1. వివిధ వెబ్ సైట్లు, సంస్థల ద్వారా భారత్ లో 10 వేల మందికి పైగా ప్రముఖులపై నిఘా పెట్టిన చైనా కు చెందిన 'డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ? (ఈ జాబితాలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, క్రికెటర్లు, సినీ తారలు మొదలగు వారు ఉన్నారు)
(ఎ) టెన్సెన్ట్
(బి) బైదు
(సి) ఝేన్ హువా
(డి) అలీబాబా
2. జీఎస్టీ (GST) బకాయిల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ఐచ్ఛికాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఐచ్ఛికాన్ని ఎంచుకుంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కలిగే రుణ సౌకర్యం ?
(ఎ) అన్ని రాష్ట్రాలకు కలిపి 'ఆర్బీఐ' (RBI) ఏర్పాటు చేసే 'ప్రత్యేక గవాక్షం' (SPECIAL WINDOW) ద్వారా రుణం తీసుకోవడం
(బి) అన్ని రాష్ట్రాలకు కలిపి 'ఆర్బీఐ' (RBI) ఏర్పాటు చేసే 'ఏక గవాక్షం' (SINGLE WINDOW) ద్వారా రుణం తీసుకోవడం
(సి) అన్ని రాష్ట్రాలకు కలిపి 'ఆర్బీఐ' (RBI) ఏర్పాటు చేసే 'ప్రత్యేకావసర వాహకం' (SPECIAL PURPOSE VEHICLE) ద్వారా రుణం తీసుకోవడం
(డి) బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడం
3. ఇటీవల విష ప్రయోగానికి గురై కోమాలోకి వెళ్లిన 'అలెక్సీ నావల్నీ' (ALEXEI NAVALNY) ఏదేశానికి చెందిన విపక్ష నేత ? (జర్మనీలో చికిత్సతో కోలుకుంటున్నారు)
(ఎ) ఇరాన్
(బి) ఇజ్రాయెల్
(సి) రష్యా
(డి) శ్రీలంక
4. వారెంట్లు, న్యాయస్థానం నుంచి ఆదేశాలు, ఎఫ్ ఐ ఆర్ వంటివేమీ లేకుండా నేరుగా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారాన్ని పోలీసులకు కల్పించే వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రం ? (దీనికోసం 'ప్రత్యేక భద్రతా దళం' (SSF) ను పోలీస్ శాఖలో ఏర్పాటు చేసారు. అరెస్ట్ చేయడానికి "తగిన ఆధారం" ఈ విభాగం (SSF) వద్ద ఉంటే చాలు. రుసుం చెల్లించి 'ఎస్ ఎస్ ఎఫ్' (SSF) సేవల్ని ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు కూడా ఉపయోగించుకోవచ్చు)
(ఎ) పశ్చిమ బెంగాల్
(బి) కేరళ
(సి) ఉత్తర్ ప్రదేశ్
(డి) దిల్లీ
5. విమానయాన నియంత్రణాధికార సంస్థలకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన "ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లు-2020" ప్రకారం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారికి ప్రస్తుతం విధిస్తున్న రూ. 10 లక్షల జరిమానాను ఎంత మొత్తానికి పెంచేందుకు వీలు కలుగుతుంది ?
(ఎ) రూ. 50 లక్షలు
(బి) రూ. కోటి
(సి) రూ. కోటిన్నర
(డి) రూ. 2 కోట్లు
6. ప్రస్తుత 'కొవిడ్' మహమ్మారి పరిస్థితుల్లో విరివిగా వాడుతున్న 'సామాజిక దూరం' (Social Distance) అన్న పదానికి బదులు "సురక్షిత దూరం" (Safe Distance) అని ఉపయోగిస్తే బాగుంటుందని సూచించిన ప్రముఖ వ్యక్తి ?
(ఎ) రామ్ నాథ్ కోవింద్
(బి) ఎం.వెంకయ్య నాయుడు
(సి) నరేంద్ర మోదీ
(డి) రాజ్ నాథ్ సింగ్
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి పంట అత్యధికంగా పండించే జిల్లాలలో మొదటి నాలుగు స్థానాలలో ఉన్న జిల్లాలు వరుసగా .. ?
(ఎ) గుంటూరు, కర్నూలు, కృష్ణా, అనంతపురం
(బి) అనంతపురం, గుంటూరు, కర్నూలు, కృష్ణా
(సి) కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం
(డి) కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం
8. 'జపాన్' దేశ నూతన ప్రధానిగా "యోషిహిదే సుగా" (YOSHIHIDE SUGA) ను ఆ దేశ పార్లమెంట్ 2020 సెప్టెంబర్ 16న ఎన్నుకొంది. యోషిహిదే సుగా జపాన్ లో ఇంతకుముందు నిర్వహించిన పదవి ? (సుగా తల్లిదండ్రులు 'స్ట్రాబెర్రీలు' సాగు చేసే రైతులు)
(ఎ) క్యాబినెట్ ముఖ్య కార్యదర్శి
(బి) జాతీయ భద్రతా సలహాదారు
(సి) విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి
(డి) రక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి
9. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగే రోజు ?
(ఎ) నవంబర్ లో మొదటి ఆదివారం తర్వాత వచ్చే సోమవారం
(బి) నవంబర్ లో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం
(సి) నవంబర్ లో మొదటి మంగళవారం తర్వాత వచ్చే బుధవారం
(డి) నవంబర్ లో మొదటి బుధవారం తర్వాత వచ్చే గురువారం
10. స్క్రామ్ జెట్ ఇంజిన్ (Scram Jet Engine) ను అమర్చిన "హైపర్ సోనిక్ టెక్నాలజీ ప్రయోగాత్మక రాకెట్' (HSTDV ⇒ Hyper Sonic Technology Demonstrator Vehicle) ను 'డీ ఆర్ డీ ఓ' (DRDO) విజయవంతంగా ప్రయోగించిన తేదీ ? (ఈ రాకెట్ 6 మాక్ ల హైపర్ సోనిక్ వేగాన్ని అందుకుంది. 1 మాక్ = గంటకు 767 మైళ్లు లేదా 1,236 కి.మీ. వేగంతో సమానం)
(ఎ) 2020 సెప్టెంబర్ 5
(బి) 2020 సెప్టెంబర్ 6
(సి) 2020 సెప్టెంబర్ 7
(డి) 2020 సెప్టెంబర్ 8
కీ (GK TEST-67 DATE : 2020 SEPTEMBER 18)
1) సి 2) ఎ 3) సి 4) సి 5) బి 6) బి 7) డి 8) ఎ 9) బి 10) సి
All the best by www.gkbitsintelugu.blogspot.com