ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, ఫిబ్రవరి 2021, సోమవారం

GK TEST-19 DATE : 2021 FEBRUARY 15

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి వాడే మొబైల్ వాహనాలకు నెల వారీ అద్దె రూ. 21 వేలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో "ఆర్ధిక భరోసా కల్పనకు, సహాయకునికి, ఇంధన ఖర్చులకు" చెల్లించే వివరాలు వరుసగా ... ? 
(ఎ) రూ. 11,000; రూ. 5,000; రూ. 5,000 
(బి) రూ. 12,000; రూ. 5,000; రూ. 4,000  
(సి) రూ. 13,000; రూ. 5,000; రూ. 3,000  
(డి) రూ. 14,000; రూ. 5,000; రూ. 2,000 

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ? 
(ఎ) జస్టిస్ ఈశ్వరయ్య 
(బి) జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి  
(సి) జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి  
(డి) జస్టిస్ రామలింగం సుధాకర్ 

3. హైదరాబాద్ నగరంలో ఈ నెల 22, 23 తేదీల్లో దృశ్యమాధ్యమంలో జరిగే 'బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు' (BioAsia 2021) సందర్భంగా ఏటా ఇచ్చే 'జినోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారం' (EXCELLENCE AWARD) ను ఏ సంస్థకు ఇవ్వనున్నారు ? 
(ఎ) భారత్ బయోటెక్  
(బి) బయోకాన్  
(సి) బయోలాజికల్ ఇ. లిమిటెడ్ 
(డి) సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 



4. 'జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్' (NDHM) ప్రస్తుత సీఈఓ ? 
(ఎ) దేబ్ జాని ఘోష్ 
(బి) అమితాబ్ కాంత్ 
(సి) ఇందు భూషణ్ 
(డి) సుచిత్ర ఎల్ల 

5. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) ఉప సంచాలకురాలుగా ఉన్న భారతీయురాలు ?  
(ఎ) సౌమ్య స్వామినాథన్   
(బి) మహిమ దాట్ల  
(సి) కిరణ్ మజుందార్ షా  
(డి) సుచిత్ర ఎల్ల 

6. ఏ సంవత్సరం నుంచి 'యునెస్కో' (UNESCO) ఏటా ఫిబ్రవరి 13న "ప్రపంచ రేడియో దినోత్సవం" (WORLD RADIO DAY) ను నిర్వహిస్తోంది ?
(ఎ) 2011 
(బి) 2012 
(సి) 2013 
(డి) 2014 



7. భారత్ లో తొలి రేడియో స్టేషన్ 'బాంబే' లో నాటి వైస్రాయ్ 'లార్డ్ ఇర్విన్' చేతులమీదుగా ప్రారంభమైన తేదీ ? (First Radio Station in INDIA) 
(ఎ) 1923 జూలై 20 
(బి) 1923 జూలై 21 
(సి) 1923 జూలై 22 
(డి) 1923 జూలై 23 

8. 2021 ఫిబ్రవరి 16 నుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టనున్నది ?  
(ఎ) గులాం నబీ ఆజాద్  
(బి) మల్లికార్జున ఖర్గే  
(సి) శశిథరూర్ 
(డి) మన్మోహన్ సింగ్  

9. మోటార్ వాహనాలకు బీమా చేస్తామంటూ బెంగళూరు కేంద్రంగా "డిజిటల్ నేషనల్ మోటార్ ఇన్స్యూరెన్స్" (https:///dnmins.wixsite.com/dnmins) అనే నకిలీ బీమా సంస్థ మోసపూరితంగా పాలసీలు జారీచేస్తోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని 'బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ' (IRDAI) పాలసీదారులను హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేసిన తేదీ ? [digitalpolicyservices@gmail.com నుంచి వచ్చిన ఈ-మైళ్ళ (e-mails) కు స్పందించొద్దని 'ఐ ఆర్ డీ ఏ ఐ' సూచించింది]   
(ఎ) 2021 ఫిబ్రవరి 10 
(బి) 2021 ఫిబ్రవరి 11 
(సి) 2021 ఫిబ్రవరి 12  
(డి) 2021 ఫిబ్రవరి 13  



10. బ్రిటన్ అధికార వర్గాల వివరాల ప్రకారం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ 2020లో ఎంత శాతం క్షీణించింది ? [బ్రిటిష్ ఆర్ధిక వ్యవస్థ 300 ఏళ్లలో ఎదురవ్వని అతిపెద్ద మందగమనాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. 1709వ సంవత్సరం తర్వాత ఇవే అత్యంత అధ్వాన గణాంకాలు]  
(ఎ) 9.6 % 
(బి) 9.7 % 
(సి) 9.8 % 
(డి) 9.9 %              

కీ (KEY) (GK TEST-19 DATE : 2021 FEBRUARY 15)
1) సి    2) ఎ    3) ఎ    4) సి    5) ఎ    6) బి    7) డి    8) బి    9) సి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి