ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, జులై 2021, గురువారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-73

1. భారత దిగ్గజ స్ప్రింటర్ 'మిల్కాసింగ్' కు "ఫ్లయింగ్ సిఖ్" (FLYING SIKH) అనే బిరుదును ఇచ్చిన పాకిస్థాన్ అధ్యక్షుడు ? ['కరోనా' దుష్పరిణామాలతో 2021 జూన్ 18న 'మిల్కాసింగ్' (MILKHA SINGH) మరణించాడు. 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ లో పాల్గొన్న 'మిల్కాసింగ్' 400 మీటర్ల పరుగు పందెం ఫైనల్ లో 0.1 సెకను తేడాతో 'కాంస్య పతకం' ను కోల్పోయాడు] 
    

(ఎ) సికందర్ మీర్జా
(బి) అయూబ్ ఖాన్
(సి) మహమ్మద్ ఆఫ్జల్ చీమా 
(డి) ఫజ్ లుల్ ఖాదిర్ చౌధురి

2. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ద ఇండియా బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ ప్రమోషన్ స్కీమ్' (IBPS) కింద కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది ? [ఈ 'పథకం' (IBPS) కింద దేశంలోని రెండో, మూడో శ్రేణి పట్టణాల్లో పలు ఐటీ, బీపీఓ కంపెనీలను విస్తరించారని, ఈ పథకం కిందే ఆంధ్రప్రదేశ్ 12,234 కొత్త ఉద్యోగాలను ఇవ్వగలిగిందని .. 'ఎస్ టీ పీ ఐ' (STPI) 2021 జూన్ 19న వెల్లడించింది] 
  

(ఎ) 1   
(బి) 2    
(సి) 3    
(డి) 4   

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'చిత్తూరు, కడప' జిల్లాల్లో విస్తరించిన శ్రీవెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని 'పర్యావరణ సున్నిత మండలం' (ECO SENSITIVE ZONE) గా ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ ? [రెండు జిల్లాల్లో 525.97 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ సంరక్షణ కేంద్రంలో అరుదైన వృక్షజాతులు ఉండడం వలన మొత్తం 448 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 'పర్యావరణ సున్నిత మండలం' (ECO SENSITIVE ZONE) గా ప్రకటించారు. దీని పరిధిలోనే 'శ్రీవెంకటేశ్వర జాతీయ పార్కు' కూడా ఉంది]  
      

(ఎ) 2021 జూన్ 17    
(బి) 2021 జూన్ 18   
(సి) 2021 జూన్ 19   
(డి) 2021 జూన్ 20   

4. ప్రపంచంలోనే తొలిసారిగా .. లాండ్రీ డిటర్జెంట్ సీసాను కాగితంతో రూపొందించడానికి (PAPER BOTTLE) సిద్ధమవుతున్న ప్రముఖ 'ఎఫ్ ఎం సీ జీ' (FMCG) సంస్థ ? [ఈ నమూనాను 2022 ప్రారంభంలో 'బ్రెజిల్' లో విడుదల చేసే అవకాశం ఉంది]
 

(ఎ) గోద్రెజ్   
(బి) పతంజలి   
(సి) యూనీలీవర్   
(డి) నెస్లే   

5. 'కొవిడ్ సురక్ష' ప్రాజెక్ట్ (COVID SURAKSHA PROJECT) లో భాగంగా 'కొవిడ్' వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? [దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మరో 18 చోట్ల రాబోతున్నాయి] (సమాచార తేదీ : 2021 జూన్ 20)
    

(ఎ) విశాఖపట్నం      
(బి) కాకినాడ    
(సి) అమరావతి    
(డి) పులివెందుల  

6. 'కరోనా వ్యాక్సినేషన్' లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ (CORONA VACCINATION SPECIAL DRIVE) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేసి రికార్డు సృష్టించిన తేదీ ? [పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,64,308 మందికి, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 63,314 మందికి 'కరోనా' టీకాలు వేశారు] 
    

(ఎ) 2021 జూన్ 17    
(బి) 2021 జూన్ 18   
(సి) 2021 జూన్ 19   
(డి) 2021 జూన్ 20   

7. 'జమ్మూ-కశ్మిర్' (JAMMU-KASHMIR) నియోజకవర్గాల పునర్విభజనకు ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని గతేడాది నియమించారు ? 
  

(ఎ) జస్టిస్ జాస్తి చలమేశ్వర్   
(బి) జస్టిస్ ఆర్.పి.దేశాయ్    
(సి) జస్టిస్ రాకేశ్ కుమార్   
(డి) జస్టిస్ శ్రీకృష్ణ   

8. 2021 జూన్ 21న నిర్వహించిన 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' (INTERNATIONAL DAY OF YOGA) మొత్తమ్మీద ఎన్నో యోగా దినోత్సవం ? [ఈ ఏడాది "ఆరోగ్యం కోసం యోగా" అనేది ప్రధానాంశంగా ప్రకటించారు]
 

(ఎ) 6     
(బి) 7     
(సి) 8   
(డి) 9  

9. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ (INDIAN WOMEN'S CRICKET TEAM HEAD COACH) గా నియమితులైన టీమిండియా మాజీ క్రికెటర్ ? (సమాచార తేదీ : 2021 మే 13)  

(ఎ) అజయ్ రత్రా    
(బి) డబ్ల్యూ వీ రామన్   
(సి) రమేష్ పొవార్    
(డి) హేమలత    

10. ప్రభుత్వాసుపత్రిలో బెడ్లకు ప్రత్యామ్నాయంగా 'ఆక్సిజన్ పడకల ఆర్టీసీ బస్సులు' (OXYGEN ON WHEELS) ను ఏ నగరంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద 2021 మే 13న ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి ? ['జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు' పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఆర్టీసీ ఏసీ బస్సులలో ఈ పడకలను సిద్ధం చేశారు]    
   ' 

(ఎ) విజయవాడ    
(బి) రాజమహేంద్రవరం   
(సి) కాకినాడ   
(డి) విశాఖపట్నం                

కీ (KEY) (GK TEST-73 YEAR : 2021)
1) బి      2) ఎ      3) సి      4) సి      5) ఎ      6) డి      7) బి      8) బి      9) సి     10) బి     

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com