1. 2020 నవంబర్ 26న కన్నుమూసిన "పఖిర్ చంద్ కోహ్లి" (FAQIR CHAND KOHLI) గారి ప్రత్యేకత ?
All the best by www.gkbitsintelugu.blogspot.com
(ఎ) భారత పౌల్ట్రీ పరిశ్రమ పితామహుడు
(బి) భారత ఐటీ పరిశ్రమ పితామహుడు
(సి) భారత వస్త్ర పరిశ్రమ పితామహుడు
(డి) భారత బీమా రంగ పితామహుడు
2. విద్య, వైద్యం, వ్యవసాయం-జలవనరులు, ప్రాథమిక మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, ఆర్ధిక సమ్మిళితపరంగా దేశంలోని మిగతా జిల్లాల కంటే వెనకబడిన 112 జిల్లాలను ముందుకు తీసుకెళ్లేందుకు "ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి" (Transformation of Aspirational Districts) కార్యక్రమాన్ని 'నీతి ఆయోగ్' (NITI AAYOG) ప్రారంభించిన సంవత్సరం ? (ఈ కార్యక్రమంలో చేరకముందు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటికి 'ఛత్తీస్ గఢ్ (80%), ఒడిశా (70%), ఆంధ్రప్రదేశ్ (66.67%), ఝార్ఖండ్ (63%)' పురోగతి సాధించి తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి)
(ఎ) 2015
(బి) 2016
(సి) 2017
(డి) 2018
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 'ఎస్ఈబీ' (SEB ⇒ Special Enforcement Bureau) వ్యవస్థాగత స్వరూపం ప్రకారం 'ఎక్సయిజ్ సూపరింటెండెంట్' (Excise Superintendent) అధిపతిగా ఉండే జిల్లా ? (మిగతా చోట్ల 'అసిస్టెంట్ కమిషనర్లు' (Assistant Commissioners) అధిపతిగా వ్యవహరిస్తారు)
(ఎ) వైఎస్సార్ కడప
(బి) ప్రకాశం
(సి) చిత్తూరు
(డి) శ్రీకాకుళం
4. ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ "డిగో మారడోనా" (DIEGO MARADONA) తన అభిమానులు భారతదేశంలో ఏర్పాటు చేసిన తన 12 అడుగుల విగ్రహాన్ని స్వయంగా తనే ఆవిష్కరించిన నగరం ? (2020 నవంబర్ 25న 'డిగో మారడోనా' (అర్జెంటీనా) గుండెపోటుతో మరణించాడు. చివరగా మూడోసారి 2017లో భారతదేశాన్ని సందర్శించాడు)
(ఎ) కన్నూర్
(బి) ముంబయి
(సి) గువహటి
(డి) కోల్ కతా
5. సినిమాలు, సీరియళ్లకు పోటీగా వినోద రంగంలో నయా ఆకర్షణగా మారిన "ఓటీటీ" (OTT ⇒ Over The Top) లు అశ్లీల, హింసాత్మక దృశ్యాలున్న వెబ్ సిరీస్ లు, సినిమాలను ప్రసారం చేస్తున్నాయని, వీటిని సెన్సార్ (CENSOR) చేసేందుకు ఓ స్వతంత్ర సంస్థ ఉండాలని సుప్రీంకోర్టులో 'ప్రజా ప్రయోజన వ్యాజ్యం' (PIL ⇒ Public Interest Litigation) దాఖలు చేసిన న్యాయవాది ?
(ఎ) ప్రశాంత్ భూషణ్
(బి) దుష్యంత్ దవే
(సి) శశాంక్ శేఖర్
(డి) ముకుల్ రోహత్గి
6. భారత రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఏటా ఆ రోజును "రాజ్యాంగ దినోత్సవం" (CONSTITUTION DAY) గా జరుపుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంవత్సరం ?
(ఎ) 2014
(బి) 2015
(సి) 2016
(డి) 2017
7. లోక్ సభ స్పీకర్ 'ఓం బిర్లా' అధ్యక్షతన గుజరాత్ రాష్ట్రంలోని 'కేవడియా' లో 2020 నవంబర్ 26న జరిగిన స్పీకర్ల సదస్సు ముగింపు సందర్భంగా భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏమని పిలుపునిచ్చారు ?
(ఎ) ఒకే దేశం - ఒకే ఎన్నిక
(బి) ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు
(సి) ఒకే దేశం - ఒకే పౌరసత్వం
(డి) ఒకే దేశం - ఒకే రాజ్యాంగం
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నివశించే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి నుంచి వసూలు చేసే ఆస్తి పన్ను ?
(ఎ) రూ. 50
(బి) రూ. 100
(సి) రూ. 150
(డి) రూ. 200
9. 'నివర్' (NIVAR) తుపాను పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితుల్లో ఒక్కొక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పరిహారం ?
(ఎ) రూ. 500
(బి) రూ. 1,000
(సి) రూ. 1,500
(డి) రూ. 2,000
10. 'ఏపీఎస్ఆర్టీసీ' (APSRTC) ఇప్పటివరకు వివిధ సరుకులు, పంట ఉత్పత్తుల రవాణాకు టన్నుకు రూ. 1,920 వసూలు చేయగా, ఇప్పుడు దాన్ని రూ. 1,000 గా నిర్ణయించారు. గతంలో టన్ను లోపు ఎంత సరకు రవాణా చేయాలన్నా టన్నుకి ఛార్జీ చేసేవారు. దీని స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన స్లాబ్ ?
(ఎ) 100 కేజీలు
(బి) 250 కేజీలు
(సి) 500 కేజీలు
(డి) 750 కేజీలు
కీ (GK TEST-82 DATE : 2020 NOVEMBER 30)
1) బి 2) డి 3) బి 4) డి 5) సి 6) బి 7) ఎ 8) ఎ 9) ఎ 10) సి All the best by www.gkbitsintelugu.blogspot.com