ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, అక్టోబర్ 2020, సోమవారం

YSR BIMA

 వైఎస్సార్ బీమా (YSR BIMA)


  • కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ పథకమే "వైఎస్సార్ బీమా" (YSR BIMA).
  • గతంలో ఉన్నట్లుగా ప్రతి పాలసీకి PMJJBY (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana), PMSBY (Pradhan Mantri Suraksha Bima Yojana) కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 శాతం వాటా ఇప్పుడు లేనప్పటికీ, మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తుంది.

పథకం ప్రారంభం :

  • 2020 అక్టోబర్ 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ బీమా" (YSR BIMA) పథకాన్ని ప్రారంభించారు.



పథకం - ప్రయోజనాలు :

  1. బియ్యం కార్డు అర్హత ఉన్న 1.41 కోట్ల (1,41,00,000) కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ లభిస్తుంది.
  2. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 'సహజ మరణం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా రూ. 2,00,000 సహాయం అందుతుంది.
  3. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 'ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా రూ. 5,00,000 సహాయం అందుతుంది.
  4. 51 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 'ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా రూ. 3,00,000 సహాయం అందుతుంది.
  5. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 'పాక్షిక శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా రూ. 1,50,000 సహాయం అందుతుంది.



పథకానికి అర్హులు, లబ్ధిదారుల గుర్తింపు, క్లెయిమ్ చెల్లింపు :

  • బియ్యం కార్డు పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలన్నీ 'వైఎస్సార్ బీమా' (YSR BIMA) పథకానికి అర్హులు అవుతారు.
  • బియ్యం కార్డు లేనివారు, కార్డు కొరకు దరఖాస్తు చేసి ఇంకా రానివారు, వారి పేర్లను 'వైఎస్సార్ బీమా' (YSR BIMA)లో నమోదు చేసుకోవడం కోసం గ్రామ/వార్డు వాలంటీర్లను సంప్రదించాలి.
  • వాలంటీర్లు 'డోర్ టు డోర్ సర్వే' (Door-To-Door Survey) ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తిస్తారు.
  • లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ఏర్పాటు నుండి బీమా నమోదు, బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపు వరకు సహాయ కేంద్రాలుగా గ్రామ/వార్డు సచివాలయాలు ... సహాయం కోసం అక్కడ ఉన్న 'వెల్ఫేర్ అసిస్టెంట్ / వాలంటీర్' (Welfare Assistant / Volunteer) లను సంప్రదించాలి.
  • ఒక వారంలో వాలంటీర్ ద్వారా 'వైఎస్సార్ బీమా' (YSR BIMA) కార్డు అందజేయబడుతుంది.
  • క్లెయిమ్ చేసిన 15 రోజుల్లో బీమా చెల్లింపు జరుగుతుంది.
  • బీమా మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

పథకం - బడ్జెట్ :

  • 'వైఎస్సార్ బీమా' (YSR BIMA) పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 510 కోట్లు ఖర్చు చేయనుంది.

పథకం - టోల్ ఫ్రీ నంబర్ :

  • బీమా నమోదు, క్లెయిమ్ చెల్లింపుల్లో ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ (Toll free number) 155214 లో సంప్రదించవలెను.



25, అక్టోబర్ 2020, ఆదివారం

GK TEST-76

1. 'విక్రయించే అన్ని బంగారు ఆభరణాలపై "హాల్ మార్క్" (Hallmark) తప్పనిసరిగా ఉండాలి' అనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది ? 
(ఎ) 2020 నవంబర్ 1
(బి) 2021 జనవరి 15 
(సి) 2021 మార్చ్ 15 
(డి) 2021 జూన్ 1

2. గ్రామాల్లోని ఇళ్ల స్థలాలకు యాజమాన్య హక్కులను ఖరారు చేసే "స్వామిత్వ" (SVAMITVA ⇒ Survey of Village And Mapping with Improvised Technology in Village Areas) కార్యక్రమాన్ని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ? 
(ఎ) 2020 అక్టోబర్ 1
(బి) 2020 అక్టోబర్ 11 
(సి) 2020 అక్టోబర్ 21 
(డి) 2020 అక్టోబర్ 25

3. విమానాశ్రయంలోని కౌంటర్ల వద్ద చెక్-ఇన్ (Check-In) కావాలనుకునే ప్రయాణికులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుందని తెలిపిన తొలి భారత విమానయాన కంపెనీ ? 
(ఎ) గో ఎయిర్ (GoAir) 
(బి) ఇండిగో (IndiGo)
(సి) విస్తారా (Vistara)
(డి) స్పైస్ జెట్ (SpiceJet)



4. 'ప్రపంచ ఆకలి సూచీ' (GHI ⇒ Global Hunger Index) - 2020 నివేదిక ప్రకారం మనదేశంలోని చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువు లేనివారు ? 
(ఎ) 17.1 %
(బి) 17.2 %
(సి) 17.3 %
(డి) 17.4 %

5. 'ప్రపంచ ఆకలి సూచీ' (GHI ⇒ Global Hunger Index) - 2020 నివేదిక ప్రకారం మనదేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాలు ? 
(ఎ) 3.6 %  
(బి) 3.7 % 
(సి) 3.8 % 
(డి) 3.9 %

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే భారీ సౌర విద్యుత్ పార్కులకు కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద ఇచ్చే రాయితీలను వర్తింప చేయనుంది ? (కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీ సౌర పార్కులకు రాయితీలు ఇచ్చే అవకాశం లేదు. అయితే, వ్యవసాయ విద్యుత్ అవసరాల కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించిన నేపథ్యంలో ... 30 శాతం రాయితీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది)
(ఎ) కుసుమ్
(బి) ఉజ్వల
(సి) ఉజాలా
(డి) మేక్ ఇన్ ఇండియా



7. ఐరాస (ఐక్య రాజ్య సమితి) దినోత్సవ తేదీ ? (ఇదే తేదీన 1945వ సంవత్సరంలో ఐక్య రాజ్య సమితి సంస్థాపన పత్రం సభ్య దేశాల ఆమోదం పొందినది) 
(ఎ) అక్టోబర్ 5
(బి) అక్టోబర్ 12
(సి) అక్టోబర్ 24
(డి) డిసెంబర్ 10

8. 2020 అక్టోబర్ 22న జలాంతర్గామి విధ్వంసక నౌక "ఐఎన్ఎస్ కవరత్తి" (INS Kavaratti) ని విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో ప్రారంభించినది ? (స్టెల్త్, కాంపోజిట్ సూపర్ స్ట్రక్చర్ వంటి ఆధునిక సాంకేతికతలతో, స్వదేశీ పరిజ్ఞానంతో 'గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్' (GRSE) సంస్థ ఈ నౌకను నిర్మించింది)  
(ఎ) అడ్మిరల్ కరంబీర్ సింగ్ 
(బి) రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా 
(సి) జనరల్ బిపిన్ కుమార్ రావత్
(డి) జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే 

9. భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీస్తూ .. సముద్ర నిఘా విమానాలను మొట్టమొదటిసారిగా నడిపేందుకు సిద్ధమైన మహిళా పైలట్లు "లెఫ్టినెంట్ దివ్యా శర్మ (దిల్లీ), లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్ (ఉత్తర్ ప్రదేశ్), లెఫ్టినెంట్ శివాంగి (ముజఫర్ నగర్-బీహార్)" లు విధులు నిర్వర్తిస్తున్న నౌకాదళ కమాండ్ ? (డోర్నియర్ విమానాలను (Dornier Planes) వీరు నడపనున్నారు)
(ఎ) తూర్పు నౌకాదళ కమాండ్
(బి) పశ్చిమ నౌకాదళ కమాండ్
(సి) దక్షిణ నౌకాదళ కమాండ్ 
(డి) ఏదీ కాదు 



10. ఏపీ మెట్రో రైలు కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం గల ప్రదేశం ? 
(ఎ) విశాఖపట్నం
(బి) విజయవాడ
(సి) తిరుపతి
(డి) కడప             

కీ (GK TEST-76 DATE : 2020 OCTOBER 25)
1) డి 2) బి 3) బి 4) సి 5) బి 6) ఎ 7) సి 8) డి 9) సి 10) ఎ 

All the best by www.gkbitsintelugu.blogspot.com 

GK TEST-75

1. 'కరోనా' వైరస్ ను పారదోలడంలో కీలక పాత్ర పోషించిన "జసిండా ఆర్డెన్" (JACINDA ARDERN) భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి కాబోతున్న దేశం ? (ఈ దేశంలో 24 ఏళ్ల క్రితం దామాషా ఓటింగ్ పధ్ధతి ప్రవేశపెట్టిన తర్వాత ఓ పార్టీ (Labour Party) ఒంటరిగా అధికారంలోకి రావడం ఇదే తొలిసారి) 
(ఎ) న్యూజీలాండ్
(బి) ఆస్ట్రేలియా 
(సి) జర్మనీ 
(డి) స్విట్జర్లాండ్

2. 'భారత ఎడిటర్స్ గిల్డ్' (Editors Guild of India) నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన "సీమా ముస్తఫా" (Seema Mustafa) ఏ పత్రికకు ఎడిటర్ గా ఉన్నారు ? 
(ఎ) ది సిటిజన్ (The Citizen)
(బి) హార్డ్ న్యూస్ (Hardnews) 
(సి) ది కారవాన్ (The Caravan) 
(డి) అమర్ ఉజాలా (Amar Ujala)

3. తక్కువ కాలపరిమితితోపాటు తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే "ఇంద్రావతి (వీ ఆర్ - 1101)" వంగడాన్ని రూపొందించి 'విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం' జాతీయస్థాయిలో ఖ్యాతిని దక్కించుకుంది. 'ఇంద్రావతి (వీ ఆర్ - 1101)' ఏ చిరుధాన్యానికి సంబంధించిన వంగడం ? (సూక్ష్మ పోషకాలు అధికంగా ఉన్న 17 రకాల వంగడాలను ప్రధాని 'నరేంద్ర మోదీ' రైతులకు అంకితం చేసారు. ఇందులో 'ఇంద్రావతి (వీ ఆర్ - 1101) వంగడానికి చోటు దక్కింది) 
(ఎ) రాగి
(బి) సజ్జ
(సి) కొర్ర
(డి) సామ



4. తెలుగు దేశం పార్టీ (TDP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ? 
(ఎ) కళా వెంకట్రావు
(బి) నిమ్మకాయల చినరాజప్ప
(సి) కింజరాపు అచ్చెన్నాయుడు
(డి) ఎల్.రమణ

5. కాంగ్రెస్ అగ్రనేత 'రాహుల్ గాంధీ' (Rahul Gandhi) ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం ? 
(ఎ) వయనాడ్ 
(బి) కోజికోడ్ 
(సి) తిరువనంతపురం 
(డి) పాలక్కడ్

6. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రచారపర్వంలో భాగంగా ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి 'ఇమర్తీ దేవి' ని "ఐటం" (ITEM) అని వ్యాఖ్యానించిన మాజీ ముఖ్యమంత్రి ?
(ఎ) దిగ్విజయ్ సింగ్
(బి) కమల్ నాథ్
(సి) బాబూలాల్ గౌర్
(డి) అరుణ్ యాదవ్



7. ఐపీల్ (IPL ⇒ Indian Premier League) టీ 20 క్రికెట్ టోర్నీలో వరుస మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్ మన్ ?
(ఎ) వీరేంద్ర సెహ్వాగ్
(బి) శిఖర్ ధావన్
(సి) రోహిత్ శర్మ
(డి) విరాట్ కోహ్లి

8. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన తొలి రాష్ట్రం ?  
(ఎ) పశ్చిమ బెంగాల్
(బి) రాజస్థాన్
(సి) కేరళ
(డి) పంజాబ్

9. రిటైల్, ఎస్ఎంఈ రుణాలకు అధికంగా నిధుల లభ్యత ఉండడం కోసం ఆర్బీఐ (RBI) 'రెగ్యులేటరీ రిటైల్' (Regulatory Retail) పరిమితిని రూ. 5 కోట్ల నుంచి ఎంతకు పెంచింది ?
(ఎ) రూ. 5.5 కోట్లు
(బి) రూ. 6.5 కోట్లు
(సి) రూ. 7.5 కోట్లు 
(డి) రూ. 8.5 కోట్లు 



10. ఆర్బీఐ (RBI) పరపతి విధాన కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య ? 
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8             

కీ (GK TEST-75 DATE : 2020 OCTOBER 25)
1) ఎ 2) ఎ 3) ఎ 4) సి 5) ఎ 6) బి 7) బి 8) డి 9) సి 10) బి 

All the best by www.gkbitsintelugu.blogspot.com 

GK TEST-74

1. 'బేటీ బచావో బేటీ పఢావో' (Beti Bacho, Beti Padhao) కార్యక్రమానికి ప్రచారకర్తగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన దివ్యాంగురాలు ? (చక్రాల కుర్చీలో ఉంటూ ఉన్నత చదువులకోసం ఆక్సఫర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్న మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించబోతోంది)
(ఎ) ప్రీతి శ్రీనివాసన్
(బి) అరుణిమ సిన్హా
(సి) జ్యోతి ఆమ్గే 
(డి) ప్రతిష్ఠ దేవేశ్వర్

2. 'కరోనా' వైరస్ వ్యాధి (COVID-19) నివారణ, చికిత్సలో భాగంగా అత్యంత అధికంగా శుద్ధి చేసిన "యాంటీ సీరా" (ANTISERA) ను అభివృద్ధి చేసిన సంస్థలు ? 
(ఎ) ఐ సీ ఎం ఆర్ (ICMR), భారత్ బయోటెక్
(బి) ఐ సీ ఎం ఆర్ (ICMR), బయోలాజికల్ ఇ.లిమిటెడ్
(సి) ఐ సీ ఎం ఆర్ (ICMR), ఇండియన్ ఇమ్మ్యూనోలాజికల్స్ లిమిటెడ్
(డి) ఐ సీ ఎం ఆర్ (ICMR), సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ప్రై) లిమిటెడ్

3. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా 2020 అక్టోబర్ 2న గాంధీజీకి ఎంతో ఇష్టమైన "వైష్ణవ జనతో" భజనను ఏ భాషలో విడుదల చేసారు ? (15వ శతాబ్దానికి చెందిన గుజరాతీ కవి 'సంత్ నరసింహ్ మెహతా' ఈ భజన గీతాన్ని రాశారు)
(ఎ) కశ్మిరీ
(బి) డోగ్రీ
(సి) హిందీ
(డి) ఉర్దూ



4. 107 దేశాల జాబితాతో వెలువడిన "ప్రపంచ ఆకలి సూచీ" (GHI ⇒ Global Hunger Index) - 2020లో భారత్ స్థానం ? (గత ఏడాది 'ప్రపంచ ఆకలి సూచీ' (GHI) లో 117 దేశాలు వివరాలు వెల్లడించగా అప్పుడు మనదేశం 102వ స్థానంలో ఉంది) 
(ఎ) 91
(బి) 92
(సి) 93
(డి) 94

5. "ప్రపంచ ఆకలి సూచీ" (GHI ⇒ Global Hunger Index) - 2020లో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్న దేశాల సంఖ్య ? (ఉదా : చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ ....) 
(ఎ) 15 
(బి) 16 
(సి) 17 
(డి) 18

6. ఇటీవల 'టోక్యో' (TOKYO) లో సమావేశమైన "క్వాడ్" (QUAD) కూటమి దేశాలు ? (ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును తగ్గించడానికి ఈ నాలుగు దేశాలు 'క్వాడ్' ను ఏర్పాటు చేసాయి)
(ఎ) భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
(బి) భారత్, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా
(సి) అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జపాన్
(డి) అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా



7. ఎమ్మెల్యేలు, ఎంపీలపై (MLAs & MPs) కేసులను రోజువారీ విచారణ చేపట్టాలంటూ సర్క్యూలర్ జారీ చేసిన హైకోర్ట్ ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) కర్ణాటక
(డి) మహారాష్ట్ర

8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? 
(ఎ) దగదర్తి
(బి) విశాఖపట్నం
(సి) భోగాపురం
(డి) కర్నూలు

9. ప్రభుత్వాలు పర్యావరణానికి హాని చేసే విధానాలు అనుసరిస్తున్నాయంటూ ఏకంగా దేశ పార్లమెంటు ముందే నిరసనకు దిగి - ప్రపంచవ్యాప్తంగా బాలికల్లో చైతన్యం నింపినది ?
(ఎ) సోఫియా స్కార్లట్ (రొమేనియా)
(బి) సమైరా మెహతా (అమెరికా)
(సి) గ్రెటా థున్ బర్గ్ (స్వీడన్) 
(డి) జకొంబ జబ్బి (గాంబియా) 



10. 2020ని "ఏఐ సంవత్సరం" (Artificial Intelligence Year) గా ప్రకటించిన రాష్ట్రం ? 
(ఎ) తమిళనాడు
(బి) కర్ణాటక
(సి) తెలంగాణ
(డి) ఆంధ్రప్రదేశ్             

కీ (GK TEST-74 DATE : 2020 OCTOBER 25)
1) డి 2) బి 3) ఎ 4) డి 5) సి 6) ఎ 7) బి 8) డి 9) సి 10) సి 

All the best by www.gkbitsintelugu.blogspot.com

14, అక్టోబర్ 2020, బుధవారం

2020 NOBEL PRIZE WINNERS

 2020వ సంవత్సర నోబెల్ ప్రైజ్ విజేతలు

(2020 NOBEL PRIZE WINNERS)


1. వైద్య శాస్త్రం (PHYSIOLOGY OR MEDICINE) :

  • అమెరికాకు చెందిన "హార్వీ జె ఆల్టర్, చార్లెస్ ఎం రైస్, బ్రిటన్ లో జన్మించిన మైఖేల్ హౌటన్" (HARVEY J. ALTER, MICHAEL HOUGHTON, CHARLES M. RICE) లకు ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
  • ఈ పురస్కారం కింద వీరికి 11,18,000 డాలర్లు దక్కుతాయి.
  • ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న "హెపటైటిస్ సి" (HEPATITIS C) వైరస్ ను కనుగొనడంలో ఈ ముగ్గురి శాస్త్రవేత్తల పాత్ర ఉంది.
  • "వీరి పరిశోధన కారణంగా .. వైరస్ ను గుర్తించడానికి మెరుగైన రక్త పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. రక్త మార్పిడి తర్వాత వచ్చే హెపటైటిస్ (HEPATITIS C) ను ప్రపంచంలో అనేకచోట్ల దాదాపుగా నిర్మూలించారు. ఫలితంగా ప్రజారోగ్యం చాలావరకు మెరుగుపడింది" అని నోబెల్ కమిటీ వివరించింది.
  • ఈ ముగ్గురు శాస్త్రవేత్తల ఆవిష్కరణ కారణంగా 'హెపటైటిస్ సి' (HEPATITIS C) ని లక్ష్యంగా చేసుకునే యాంటీ వైరల్ ఔషధాలను వేగంగా అభివృద్ధి చేయడానికి వీలైంది. దీని వలన హెపటైటిస్ సి (HEPATITIS C) వైరస్ ను ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి.


2. భౌతిక శాస్త్రం (PHYSICS) :

  • "రోజర్ పెన్ రోజ్ (బ్రిటన్), రెయిన్ హార్డ్ గెంజెల్ (జర్మనీ), ఆండ్రియా గెజ్ (అమెరికా)" (ROGER PENROSE (BRITAIN), REINHARD GENZEL (GERMANY), ANDREA GHEZ (USA)) లకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
  • నోబెల్ పురస్కారం కింద దక్కే సుమారు 11 లక్షల డాలర్లలో సగం మొత్తాన్ని రోజర్ పెన్ రోజ్ (బ్రిటన్) కు ఇవ్వనున్నట్లు ఎంపిక కమిటీ 'రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' (Royal Swedish Academy of Sciences) తెలిపింది.
  • కృష్ణబిలాల ఆవిర్భావం సాధ్యమేనని గణితశాస్త్ర విధానాల సాయంతో 1965లో రోజర్ పెన్ రోజ్ (బ్రిటన్) రుజువు చేసారు.
  • మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో ఉన్న భారీ కృష్ణ బిలాన్ని రెయిన్ హార్డ్ గెంజెల్ (జర్మనీ), ఆండ్రియా గెజ్ (అమెరికా) లు కనుగొన్నారని, అవార్డు మొత్తంలో రెండో సగ భాగాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు సమానంగా పంచనున్నట్లు అకాడమీ వెల్లడించింది.


3. రసాయన శాస్త్రం (CHEMISTRY) :

  • "ఎమాన్యుయెల్లె చార్పెంటియెర్ (ఫ్రాన్స్), జెన్నీఫర్ ఎ డౌడ్నా (అమెరికా)" (EMMANUELLE CHARPENTIER (FRANCE), JENNIFER A. DOUDNA (USA)) లకు రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.
  • పురస్కారంతోపాటు అందే 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని చార్పెంటియెర్, డౌడ్నా చెరిసగం పంచుకోనున్నారు.
  • ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి మానవాళికి రక్షణ కల్పించే దిశగా ఆశలు రేకెత్తిస్తున్న అద్భుత జన్యు సాధనాన్ని ఈ ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
  • జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డీఎన్ఏ (DNA)లో అవసరమైన మార్పులను (జీన్ ఎడిటింగ్) అత్యంత కచ్చితత్వంతో చేయగల 'క్రిస్పర్ కాస్9' (CRISPR Cas9) సాంకేతికతను వీరు సంయుక్తంగా అభివృద్ధి చేసారు.
  • 'అణు కత్తెర' వంటి ఈ సాంకేతికత .. మానవుల్లో జన్యు లోపాల కారణంగా వచ్చే వ్యాధులు, క్యాన్సర్లు వంటి మహమ్మారులను నయం చేసేందుకు భవిష్యత్తులో దోహదపడే అవకాశముంది.
  • రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి.
  • జన్యు లోపాలను సరిదిద్ధేందుకు 'క్రిస్పర్ కాస్9' (CRISPR Cas9) సాంకేతికత దోహదపడుతుంది. కానీ, దీన్ని అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి.
  • వాస్తవానికి క్రిస్పర్ సాంకేతికతపై ఇప్పటివరకు చాలామంది శాస్త్రవేత్తలు విశేష పరిశోధనలు చేసారు. అయితే- తక్కువ ఖర్చులో, అత్యంత సులువుగా వినియోగించుకునేందుకు వీలుగా దాన్ని తీర్చిదిద్దిన ఘనత మాత్రం చార్పెంటియెర్, డౌడ్నాలదే.


4. సాహిత్యం (LITERATURE) :

  • "లూయీస్ గ్లక్" (అమెరికా) (LOUISE GLUCK (USA)) కు సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది.
  • నోబెల్ బహుమతి కింద ఆమెకు 11 లక్షల డాలర్లు లభిస్తాయి.
  • ఏమాత్రం విమర్శలకు తావివ్వని రీతిలో రాజీలేని కృషి కొనసాగిస్తున్నందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
  • యేల్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ గా ఉన్న ఆమె న్యూయార్క్ (NEW YORK) లో జన్మించారు.
  • 1968లో 'ఫస్ట్ బోర్న్' (FIRSTBORN) కవిత ద్వారా రచనా వ్యాసంగంలో అడుగు పెట్టారు.
  • కుటుంబ జీవితం ఇతివృత్తంగా సంసారంలో సరిగమలపై ఎక్కువ రచనలు చేసిన ఆమె .. తగినంత హాస్యాన్నీ వాటికి రంగరిస్తూ వస్తున్నారు.
  • సాహిత్య రంగంలో నోబెల్ పొందిన 16వ మహిళ ఆమె.
  • "డెసెండింగ్ ఫిగర్, ది ట్రయంప్ ఆఫ్ అచిల్లెస్, అరారత్" (DESCENDING FIGURE, THE TRIUMPH OF ACHILLES, ARARAT) వంటి కవితా సంకలనాలపై నోబెల్ పురస్కారాల కమిటీ ప్రశంసలు కురిపించింది.
  • గతంలో ప్రతిష్ఠాత్మక పులిట్జర్ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 'లూయీస్ గ్లక్' (LOUISE GLUCK) అనేక పురస్కారాలు పొందారు.

నోబెల్ పురస్కారాల వాయిదా :

  • సాహిత్య రంగంలో నోబెల్ ప్రదానం చేయడానికి ఎంపికలు చేసే అకాడమీపై 2018లో వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఆ ఏడాది పురస్కారాన్ని వాయిదా వేశారు. తర్వాత నోబెల్ ఫౌండేషన్ విశ్వాసాన్ని తిరిగి చూరగొనే స్థాయిలో అకాడమీని పూర్తిస్థాయిలో సంస్కరించారు.
  • 2018, 2019 సంవత్సరాలకు నోబెల్ పురస్కారాలను 2019లో ఒకేసారి ప్రకటించారు.
  • 2019 పురస్కారాన్ని ఆస్ట్రియా రచయిత 'పీటర్ హండ్కే' కు ఇవ్వడం మరో దుమారాన్ని రేపింది.


5. నోబెల్ శాంతి బహుమతి (NOBEL PEACE PRIZE) :

  • సంక్లిష్టమైన ప్రాంతాల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి .. ప్రాణాలకు తెగించి .. అన్నార్తుల క్షుద్బాధను తీరుస్తున్న "ప్రపంచ ఆహార కార్యక్రమం" (WFP ⇒ World Food Programme) ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైంది.
  • అవార్డు కింద 1.1 లక్షల డాలర్ల నగదు, స్వర్ణ పతకం లభించనున్నాయి.
  • ఐక్యరాజ్య సమితికి చెందిన 'డబ్ల్యు ఎఫ్ పీ' (WFP ⇒ World Food Programme) .. రోమ్ కేంద్రంగా పని చేస్తోంది.
  • సాయుధ ఘర్షణలు, పెను సంక్షోభాలతో అతలాకుతలమైన దేశాల్లో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్న కార్యక్రమమే "ప్రపంచ ఆహార కార్యక్రమం" (WFP ⇒ World Food Programme).
  • 'డబ్ల్యు ఎఫ్ పీ' (WFP ⇒ World Food Programme) కి 'డేవిడ్ బీస్లీ' నేతృత్వం (Executive Director) వహిస్తున్నారు.
  • 'డబ్ల్యు ఎఫ్ పీ' (WFP ⇒ World Food Programme) గత ఏడాది .. ప్రపంచవ్యాప్తంగా 88 దేశాల్లోని 10 కోట్ల మందికి సాయం అందించింది.

318 నామినేషన్లు (318 NOMINATIONS) :

  • ఈ దఫా నోబెల్ శాంతి పురస్కారం కోసం 211 మంది వ్యక్తులు, 107 సంస్థలు తరపున నామినేషన్లు వచ్చాయి. ఈసారి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉన్న సంస్థల్లో 'డబ్ల్యు ఎఫ్ పీ' (WFP ⇒ World Food Programme) ఉందని అంతర్జాతీయ మేథోమథన సంస్థ 'స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' (SIPRI) అంచనా వేసింది.


6. ఆర్ధిక శాస్త్రం (ECONOMIC SCIENCE) :

  • "రాబర్ట్ బి విల్సన్, పౌల్ ఆర్ మిల్ గ్రోమ్" (అమెరికా) (ROBERT B. WILSON, PAUL R. MILGROM) (USA) లకు ఈ ఏడాది ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
  • వేలం సిద్ధాంతాన్ని (AUCTION THEORY) మరింతగా అభివృద్ధి చేయడం, కొత్త తరహా వేలం పద్ధతులు (AUCTION FORMATS) కనిపెట్టినందుకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు 'రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' (Royal Swedish Academy of Sciences) తెలిపింది.
  • రాబర్ట్ బి విల్సన్, పౌల్ ఆర్ మిల్ గ్రోమ్ లు గురు శిష్యుల్లాంటివారు. పౌల్ ఆర్ మిల్ గ్రోమ్ 'పీ హెచ్ డీ' (PhD) చేస్తున్నప్పుడు విల్సన్ ఆయనకు అడ్వైజర్ గా వ్యవహరించారు.
  • ఇద్దరూ ఒకే వీధిలో ఎదురెదురుగా ఉంటారు.

గమనిక (NOTE) :

  • ఈ ఏడాది మొత్తం 11 మందికి నోబెల్ పురస్కారాలు రాగా అందులో ఏడుగురు అమెరికా వాసులు కావడం గమనార్హం.



13, అక్టోబర్ 2020, మంగళవారం

RUDRAM-INDIA'S FIRST INDIGENOUS ANTI-RADIATION MISSILE

 రుద్రం (యాంటీ రేడియేషన్ క్షిపణి)

RUDRAM (ANTI-RADIATION MISSILE)


  • 2020 అక్టోబర్ 9న ఒడిశాలోని బాలేశ్వర్ లో 'సుఖోయ్-30 ఎం కె ఐ' యుద్ధ విమానం నుంచి ఉదయం 10.30 గంటలకు "రుద్రం-1" అనే యాంటీ రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.

"రుద్రం-1" గురించి ... కొన్ని విశేషాలు :

  1. రుద్రం-1 అనే ఈ అస్త్రం .. శత్రు దేశపు రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ లను ధ్వంసం చేయగలదు.
  2. రుద్రం-1ను 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) రూపొందించింది.
  3. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇదే.
  4. ధ్వని కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళుతుంది.
  5. 250 కిలోమీటర్ల దూరం పయనించగలదు.
  6. తాజా పరీక్షలో ఒడిశా తీరానికి చేరువలోని వీలర్ దీవిలో ఉన్న రేడియోధార్మిక లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.


  7. గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న యాంటీ రేడియోధార్మిక క్షిపణులను రూపొందించే సత్తా భారత్ కు ఉందని ఈ ప్రయోగం నిరూపించింది.
  8. రుద్రం-1 లో ఐఎన్ఎస్-జీపీఎస్ (INS-GPS) మార్గనిర్దేశక వ్యవస్థ ఉంది.
  9. తుది దశలో .. శత్రు లక్ష్యంపై విరుచుకుపడేందుకు 'ప్యాసివ్ హోమింగ్ హెడ్' (Passive-homing head) ఉంది.
  10. రాడార్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థల నుంచి వెలువడే రేడియేషన్ సంకేతాలను పట్టుకుని లక్ష్యాన్ని ఛేదిస్తుంది.



IGA SWIATEK

ఇగా స్వైటక్ - టెన్నిస్ క్రీడాకారిణి

IGA SWIATEK - WOMEN TENNIS PLAYER


  • ఇగా స్వైటక్ (IGA SWIATEK) పోలెండ్ దేశానికి చెందిన ఒక టెన్నిస్ క్రీడాకారిణి. వయసు 19 సంవత్సరాలు. ఫ్రెంచ్ ఓపెన్లో ఒక పోలెండ్ అమ్మాయి ఫైనల్ చేరడం 81 ఏళ్ల తర్వాత ఇదే (2020లో) తొలిసారి. చివరిగా 1939లో జెద్ విగా తుది సమరానికి అర్హత సాధించినా ... ఫైనల్లో ఓడింది. ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరడం ఇగా స్వైటక్ (IGA SWIATEK) కు ఇదే తొలిసారి.
  • ఓపెన్ శకంలో ఫ్రెంచ్ ఓపెన్ తుది సమరానికి చేరిన తొలి పోలెండ్ అమ్మాయి "ఇగా స్వైటక్" (IGA SWIATEK).
  • ఫ్రెంచ్ ఓపెన్ - 2020 టెన్నిస్ టోర్నీ మహిళా సింగిల్స్ ఫైనల్లో 'ఇగా స్వైటక్' (IGA SWIATEK) 6-4, 6-1 తో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ను ఓడించింది.


  • గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి పోలెండ్ క్రీడాకారిణి "ఇగా స్వైటక్" (IGA SWIATEK).
  • 2007 (హెనిన్) తర్వాత టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన మొదటి క్రీడాకారిణి "ఇగా స్వైటక్" (IGA SWIATEK).
  • 1997 (19 ఏళ్ల వయసులో మజోలీ) తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీనేజీ అమ్మాయిగా "ఇగా స్వైటక్" (IGA SWIATEK) రికార్డ్ సృష్టించింది.
  • ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన 'ఇగా స్వైటక్' (IGA SWIATEK) సుమారు రూ. 13 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది.
  • ఫ్రెంచ్ ఓపెన్ లో అన్ సీడెడ్ గా బరిలో దిగి టైటిల్ సాధించిన రెండో అమ్మాయి 'ఇగా స్వైటక్' (IGA SWIATEK). తొలి స్థానంలో ఓస్టా పెంకో (2017) ఉంది.
  • ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో 54వ స్థానంలో ఉన్న 'ఇగా స్వైటక్' (IGA SWIATEK) ఈ విజయం తర్వాత 17వ రాంక్ కు చేరనుంది.



TOLL FREE NUMBER 18001212830

 టోల్ ఫ్రీ నంబర్ - 18001212830 

(TOLL FREE NUMBER - 18001212830)


  • చిన్నారుల్లో 'కరోనా' (Corona) కారణంగా ఏర్పడే భయాందోళనలను తొలగించేందుకు 'జాతీయ బాలల హక్కుల కమిషన్' (NCPCR ⇒ National Commission for Protection of Child Rights) టోల్ ఫ్రీ నంబర్ "18001212830" ను ఏర్పాటు చేసింది.
  • సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం పది నుంచి ఒంటి గంట మధ్య (10 AM - 1 PM), మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల మధ్య (3 PM - 8 PM) ఈ టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుంది.
  • 'కరోనా' (Corona) కారణంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడే చిన్నారుల కోసం తల్లిదండ్రులు ఈ టోల్ ఫ్రీ నంబర్ ను ఉపయోగించుకోవచ్చు.



SVAMITVA

స్వామిత్వ యోజన (యాజమాన్య ప్రణాళిక)

SVAMITVA (Survey of Village And Mapping with Improvised Technology in Village Areas)


పథకం ప్రారంభం :

  • 2020 అక్టోబర్ 11న 'గ్రామాల్లోని ఇళ్ల స్థలాలకు యాజమాన్య హక్కులను ఖరారు చేస్తూ రూపొందించిన కార్డులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన "స్వామిత్వ" (SVAMITVA ⇒ సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్)' కార్యక్రమాన్ని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' వీడియో సమావేశంలో ప్రారంభించారు.

పథకం - కొన్ని విశేషతలు :

  1. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి కచ్చితమైన ఆస్తి హక్కు పత్రాలను సృష్టించి లబ్ధిదారులకు అందించేందుకు ఉద్దేశించిన పథకమే "స్వామిత్వ" (SVAMITVA).
  2. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం.
  3. వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6.2 లక్షల (6,20,000) గ్రామాల్లోని ఆస్తులను సర్వే చేసి ఆస్తి హక్కు కార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  4. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 2020 ఏప్రిల్ 24న ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' 'స్వామిత్వ యోజన' (యాజమాన్య ప్రణాళిక) ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
  5. ఆరు నెలల్లో ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 1.32 లక్షల మంది (1,32,000) కి సంబంధించిన ఆస్తి హక్కు పత్రాలను తయారు చేసారు.
  6. డ్రోన్ సర్వే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామాల్లోని ఇళ్లను సర్వే చేసి ప్రజలకు రికార్డ్ ఆఫ్ రైట్స్ కార్డులు (Record of Rights Cards) మంజూరు చేస్తారు.


  7. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీ (NODAL AGENCY) గా వ్యవహరిస్తుంది.
  8. రాష్ట్రాల్లో రెవిన్యూ, ల్యాండ్ రికార్డ్ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖతో కలిపి ఈ రెండు విభాగాలు సర్వే పూర్తిచేస్తాయి.
  9. సర్వే ఆఫ్ ఇండియా (SURVEY OF INDIA) సంస్థ ఈ పథకం అమలులో సాంకేతిక భాగస్వామి (Technical Partner) గా వ్యవహరించనుంది.
  10. 2024 మార్చ్ నాటికి 6.2 లక్షల గ్రామాల ఆస్తులను సర్వే చేస్తారు.
  11. గ్రామాల ప్రణాళికను క్రమబద్ధీకరిస్తారు. పన్ను వసూళ్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి హక్కులపై స్పష్టతనిస్తారు.
  12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,950 గ్రామాలలో (2021-22 ⇒ 4,000 ; 2022-23 ⇒ 8,400 ; 2023-24 ⇒ 5,550) మరియు తెలంగాణ రాష్ట్రంలో 11,234 గ్రామాలలో (2023-24 ⇒ 11,234) 'స్వామిత్వ' (SVAMITVA) పథకాన్ని అమలు చేయనున్నారు.



4, అక్టోబర్ 2020, ఆదివారం

GK TEST-73

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీని నిర్మించనున్న 'కురుపాం' ఏ జిల్లాలో ఉంది ?
(ఎ) శ్రీకాకుళం
(బి) విజయనగరం
(సి) విశాఖపట్నం
(డి) తూర్పుగోదావరి

2. విశాఖపట్నంలోని 'కింగ్ జార్జ్ హాస్పిటల్' (KGH)లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న 'కొవిడ్-19' టీకా ? 
(ఎ) కొవిషీల్డ్
(బి) కొవాగ్జిన్
(సి) స్పుత్నిక్-వి
(డి) ఎంఎంఆర్వీ

3. చెన్నై నుంచి అండమాన్, నికోబార్ దీవుల వరకు సముద్ర గర్భంలో వేసిన 'ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్' ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ? 
(ఎ) 2020 ఆగస్ట్ 7
(బి) 2020 ఆగస్ట్ 8
(సి) 2020 ఆగస్ట్ 9
(డి) 2020 ఆగస్ట్ 10



4. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, మనదేశం 72 వేల అత్యాధునిక 'సిగ్ సావర్ రైఫిళ్లు' (SIG SAUER RIFLES)ను ఏదేశం నుంచి కొనుగోలు చేయనుంది ? 
(ఎ) అమెరికా
(బి) రష్యా
(సి) ఇజ్రాయెల్
(డి) ఫ్రాన్స్

5. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ధరలపై ముందస్తు ఒప్పందాలకు ఉద్దేశించిన "వ్యవసాయదారుల (సాధికారత, రక్షణ), ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల చట్టం-2020" రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసిన 'టీఎన్ ప్రతాపన్' (కాంగ్రెస్) కేరళ రాష్ట్రంలోని ఏ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ? (సెక్షన్ 19 ప్రకారం ... రైతులు, వ్యాపారుల మధ్య ఈ చట్టం కింద కుదిరిన ఒప్పందాల్లో ఏ కోర్టూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు)
(ఎ) త్రిసూర్
(బి) తిరువనంతపురం
(సి) ఇడుక్కి
(డి) పథనంతిట్ట

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల తనిఖీ బాధ్యతలు చూసే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగి ?
(ఎ) సచివాలయ కార్యదర్శి
(బి) మహిళా సంరక్షణ కార్యదర్శి
(సి) సంక్షేమ సహాయకుడు
(డి) గ్రామ రెవిన్యూ అధికారి



7. టీ20 క్రికెట్లో అత్యధిక మందిని (91 ⇒ 57 క్యాచ్ లు, 34 స్టంప్ లు) ఔట్ చేసిన వికెట్ కీపర్ గా 'మహేంద్ర సింగ్ ధోని' పేరిట ఉన్న రికార్డ్ ను అధిగమించిన మహిళా వికెట్ కీపర్ "అలీసా హీలీ"ది ఏ దేశం ?
(ఎ) న్యూజీలాండ్
(బి) ఆస్ట్రేలియా
(సి) ఇంగ్లండ్
(డి) దక్షిణాఫ్రికా

8. వాహనాలను నడిపే సమయంలో కచ్చితమైన మార్గం తెలుసుకునేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూసే అవకాశం కల్పిస్తూ 'కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ' ఇచ్చిన ఆదేశాలు ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ? (వాహన డాష్ బోర్డ్ (Dash Board) లో గానీ, డ్రైవర్ కు ముందువైపు గానీ మొబైల్ హోల్డర్ ఏర్పాటు చేసుకుని అందులో సెల్ ఫోన్ ఉంచి మార్గం చూసుకుని డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించింది) 
(ఎ) 2020 అక్టోబర్ 1
(బి) 2020 అక్టోబర్ 2
(సి) 2020 అక్టోబర్ 3
(డి) 2020 అక్టోబర్ 4

9. జమ్మూ-కశ్మిర్ లో గుర్తించబడిన మొత్తం అధికార భాషల సంఖ్య ?
(ఎ) 3
(బి) 5
(సి) 7
(డి) 9



10. 'కరోనా' మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్యా పరంగా మొదటి ఐదు స్థానాలలో ఉన్న దేశాలు వరుసగా ... ? (2020 సెప్టెంబర్ 27 నాటికి ప్రపంచవ్యాప్తంగా 'కరోనా' బారిన పడి మరణించిన వారి సంఖ్య 10,00,587 కు చేరుకుంది) 
(ఎ) అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో, బ్రిటన్
(బి) అమెరికా, భారత్, బ్రిటన్, బ్రెజిల్, మెక్సికో
(సి) అమెరికా, భారత్, బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్
(డి) అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, భారత్, మెక్సికో            

కీ (GK TEST-73 DATE : 2020 OCTOBER 4)
1) బి 2) ఎ 3) డి 4) ఎ 5) ఎ 6) బి 7) బి 8) ఎ 9) బి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com

DISTRIBUTION OF RoFR PATTAS

 అటవీ హక్కు పత్రాల పంపిణీ 

(Distribution of Recognition of Forest Rights Pattas)


  • అడవి తల్లిని నమ్ముకుని అరకొర సంపాదనతో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుక ... పట్టా (RoFR ⇒ Recognition of Forest Rights).

కార్యక్రమం ప్రారంభం :

  • 2020 అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో, రాష్ట్ర జనాభాలో 6% ఉన్న గిరిజనులకు అటవీ భూములపై హక్కు కల్పించే (RoFR ⇒ Recognition of Forest Rights) పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్ (Virtual) విధానంలో ప్రారంభించారు.

కార్యక్రమం లక్ష్యం :

  • గిరిపుత్రులను సిరిపుత్రులుగా మార్చాలి అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'అటవీ హక్కు పత్రాల పంపిణీ' కార్యక్రమాన్ని చేపట్టింది.


కార్యక్రమం ప్రయోజనాలు :

  1. దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు సుమారు 3.12 లక్షల ఎకరాల అటవీ భూములకు హక్కు పత్రాలు (RoFR) పంపిణీ చేస్తారు. ఎక్కడా భూ వివాదాలకు తావులేకుండా డిజిటైజేషన్ ద్వారా సర్వే నిర్వహించి సరిహద్దులు, గట్లు ఏర్పాటు చేస్తారు.
  2. పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాల భూమిని కేటాయిస్తారు. భూమి కేటాయింపు పత్రాలు ఆ కుటుంబంలోని స్త్రీ పేరున జారీ చేస్తారు.
  3. ప్రభుత్వం ఇచ్చే పట్టాలు (RoFR) పొందిన గిరిజన రైతుల భూముల అభివృద్ధి, ఉద్యానవనాలు, తోటల పెంపకం, నీటి సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తారు.
  4. అర్హత కలిగిన ప్రతి గిరిజన రైతు కుటుంబానికి "వైఎస్సార్ రైతు భరోసా" కింద ఏటా రూ. 11,500 (ఖరీఫ్ పంట కాలంలో రూ. 7,500 మరియు రబీ పంట కాలంలో రూ. 4,000) పెట్టుబడి సాయం అందజేస్తారు.
  5. మొత్తమ్మీద గిరిజనులకు అటవీ హక్కు పత్రాల పంపిణీ చేపట్టడం ఇది నాలుగోసారి.
  6. 'అక్టోబర్' మాసాన్ని హక్కు పత్రాల పంపిణీ నెలగా ప్రభుత్వం ప్రకటించింది.