1. ఉదయం 11.40 గంటల నుంచి దాదాపు 4 గంటలపాటు 'ఎన్ ఎస్ ఈ' (NSE) లో ట్రేడింగ్ నిలిచిన తేదీ ? [ఎక్స్చేంజీ చరిత్రలో ఇంతసేపు ఆగడం ఇదే మొదటిసారి]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) 2021 ఫిబ్రవరి 22
(బి) 2021 ఫిబ్రవరి 23
(సి) 2021 ఫిబ్రవరి 24
(డి) 2021 ఫిబ్రవరి 25
2. పన్నుల వసూలు, పింఛన్ చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు వంటి ప్రభుత్వ సంబంధిత వ్యాపారాల్లో పాల్గొనేందుకు అన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులకు 2021 ఫిబ్రవరి 24న అనుమతి ఇచ్చినది ? [ప్రస్తుతం కొన్ని భారీ ప్రైవేటు బ్యాంకులకు మాత్రమే వీటిని నిర్వహించేందుకు అనుమతి ఉంది]
(ఎ) ఆర్ బీ ఐ (RBI)
(బి) కేంద్ర ఆర్ధిక శాఖ
(సి) సీ బీ డీ టి (CBDT)
(డి) సుప్రీంకోర్ట్
3. దిగ్గజ ఆటగాడు 'కపిల్ దేవ్' (KAPIL DEV) తర్వాత వంద టెస్టుల మైలురాయిని చేరుకున్న తొలి భారత ఫాస్ట్ బౌలర్ గా ఘనత వహించిన "ఇషాంత్ శర్మ" (ISHANT SHARMA) స్వస్థలం ?
(ఎ) దిల్లీ
(బి) అహ్మదాబాద్
(సి) ముంబయి
(డి) లక్నో
4. బల్గేరియాలోని 'సోఫియా' లో జరుగుతున్న 'స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ' (2021 BOXING STRANDJA MEMORIAL TOURNAMENT) లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ 'నజిమ్ కిజైబే' ను భారత క్రీడాకారిణి "జ్యోతి గులియా" 2021 ఫిబ్రవరి 24న జరిగిన మహిళల 51 కేజీల బౌట్ లో 3-2 తో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. 'నజిమ్ కిజైబే' ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి ?
(ఎ) ఉక్రెయిన్
(బి) ఉజ్బేకిస్థాన్
(సి) కజకిస్తాన్
(డి) తుర్క్మెనిస్తాన్
5. 'అక్షర్ పటేల్' కన్నా ముందు ఎంత మంది భారత బౌలర్లు వరుసగా మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్ ల్లో అయిదు వికెట్ల ఘనత సాధించారు ? [అహ్మదాబాద్ లోని 'మొతేరా' మైదానంలో భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన మూడో టెస్టులో 'ఓ టెస్టులో అతి తక్కువ పరుగులిచ్చి పది వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్' (11/70) గా 'అక్షర్ పటేల్' రికార్డ్ సృష్టించాడు]
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
6. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో బౌలర్ గా 'రవిచంద్రన్ అశ్విన్' (భారత్) నిలిచాడు. అశ్విన్ ఎన్ని టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు ? [తొలిస్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ 'ముత్తయ్య మురళీధరన్' (72 టెస్టులు) ఉన్నాడు]
(ఎ) 76
(బి) 77
(సి) 78
(డి) 79
7. ఓ టెస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ పై ఇంగ్లాండ్ అత్యల్ప స్కోర్ ?
(ఎ) 71
(బి) 81
(సి) 101
(డి) 102
8. స్వదేశంలో అత్యధిక టెస్టు విజయాలు (22) సాధించిన భారత కెప్టెన్ గా ఎవరి పేరిట ఉన్న రికార్డు (21 టెస్టు విజయాలు) ను 2021 ఫిబ్రవరి 25న ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించడం ద్వారా 'విరాట్ కోహ్లీ' బద్దలు కొట్టాడు ?
(ఎ) మహమ్మద్ అజహరుద్దీన్
(బి) సౌరభ్ గంగూలీ
(సి) సునీల్ గవాస్కర్
(డి) మహేంద్ర సింగ్ ధోని
9. 'విజయ్ హజారే ట్రోఫీ' లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (2019లో గోవా పై 212 నాటౌట్) నమోదు చేసిన ఏ ఆటగాడి రికార్డును 2021 ఫిబ్రవరి 25న ముంబయి కెప్టెన్ 'పృథ్వీ షా' (పుదుచ్చేరి పై 227 నాటౌట్) బద్దలు కొట్టాడు ?
(ఎ) రోహిత్ శర్మ
(బి) సంజు శాంసన్
(సి) సూర్య కుమార్ యాదవ్
(డి) విరాట్ కోహ్లి
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న "పుర, నగరపాలక, నగర పంచాయతీ" ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చు (గరిష్ఠంగా) ను 'రాష్ట్ర ఎన్నికల సంఘం' ఖరారు చేసిన వివరాల ప్రకారం .. సరియైన జవాబు ?
(ఎ) నగర పంచాయతీ : రూ. 1 లక్ష; పురపాలక సంఘం : రూ. 1.50 లక్షలు; నగరపాలక సంస్థ : రూ. 2 లక్షలు
(బి) నగర పంచాయతీ : 1.50 లక్షలు; పురపాలక సంఘం : రూ. 2 లక్షలు; నగరపాలక సంస్థ : రూ. 2.5 లక్షలు
(సి) నగర పంచాయతీ : రూ. 2 లక్షలు; పురపాలక సంఘం : రూ. 2.5 లక్షలు; నగరపాలక సంస్థ : రూ. 3 లక్షలు
(డి) నగర పంచాయతీ : రూ. 2.5 లక్షలు; పురపాలక సంఘం : రూ. 3 లక్షలు; నగరపాలక సంస్థ : రూ. 3.5 లక్షలు
కీ (KEY) (GK TEST-29 DATE : 2021 FEBRUARY 25)
1) సి 2) బి 3) ఎ 4) సి 5) సి 6) బి 7) బి 8) డి 9) బి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com