Welcome To GK BITS IN TELUGU Blog
1. 'కేంద్ర సాహిత్య అకాడమీ-2019' అనువాద పురస్కారాన్ని 2021 మార్చ్ 13న దిల్లీలో అకాడమీ అధ్యక్షుడు 'చంద్రశేఖర కంబరా' చేతుల మీదుగా అందుకున్న రచయిత్రి ? [ఎ.రేవతి ఆంగ్ల రచన 'ద ట్రూత్ అబౌట్ మి : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ' (ఆటోబయోగ్రఫీ) ని "ఒక హిజ్రా ఆత్మ కథ" గా తెలుగులోకి ఈ రచయిత్రి అనువదించారు. 'ఇల్లలకగానే, మంత్రనగరి, రాగం భూపాళం' .. వంటి పలు రచనలు, అనువాదాలు కూడా చేశారు]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) పి. సత్యవతి
(బి) ఆర్.శాంతసుందరి
(సి) స్వాతి శ్రీపాద
(డి) వీణా వల్లభరావు
2. 'ఐ సీ ఆర్ ఐ ఈ ఆర్' (ICRIER) తదుపరి డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులైనది ? [ప్రస్తుతం ఇతను ప్రపంచ బ్యాంక్ లో స్థూల ఆర్ధిక అంశాలు, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ప్రాక్టీస్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు]
(ఎ) రజత్ కతూరియా
(బి) డాక్టర్ రాకేశ్ మిశ్రా
(సి) దీపక్ మిశ్రా
(డి) డాక్టర్ కేఎంకే రెడ్డి
3. కనీసం ఎన్ని పడకల ఆసుపత్రి ఉన్న సంస్థలకే 'జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ స్కూల్, బీఎస్సీ నర్సింగ్ కళాశాలల' ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నట్లు 'ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్' (INDIAN NURSING COUNCIL) 2021 మార్చ్ 13న ఒక ప్రకటన విడుదల చేసింది ? [ఒకవేళ ఈ స్కూల్, కాలేజ్ గిరిజన షెడ్యూల్డ్, కొండప్రాంతాల్లో ఏర్పాటు చేసేటట్లయితే ఆసుపత్రి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది]
(ఎ) 50
(బి) 100
(సి) 150
(డి) 200
4. 2021 మార్చ్ 13న ముగిసిన 'ఇండియన్ సూపర్ లీగ్' (ISL) ఫుట్ బాల్ టోర్నీ (సీజన్-7) టైటిల్ విజేత ?
(ఎ) ఏటీకే మోహన్ బగాన్
(బి) కేరళ బ్లాస్టర్స్
(సి) నార్త్ ఈస్ట్ యునైటెడ్
(డి) ముంబయి సిటీ
5. శ్రీలంకలో ఎల్టీటీఈ (LTTE) తో అంతర్యుద్ధం సందర్భంగా మానవహక్కుల ఉల్లంఘన, కట్టుబాట్లపై జవాబుదారీతనం లోపించడం లాంటి అంశాలపై అంతర్జాతీయ సమాజం విచారణ జరిపే తీర్మానాన్ని 'ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి' (UNHRC) ఆమోదించిన తేదీ ? ['శ్రీలంకలో సయోధ్య, జవాబుదారీతనం, మానవహక్కుల పరిరక్షణ' పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి కౌన్సిలులోని 47 మందికిగాను 22 మంది అనుకూలంగా ఓటు వేయగా, 11 మంది తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇండియా, నేపాల్ తో పాటు మొత్తం 14 దేశాలు ఓటింగుకు దూరం పాటించాయి]
(ఎ) 2021 మార్చ్ 21
(బి) 2021 మార్చ్ 22
(సి) 2021 మార్చ్ 23
(డి) 2021 మార్చ్ 24
6. దేశంలో ఏ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ 'కొవిడ్-19' టీకాలు (COVID-19 VACCINES) ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం 2021 మార్చ్ 23న నిర్ణయించింది ?
(ఎ) 2021 ఏప్రిల్ 1
(బి) 2021 మే 1
(సి) 2021 జూన్ 1
(డి) 2021 జూలై 1
7. 'భవిష్య నిధి' (PF) లో వడ్డీపై పన్ను మినహాయింపు పొందడానికి పరిమితిని కొన్ని నిర్దిష్ట కేసుల విషయంలో గరిష్ఠంగా రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ తేదీ నుంచి అమల్లోకి రానుంది ? [పీఎఫ్ (PF) ఖాతాలో ఉద్యోగుల, యాజమాన్యాల వాటా కలిపి ఏడాదిలో రూ. 2.50 లక్షలకు మించి జమ అయినట్లయితే దానిపై లభించే వడ్డీకి పన్ను పడుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. "చట్ట ప్రకారం ఉద్యోగి మూలవేతనంపై 12 శాతం వరకు యాజమాన్యం తన వాటాగా పీఎఫ్ (PF) లో జమ చేస్తుంది. యాజమాన్యాలు ఒకవేళ ఇంతకు మించి మొత్తాన్ని పీఎఫ్ (PF) లో జమ చేస్తే అప్పుడు .. తాజా పరిమితిగా ప్రకటించిన రూ. 5 లక్షలకు ఆ మొత్తాన్ని పరిగణనలో తీసుకోం. అంటే- చందాదారుని పీఎఫ్ (PF) ఖాతాకు యాజమాన్యాలు తమ వాటా కంటే అదనంగా జమ చేయనప్పుడే ఏటా రూ. 5 లక్షల మొత్తం వరకు పీఎఫ్ (PF) జమలపై వడ్డీకి పన్ను మినహాయింపు కొనసాగిస్తాం" అని ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' వెల్లడించారు]
(ఎ) 2021 ఏప్రిల్ 1
(బి) 2021 మే 1
(సి) 2021 జూన్ 1
(డి) 2021 జూలై 1
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో చేపట్టిన 'నాడు-నేడు' తొలి దశ పనుల్ని ఎవరి ద్వారా పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అధికారులను ఆదేశించారు ?
(ఎ) స్వయం సహాయక సంఘాల మహిళలు
(బి) తల్లిదండ్రుల కమిటీలు
(సి) క్లస్టర్ రిసోర్స్ పర్సన్
(డి) సంక్షేమ సహాయకుడు
9. అగ్ని ప్రమాదాలను నిరోధించే చర్యల్లో భాగంగా రైళ్లలో ఏయే సమయాలలో ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కు అవకాశం ఇవ్వకూడదని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది ?
(ఎ) రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య
(బి) రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య
(సి) రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య
(డి) రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య
10. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు (MLC) గా 'షేక్ సాబ్జీ, టి.కల్పలత', ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ (MLC) లుగా 'బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మహ్మద్ కరీమున్నీసా, సి.రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, షేక్ మహ్మద్ ఇక్బాల్' ఎన్నికైనట్లు విడుదల చేసిన నోటిఫికేషన్ ను గెజిట్ లో ప్రచురిస్తూ 2021 మార్చ్ 30న ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ?
(ఎ) ఎన్. రమేష్ కుమార్
(బి) కె. విజయానంద్
(సి) జస్టిస్ వి. కనగరాజ్
(డి) నీలం సాహ్ని
కీ (KEY) (GK TEST-48 YEAR : 2021)
1) ఎ 2) సి 3) బి 4) డి 5) సి 6) ఎ 7) ఎ 8) ఎ 9) సి 10) బి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com