలిపిన మొట్టమొదటి టీకా (అత్యవసర వినియోగానికి) ?
(ఎ) బి ఎన్ టి 162 బి 2
(బి) కోవోవ్యాక్స్
(సి) కొవిషీల్డ్
(డి) కరోనా వాక్
4. మనదేశంలో 2020 చివరి నాటికి నమోదిత కంపెనీల్లో అతిపెద్ద ప్రమోటర్ గా నిలిచిన సంస్థ ? [గత 20 సంవత్సరాలుగా అగ్రస్థానంలో కొనసాగిన కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టి ఈ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. 2020 చివరి నాటికి ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా (రూ. 9,24,000 కోట్లు) కంటే, గ్రూప్ కంపెనీల్లో ఈ సంస్థ వాటా (రూ. 9,28,000 కోట్లు) ఎక్కువగా నమోదైంది]
(ఎ) ఆర్ ఐ ఎల్
(బి) టాటా సన్స్
(సి) వేదాంత
(డి) హెచ్ ఎల్ ఎల్
5. 2020 నవంబర్ 5న 'ఎన్ పి సి ఐ' (NPCI) వెల్లడించిన ప్రతిపాదన ప్రకారం, 'యూపీఐ' (UPI) ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో 'థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు' (ఉదా : అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే ....) ద్వారా జరిగే లావాదేవీలు ఎంత శాతానికి పరిమితం కానున్నాయి ? [రోలింగ్ ప్రాతిపదికన ఈ పరిమితి 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది]
(ఎ) 30%
(బి) 35%
(సి) 40%
(డి) 45%
6. తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎదుటివారి మరణానికి కారణమైన వారిపై 'ఐపీసీ' (IPC) లోని సెక్షన్ 304 (2) కింద కేసు నమోదైతే గరిష్ఠంగా విధించే జైలు శిక్ష ? [ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రమే ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తుండగా మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది]
(ఎ) 10 సంవత్సరాలు
(బి) 11 సంవత్సరాలు
(సి) 12 సంవత్సరాలు
(డి) 14 సంవత్సరాలు
7. విశాఖ మన్యంలో పంట చేతికి అందే సమయంలో గిరిజనులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే పండుగను ఏమని పిలుస్తారు ?
(ఎ) వీడు
(బి) జోడ్ల
(సి) శీతాలు
(డి) సంక్రాంతి
8. విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం మన్యం మీదుగా రాజమహేంద్రవరం వరకు నిర్మించనున్న జాతీయ రహదారి ?
(ఎ) ఎన్ హెచ్ 65
(బి) ఎన్ హెచ్ 16
(సి) ఎన్ హెచ్ 5
(డి) ఎన్ హెచ్ 516
9. సాధారణ ప్రయాణికుడు టికెట్ తీసుకున్న తర్వాత 'బయోమెట్రిక్' (BIOMETRIC) వ్యవస్థ వద్దకు వెళ్లి వేలిముద్ర వేస్తే .. ఒక నంబర్ తో టోకెన్ వస్తుంది. దీని ఆధారంగా రైలులో సీటు పొందేలా 'ఆర్ఫీఎఫ్' (RPF) పోలీసులు ఏర్పాటు చేసిన ఈ బయోమెట్రిక్ వ్యవస్థను వాల్తేర్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ 'జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ' విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రారంభించిన తేదీ ? [ఈ విధానం వల్ల సాధారణ ప్రయాణికుల వివరాలు నమోదు చేయడంతోపాటు రద్దీ రైళ్లలో అనధికారికంగా జరిగే సీట్ల అమ్మకాలను కట్టడి చేయవచ్చు]
(ఎ) 2021 జనవరి 1
(బి) 2021 జనవరి 2
(సి) 2021 జనవరి 3
(డి) 2021 జనవరి 4
10. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చరల్ రీసెర్చ్' గల నగరం ?
(ఎ) బెంగళూరు
(బి) చెన్నై
(సి) దిల్లీ
(డి) భువనేశ్వర్
కీ (KEY) (GK TEST-7 DATE : 2021 FEBRUARY 3)
1) సి 2) సి 3) ఎ 4) బి 5) ఎ 6) ఎ 7) సి 8) డి 9) బి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి