ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఫిబ్రవరి 2022, గురువారం

జి.కె.టెస్ట్-12 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-12 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU


1వ ప్రశ్న : ఐక్యరాజ్య సమితి (UNO) కి చెందిన 'ప్రపంచ వాతావరణ సంస్థ' (WMO) తెలిపిన వివరాల ప్రకారం .. ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపు ఎక్కడ సంభవించింది ?

జవాబు : అమెరికా

2020 ఏప్రిల్ 29న అమెరికాలో కనిపించిన 'మెరుపు' ఇంతవరకు అతి పొడవైనదిగా 'డబ్ల్యుఎంఓ' తేల్చింది. ఈ మెరుపు పొడవు దాదాపు 770 కి.మీ. లు. అమెరికా దక్షిణ ప్రాంతంలోని మిసిసిపి, లూసియానా, టెక్సాస్ ల మీదుగా ఈ మెరుపు మెరిసినట్లు డబ్ల్యుఎంఓ తెలిపింది.

అంతకుముందు అతి పొడవైన మెరుపు బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలో కనిపించింది. 2018 అక్టోబర్ 31న అది 709 కి.మీ.ల మేర విస్తరించింది.

అత్యంత ఎక్కువ సమయం మెరిసిన మెరుపు కూడా 2020లోనే కనిపించినట్లు డబ్ల్యుఎంఓ తెలిపింది. ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనా మీదుగా జూన్ 18న 17.102 సెకన్ల పాటు (0.002 సెకన్లు అటు ఇటుగా) ఈ మెరుపు మెరిసింది.

2వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి ప్రయాణ టికెట్, ప్రత్యేక దర్శనం బుక్ చేసుకున్న వారికి .. తిరుమల కొండ పైకి వెళ్లి తిరిగి వచ్చే టిక్కెట్లను కూడా (Online booking for Tirumala travel on APSRTC buses) ఏ తేదీ నుంచి జారీ చేయనున్నారు ?

జవాబు : 2022 ఫిబ్రవరి 3

ఈ టిక్కెట్లకు ఆన్లైన్ లోనే అదనంగా రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.

3వ ప్రశ్న : సివిల్ సర్వీసెస్-2022 నోటిఫికేషన్ (Civil Services-2022 Notification) ఎప్పుడు విడుదలయ్యింది ?

జవాబు : 2022 ఫిబ్రవరి 2

గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య పెరిగింది. ప్రస్తుత నోటిఫికేషన్ లో మొత్తం 861 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. 

2020లో 796, 2021లో 712 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2019లో మాత్రం 896 ఖాళీలను భర్తీ చేశారు.

 సివిల్ సర్వీసెస్-2022 ప్రాథమిక పరీక్ష జూన్ 5న జరగనుంది. దరఖాస్తు గడువు 2022 ఫిబ్రవరి 22 వరకు ఉంది.

4వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'అమరావతి' ని తమ రాజధానిగా ఏ తేదీన ప్రకటించింది ?

జవాబు : 2015 ఏప్రిల్ 23

5వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా ఏ నగరంలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల (Pre-paid Electricity Meters) ను ఏర్పాటు చేశారు ?

జవాబు : విశాఖపట్నం

విశాఖపట్నం సర్కిల్ కార్యాలయంలోని జోన్-1 పరిధిలో వంద గృహ, వాణిజ్య విద్యుత్తు (95 సింగిల్ ఫేజ్, 5 త్రీ ఫేజ్) కనెక్షన్లకు ఈ మీటర్లను అనుసంధానం చేశారు. 

6వ ప్రశ్న : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏ సంస్థ భారత సైన్యం కోసం 'కొంకర్స్-ఎం' యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను సరఫరా చేయనుంది ?

జవాబు : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

దీనికి సంబంధించిన ఒప్పందంపై 'బీడీఎల్' భారత సైన్యంతో 2022 ఫిబ్రవరి 2న సంతకాలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 3,131.82 కోట్లు. మూడేళ్లలో ఈ క్షిపణులను సరఫరా చేయాల్సి ఉంటుంది.

'కొంకర్స్-ఎం' యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను రష్యాకు చెందిన 'ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్' (OEM) కంపెనీతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుని మనదేశంలో ఉత్పత్తి చేస్తున్నట్లు బీడీఎల్ సిఎండి 'సిద్ధార్థ మిశ్రా' వివరించారు. శత్రువుకు చెందిన యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేయగల సత్తా ఈ క్షిపణులకు (ATGM) ఉంది. 'బీఎంపీ-2' ట్యాంక్ లాంచర్ లేదా భూమి మీద నుంచి ఈ క్షిపణులను ప్రయోగించవచ్చు. కేవలం 19 సెకన్ల వ్యవధిలోనే నాలుగు వేల మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. పూర్తిగా దేశీయంగా తయారైన విడిభాగాలతో వీటిని మనదేశంలో బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది.

7వ ప్రశ్న : ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే ఐపీల్ వేలంలో పాల్గొనే తుది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి ?

జవాబు : మనోజ్ తివారి

గతంలో టీంఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించిన 36 ఏళ్ల మనోజ్ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి రానున్నాడు.

గతేడాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి మమతా బెనర్జీ మంత్రివర్గంలో క్రీడల శాఖ బాధ్యతలు చూస్తున్నాడు.

8వ ప్రశ్న : 2021 సంవత్సరానికి ఐసీసీ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డును ఎవరు గెలుచుకున్నారు ?

జవాబు : డరిల్ మిచెల్ (న్యూజిలాండ్)

 ఇంగ్లాండ్ తో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి, తేలిగ్గా వచ్చే ఓ సింగిల్ ను తీయడానికి నిరాకరించినందుకు అతడు ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.

కివీస్ ఇన్నింగ్స్ లో నీషమ్ బంతిని కొట్టి సింగిల్ తీయాలనుకున్నాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న మిచెల్ పరుగు తీయడానికి నిరాకరించాడు. బంతిని పట్టుకోవాలనుకున్న రషీద్ కు తాను అడ్డుగా వచ్చానని భావించడమే అందుకు కారణం. 

9వ ప్రశ్న : 24 ఏళ్ల తర్వాత తొలిసారి ఏ దేశ క్రికెట్ జట్టు 'అండర్-19 ప్రపంచకప్' ఫైనల్ చేరింది ?

జవాబు : ఇంగ్లాండ్

ఉత్కంఠగా సాగిన సెమీస్ లో ఆ జట్టు డక్ వర్త్ లూయిస్ పధ్ధతి ప్రకారం 15 పరుగుల తేడాతో ఆఫ్గానిస్థాన్ పై గెలిచింది. 

10వ ప్రశ్న : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్ల కొత్త మార్కెట్ విలువలు (రిజిస్ట్రేషన్) ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ?  

జవాబు : 2022 ఫిబ్రవరి 1

తెలంగాణ రాష్ట్రంలో కనీస పెరుగుదల వ్యవసాయ భూముల విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, ఫ్లాట్ల విలువ 25 శాతంగా ఉంది.

హైదరాబాద్ బంజారాహిల్స్ లో చదరపు గజానికి రూ. 1,14,100 గా నిర్ణయించారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక ధర.