ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, జూన్ 2021, మంగళవారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-72

1. మొత్తం 700 MHz సామర్థ్యం గల స్పెక్ట్రమ్ లో రైల్వేల సిగ్నళ్లు, కమ్యూనికేషన్ల కోసం ఎంత స్పెక్ట్రమ్ ను కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి 2021 జూన్ 9న నిర్ణయం తీసుకుంది ? [ఇంతవరకు ఆప్టికల్ ఫైబర్ విధానం ద్వారా సిగ్నలింగ్, ఇతర వ్యవస్థలను నిర్వహిస్తుండగా .. ఇకపై అత్యంత వేగం గల రేడియో తరంగాల ద్వారా వీటిని నడుపుతారు. దీని వలన లైవ్ వీడియో ద్వారా రైలు కదలికలను గుర్తించడానికి వీలవుతుంది. ఇందుకు అయిదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తారు] (How much spectrum in 700 MHz band to Indian Railways ?)
    

(ఎ) 3 MHz   
(బి) 4 MHz   
(సి) 5 MHz   
(డి) 6 MHz   

2. తాజాగా ప్రకటించిన 'క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్ 2022' (QS WORLD UNIVERSITY RANKINGS 2022) లో భారతదేశానికి చెందిన ఎన్ని ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు వెయ్యిలోపు స్థానం దక్కించుకున్నాయి ? (TOP INDIAN INSTITUTES NAMES, RANKINGS IN 'QS WORLD UNIVERSITY RANKINGS 2022' REPORT)
  

(ఎ) 21  
(బి) 22   
(సి) 23   
(డి) 24  

3. కృష్ణా జలాలకు సంబంధించి .. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఏవిధంగా ఉండాలి' అనే విషయాలపై నిర్ణయం తీసుకోవాలని 'బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్' కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది ?
      

(ఎ) 86   
(బి) 87  
(సి) 88  
(డి) 89  

4. 2021-22 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి .. కేంద్ర ప్రభుత్వం 'వరి' (PADDY) పంటకు కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 1,868 నుంచి ఎంతకు పెంచింది ?
 

(ఎ) రూ. 1,910  
(బి) రూ. 1,920  
(సి) రూ. 1,930  
(డి) రూ. 1,940  

5. కరోనా వైరస్ పై 'సర్జికల్ స్ట్రైక్' (SURGICAL STRIKE) చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపిన కోర్టు ?
    

(ఎ) బాంబే హైకోర్టు     
(బి) మద్రాస్ హైకోర్టు   
(సి) తెలంగాణ హైకోర్టు   
(డి) దిల్లీ హైకోర్టు 

6. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (Election Commissioner of India) గా 2021 జూన్ 9న బాధ్యతలు స్వీకరించిన మాజీ ఐఏఎస్ అధికారి ?
    

(ఎ) అనూప్ చంద్ర పాండే  
(బి) దువ్వూరి సుబ్బారావు  
(సి) నీలం సాహ్ని  
(డి) ఐవైఆర్ కృష్ణారావు  

7. భారత వైమానిక దళం (IAF) కోసం మొట్టమొదటిసారిగా ఎంతమంది మహిళా అధికారులను యుద్ధ హెలికాఫ్టర్ల పైలట్ల శిక్షణకు భారత సైన్యం ఎంపిక చేసింది ? [ఈ మహిళా అధికారులు మహారాష్ట్రలోని 'నాసిక్' లో శిక్షణ తీసుకోనున్నారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది జూలైలో వారు విధుల్లో చేరనున్నారు]
  

(ఎ) 1  
(బి) 2  
(సి) 3  
(డి) 4  

8. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) 'జస్టిస్ ఎన్వీ రమణ' చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒకేసారి 24 నుంచి ఎంతకు పెరిగింది ? [దీనికి సంబంధించి సీజేఐ (CJI) 'జస్టిస్ ఎన్వీ రమణ' 2021 జూన్ 8న ఆమోదముద్ర వేశారు]
 

(ఎ) 40    
(బి) 41   
(సి) 42  
(డి) 43   

9. కేంద్ర ప్రభుత్వం "స్వామిత్వ" (SVAMITVA) పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తేదీ ? [ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2021 జూన్ 9న "స్వామిత్వ" (SVAMITVA) సర్వే ప్రారంభమైంది. రెవిన్యూ డివిజన్ కు ఒకటి చొప్పున 51 గ్రామాల్లో ఆస్తుల సర్వేను మొదలుపెట్టారు] 

(ఎ) 2020 జనవరి 1  
(బి) 2020 ఏప్రిల్ 24  
(సి) 2020 అక్టోబర్ 11   
(డి) 2020 డిసెంబర్ 10   

10. 'కొవిషీల్డ్' (COVISHIELD) టీకా మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుంచి ఎన్ని వారాలకు పొడిగిస్తూ 2021 మే 13న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ? ['నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్' సిఫార్సుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని 'కేంద్ర ఆరోగ్య శాఖ' తెలిపింది]
   ' 

(ఎ) 12-13 వారాలు   
(బి) 12-14 వారాలు  
(సి) 12-15 వారాలు  
(డి) 12-16 వారాలు               

కీ (KEY) (GK TEST-72 YEAR : 2021)
1) సి     2) బి     3) డి     4) డి     5) ఎ     6) ఎ     7) బి     8) సి     9) బి     10) డి    

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

11, జూన్ 2021, శుక్రవారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-71

1. సాగర గర్భంలో భారత నౌకాదళ పోరాట పటిమను మరింత శక్తిమంతం చేసేందుకు అధునాతన పరిజ్ఞానంతో 6 సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మించేందుకు ఉద్దేశించిన మెగా ప్రాజెక్ట్ (PROJECT 75 INDIA) ను 'రక్షణ కొనుగోళ్ల మండలి' (DAC) ఆమోదించిన తేదీ ? ['వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' (STRATEGIC PARTNERSHIP MODEL) కింద చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్ట్ (P-75 (INDIA) పూర్తికావడానికి 12 ఏళ్లు పడుతుంది]
INS KALVARI
SUBMARINE

  
(ఎ) 2021 జూన్ 1 
(బి) 2021 జూన్ 2  
(సి) 2021 జూన్ 3  
(డి) 2021 జూన్ 4 

2. 2021 జూన్ 4న ముగిసిన ఆర్బీఐ (RBI) 'పరపతి విధాన కమిటీ' (MPC) సమావేశంలో .. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2021-22) వృద్ధి రేటు అంచనాలను 10.5% నుంచి ఎంత శాతానికి తగ్గించారు ? [ద్రవ్యోల్బణ అంచనాలను 5.1 శాతంగా ఉండొచ్చని తెలియజేశారు] 
(ఎ) 10% 
(బి) 9.5%  
(సి) 9%  
(డి) 8.5% 

3. 'ఏపీ అమూల్ ప్రాజెక్ట్' (AP AMUL PROJECT) లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి'వర్చువల్ విధానంలో ప్రారంభించిన తేదీ ? ['ఏపీ అమూల్ ప్రాజెక్ట్' (AP AMUL PROJECT) ను ఈ ఏడాది 2,600 గ్రామాలకు, రెండేళ్లు పూర్తయ్యేలోపు దశలవారీగా 9,899 గ్రామాలకు విస్తరించనున్నారు. ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాల్లోని 722 గ్రామాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతోంది.    
(ఎ) 2021 జూన్ 4  
(బి) 2021 జూన్ 5 
(సి) 2021 జూన్ 6 
(డి) 2021 జూన్ 7 

4. 'ఇథనాల్ మిశ్రమ మార్గసూచి 2020-2025' (ETHANOL BLENDING ROAD MAP 2020-25) ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ఆవిష్కరించిన తేదీ ? [పెట్రోల్ లో 10 శాతం ఇథనాల్ ను 2022కి, 20 శాతం ఇథనాల్ ను కలిపి విక్రయించాలన్న లక్ష్యాన్ని 2030కి చేరుకోవాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను మిశ్రమం చేయాలన్న లక్ష్యాన్ని అయిదేళ్ల ముందుగానే అంటే 2025 కల్లా చేరుకుంటామని ప్రధాని అన్నారు] 
(ఎ) 2021 జూన్ 3 
(బి) 2021 జూన్ 4 
(సి) 2021 జూన్ 5 
(డి) 2021 జూన్ 6 

5. కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన 'పాఠశాల విద్య పనితీరు సూచిక 2019-20' (PERFORMANCE GRADING INDEX (PGI) 2019-20) ప్రకారం .. లెవెల్ 1లో ఒక్క రాష్ట్రమూ స్థానాన్ని దక్కించుకోలేదు. లెవెల్ 2లో గ్రేడ్ 1++ జాబితాలో 901-950 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినవి ? [కేంద్ర విద్యా శాఖ .. పాఠశాల విద్యా నాణ్యతలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనబరుస్తున్న పనితీరును పది లెవెల్స్ గా విభజించి వాటికి తొమ్మిది గ్రేడ్ లను ప్రకటించింది. లెవెల్-4లో 801-850 మార్కులతో గ్రేడ్-1 విభాగంలో ఆంధ్రప్రదేశ్, లెవెల్-5లో 751-800 మార్కులతో గ్రేడ్-2లో తెలంగాణ నిలిచాయి. పాఠశాల విద్యలో చేపట్టిన మార్పులను పరిగణనలోకి తీసుకుని 70 కొలమానాల ఆధారంగా పనితీరును అంచనా వేశారు]    
(ఎ) కేరళ, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, చండీగఢ్    
(బి) కేరళ, చండీగఢ్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, దిల్లీ   
(సి) లడఖ్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్  
(డి) పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్

6. కరోనా మూడో దశ ఉద్ధృతి చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో .. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' (COVAXIN) టీకా క్లినికల్ ట్రయల్స్ 18 ఏళ్లలోపు వారిపై ప్రారంభమైన తేదీ ? [మహారాష్ట్రలోని నాగ్ పుర్ లో మెడిట్రినా ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడు 'డాక్టర్ వసంత్ ఖాలాత్కర్' పర్యవేక్షణలో క్లినికల్ పరీక్షలు మొదలయ్యాయి]    
(ఎ) 2021 జూన్ 4 
(బి) 2021 జూన్ 5 
(సి) 2021 జూన్ 6 
(డి) 2021 జూన్ 7 

7. ప్రపంచంలోకెల్లా తొలిసారిగా 'నానో యూరియా' (NANO UREA) ద్రావణాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ? [ఒక్కో నానో యూరియా సీసా ధరను రూ. 240గా ఈ సంస్థ నిర్ణయించింది. సంప్రదాయ యూరియా బస్తాతో పోలిస్తే ఈ నానో యూరియా సీసా ధర 10 శాతం తక్కువగా ఉంటుంది]  
(ఎ) ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ 
(బి) నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 
(సి) కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 
(డి) రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 

8. క్రింది వాటిలో 'బిమ్ స్టెక్' (BIMSTEC) కూటమిలో లేని దేశం ? [సమాచార తేదీ : 2021 జూన్ 6]
BIMSTEC
బిమ్ స్టెక్ 

   

(ఎ) బంగ్లాదేశ్   
(బి) భూటాన్  
(సి) నేపాల్ 
(డి) చైనా  

9. భారతదేశంలో .. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది ? [రోజుకు 4 కోట్ల 12 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి విలువ ఏడాదికి దాదాపు రూ. 7 వేల కోట్లకు సమానం] (సమాచార తేదీ : 2021 జూన్ 4)
(ఎ) 1 
(బి) 2 
(సి) 3  
(డి) 4  

10. ఏ సంవత్సరం నాటికి ఆకలి సమస్యను అంతమొందించాలనేది 'ఐక్యరాజ్య సమితి' (UNO) సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒక భాగం ? [2021 జూన్ 7వ తేదీన మూడో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని "నేటి సురక్షిత ఆహారమే రేపటి ఆరోగ్యం" అనే నినాదంతో నిర్వహించారు] 
(ఎ) 2025 
(బి) 2030 
(సి) 2035 
(డి) 2040              

కీ (KEY) (GK TEST-71 YEAR : 2021)
1) డి    2) బి    3) ఎ    4) సి    5) డి    6) సి    7) ఎ    8) డి    9) డి    10) బి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

10, జూన్ 2021, గురువారం

పి-75 (ఇండియా) ∣ PROJECT-75 (INDIA) DETAILS IN TELUGU

జలాంతర్గామి 


హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో .. 2021 జూన్ 4న భారత రక్షణ మంత్రి 'రాజ్ నాథ్ సింగ్' అధ్యక్షతన సమావేశమైన 'రక్షణ కొనుగోళ్ల మండలి' (DAC) "పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] అనే మెగా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

"పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] ద్వారా అధునాతన పరిజ్ఞానంతో 6 సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మిస్తారు. శత్రువులకు ఆచూకీ దొరకని రీతిలో వీటిని 'స్టెల్త్' పరిజ్ఞానంతో (STEALTH TECHNOLOGY) రూపొందిస్తారు. "పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] కింద నిర్మించే ఆరు సబ్మెరైన్లకు (SIX SUBMARINES) అధునాతన 'ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్' (Air-Independent Propulsion) వ్యవస్థ ఉంటుంది. అందువల్ల అవి ఎక్కువసేపు నీటి అడుగున ఉండగలవు.

'వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' (STRATEGIC PARTNERSHIP MODEL) కింద ఈ జలాంతర్గాములను నిర్మిస్తారు. దేశీయ కంపెనీలు .. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని భారత్ లోనే అధునాతన ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయడం ఈ నమూనా ఉద్దేశ్యం. తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. 'వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' కింద చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ ఇదే ("పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)]). 'భారత్ లో తయారీ' (MAKE IN INDIA) కింద చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ సబ్ మెరైన్ల నిర్మాణం కోసం ప్రభుత్వ రంగంలోని 'మఙ్గావ్ డాక్స్ లిమిటెడ్' (MDL), ప్రైవేటు సంస్థ 'ఎల్ అండ్ టీ' (L&T) లకు టెండర్లు జారీ చేసేందుకు 'డీఏసీ' (DAC) ఆమోదం తెలిపింది.

"పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] విలువ రూ. 43 వేల కోట్లు. ఈ జలాంతర్గాముల్లో అమర్చే ఆయుధ వ్యవస్థలను బట్టి అంతిమంగా ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి 12 ఏళ్లు పడుతుంది.

ప్రస్తుతం మనదేశం వద్ద 15 సంప్రదాయ జలాంతర్గాములు, 2 అణు జలాంతర్గాములు ఉన్నాయి.                  

4, జూన్ 2021, శుక్రవారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-70

1. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి 'జస్టిస్ అరుణ్ మిశ్ర' (JUSTICE ARUN MISHRA) జాతీయ మానవహక్కుల సంఘం (NHRC) కొత్త చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ ? [ఆయనతోపాటు ప్యానెల్ సభ్యులుగా జస్టిస్ ఎం.ఎం.కుమార్, రాజీవ్ జైన్ బాధ్యతలు చేపట్టారు. అయిదేళ్లపాటు లేదా 70 ఏళ్ల వయసు వచ్చేవరకు జస్టిస్ అరుణ్ మిశ్ర ఈ పదవిలో కొనసాగుతారు]
JUSTICE ARUN MISHRA
జస్టిస్ అరుణ్ మిశ్ర 

 
(ఎ) 2021 జూన్ 1 
(బి) 2021 జూన్ 2  
(సి) 2021 జూన్ 3  
(డి) 2021 జూన్ 4 

2. 'కరోనా' మహమ్మారిని తరిమికొట్టడంలో విజయం సాధించే గ్రామాలకు పారితోషికాన్ని అందించేందుకు "కరోనా ఫ్రీ విలేజ్" (CORONA FREE VILLAGE) పేరుతో పోటీని నిర్వహిస్తున్న రాష్ట్రం ? [ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. 50 లక్షలు, ద్వితీయ స్థానం పొందిన గ్రామానికి రూ. 25 లక్షలు, తృతీయ స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. 15 లక్షల నగదు అందజేస్తారు. విజేతను నిర్ణయించడానికి 22 అంశాలు ప్రాతిపదికగా ఉంటాయి] 

(ఎ) మహారాష్ట్ర 
(బి) ఆంధ్రప్రదేశ్  
(సి) కేరళ  
(డి) మధ్యప్రదేశ్ 

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రూ. 8 వేల కోట్లతో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాడేరు, పులివెందులలో ఇప్పటికే భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 14 వైద్య కళాశాలల భవనాలకు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన తేదీ ? [విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమహేంద్రవరం, పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోని వైద్య కళాశాలలకు సీఎం ఈ తేదీన శంకుస్థాపన చేశారు] 

(ఎ) 2021 మే 30  
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 1 
(డి) 2021 జూన్ 2 


4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కొవిడ్' రోగులకు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ (FRONTLINE WORKER) మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం ? [కేంద్ర సాయం పరిధిలోకి రానివారికి ఇది అందుతుంది. కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బందీ దీనికి అర్హులే]   

(ఎ) రూ. 5 లక్షలు 
(బి) రూ. 10 లక్షలు 
(సి) రూ. 15 లక్షలు 
(డి) రూ. 20 లక్షలు 

5. గత కొద్ది రోజులుగా ఏ రాష్ట్రంలో "ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్" (AFRICAN SWINE FEVER) తో భారీ సంఖ్యలో పందులు మృత్యువాత పడుతున్నాయి ? [2 నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచార తేదీ : 2021 జూన్ 2] 

(ఎ) మేఘాలయ   
(బి) మణిపూర్  
(సి) మిజోరం   
(డి) త్రిపుర 

6. 'జాతీయ ఆర్ధిక పరిశోధన మండలి' (NCAER) 2021 మే నెలలో విడుదల చేసిన "భూరికార్డులు, సేవల సూచీ-2021" (LAND RECORD AND SERVICES INDEX (N-LRSI) 2021) ప్రకారం ..  మొదటి అయిదు స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వరుసగా ... ? [ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి]

(ఎ) మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు 
(బి) పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా  
(సి) మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు 
(డి) ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర 


7. "భూరికార్డులు ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉన్నాయి ? రికార్డులు పొందే ప్రక్రియ సులభంగా ఉందా ? రికార్డులు పొందడంలో ప్రజలకు ఎలాంటి సహాయం అందుతోంది ?" ఈ అంశాల ఆధారంగా 'జాతీయ ఆర్ధిక పరిశోధన మండలి' (NCAER) 2021 మే నెలలో విడుదల చేసిన 'సౌలభ్య సూచీ' (EASE OF ACCESS INDEX) లో మొదటి అయిదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా ... ? [ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో, తెలంగాణ 15వ స్థానంలో ఉన్నాయి]   

(ఎ) కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, బిహార్  
(బి) బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ 
(సి) ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ 
(డి) ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బిహార్, ఉత్తర్ ప్రదేశ్  

8. మానసిక ఆందోళనను కారణంగా చూపుతూ 'ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2021' (2021 FRENCH OPEN) నుంచి అర్థంతరంగా వైదొలగిన జపాన్ స్టార్ క్రీడాకారిణి ? [2018 యూఎస్ ఓపెన్ నుంచి కుంగుబాటుతో బాధపటుతున్నట్లు ఈ క్రీడాకారిణి తెలిపింది. 23 ఏళ్ల వయసున్న ఈమె ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న టెన్నిస్ క్రీడాకారిణి]

  

(ఎ) ఆష్లే బార్టీ    
(బి) సెరెనా విలియమ్స్  
(సి) నవోమి ఒసాకా 
(డి) బెర్నార్దా పెరా   

9. 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (TET) ఉత్తీర్ణత ధ్రువపత్రం చెల్లుబాటును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి 'రమేష్ పోఖ్రియాల్' ప్రకటించిన తేదీ ? [ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఏడేళ్లపాటు టెట్ ఉత్తీర్ణత ధ్రువపత్రం చెల్లుబాటులో ఉంటుందని 2011 ఫిబ్రవరి 11న 'జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి' (NCTE) జారీ చేసిన ఆదేశాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది]

(ఎ) 2021 జూన్ 1 
(బి) 2021 జూన్ 2 
(సి) 2021 జూన్ 3  
(డి) 2021 జూన్ 4  

10. 2021 జూన్ 3న 'నీతి ఆయోగ్' (NITI AAYOG) ప్రకటించిన "సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక-2020" (SUSTAINABLE DEVELOPMENT GOALS INDEX-2020) లో ఎన్ని మార్కులతో గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్ లతో కలిసి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది ? [75 మార్కులతో 'కేరళ' తొలిస్థానంలోనూ, 74 మార్కులతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయి. 52 మార్కులతో 'బిహార్' చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో 'చండీగఢ్' 79 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది] 

(ఎ) 73 
(బి) 72 
(సి) 71 
(డి) 70              

కీ (KEY) (GK TEST-70 YEAR : 2021)
1) బి    2) ఎ    3) బి    4) ఎ    5) సి    6) ఎ    7) డి    8) సి    9) సి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

3, జూన్ 2021, గురువారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-69

1. అరుదైన మూడు ఖగోళ అద్భుతాలతో కూడిన "సూపర్ బ్లడ్ మూన్" (SUPER BLOOD MOON) నింగిలో చోటు చేసుకున్న తేదీ ? [చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్ .. ఒకే రోజులో వస్తే దాన్ని 'సూపర్ బ్లడ్ మూన్' (SUPER BLOOD MOON) అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియాలో ఇది పూర్తిగా, ఈశాన్య భారతంలో పాక్షికంగా కనిపించింది]
SUPER BLOOD MOON
సూపర్ బ్లడ్ మూన్

 
(ఎ) 2021 మే 25 
(బి) 2021 మే 26  
(సి) 2021 మే 27  
(డి) 2021 మే 28 

2. 'ఏపీఎస్ఆర్టీసీ' (APSRTC) ఎండీ, ప్రజా రవాణా విభాగం కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ? [రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్ గా ఉన్న ఆయనను 2021 మే 31న ప్రభుత్వం బదిలీ చేసింది]
CH DWARAKA TIRUMALARAO

  

(ఎ) ఆర్.పీ.ఠాకూర్ 
(బి) ఎన్. సంజయ్   
(సి) పీ.వీ.సునీల్ కుమార్  
(డి) సీ.హెచ్.ద్వారకా తిరుమలరావు 

3. ప్రపంచంలోనే తొలిసారిగా 'నానో యూరియా' (NANO UREA) ను 'భారత రైతుల ఎరువుల సహకార సంస్థ' (IFFCO) ప్రవేశపెట్టిన తేదీ ? [దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా .. ద్రవ రూపంలో ఉంటుంది. త్వరలోనే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా సీసా .. కనీసం ఒక బస్తా సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని 'ఇఫ్కో' (IFFCO) వెల్లడించింది]  

(ఎ) 2021 మే 30  
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 1 
(డి) 2021 జూన్ 2 



4. దేశవ్యాప్తంగా 'కొవిడ్' బారినపడి కోలుకుంటున్న వారిలో 'యాంటీబాడీల స్థాయి' (ANTIBODIES) పరీక్షించేందుకు దిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థతో కలిసి 'డీ ఆర్ డీ ఓ' (DRDO) రూపొందించిన పరీక్ష కిట్ "డిప్కోవాన్" (DIPCOVAN) ను మార్కెట్ లోకి విడుదల చేసిన తేదీ ? [ఈ కిట్ కేవలం రూ. 75కే అందుబాటులో ఉంటుందని, మనిషి శరీరంలో యాంటీబాడీలు ఏమేరకు ఉన్నాయో కచ్చితమైన ఫలితాన్నిస్తుందని 'డీ ఆర్ డీ ఓ' (DRDO) చైర్మన్ 'డాక్టర్ జి.సతీష్ రెడ్డి' వెల్లడించారు]     

(ఎ) 2021 మే 30  
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 1 
(డి) 2021 జూన్ 2 

5. భారత్ లో మొదట వెలుగు చూసిన కరోనా రకానికి 2021 మే 31న 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) ఖరారు చేసిన పేరు ? [సాంకేతికంగా బి.1.617 గా పిలిచే ఈ వైరస్ రకం .. అధికారికంగా 53 దేశాల్లో కనిపించిందని 'డబ్ల్యుహెచ్ఓ' తెలిపింది] 

(ఎ) ఆల్ఫా   
(బి) బీటా  
(సి) గామా  
(డి) డెల్టా వేరియంట్ 

6. ఏ సంవత్సరం నుంచి చైనాలో ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఉంది ? [ఇకనుంచి ఒక్కో జంట ముగ్గురేసి పిల్లలను కనేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అనుమతినిచ్చింది]

(ఎ) 2015 
(బి) 2016 
(సి) 2017 
(డి) 2018 



7. హైదరాబాద్ లోని కేంద్ర పరిశోధన సంస్థ 'సీసీఎంబీ' (CCMB) నూతన డైరెక్టర్ గా 2021 జూన్ 1న బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ ఇమ్యునాలజిస్ట్ ?   

(ఎ) డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి  
(బి) డాక్టర్ రాకేశ్ మిశ్రా 
(సి) ఆలాపన్ బందోపాధ్యాయ్  
(డి) డాక్టర్ గగన్ దీప్ కాంగ్ 

8. కరోనా సంక్షోభం కారణంగా గత ఆర్ధిక సంవత్సరం (2020-21) లో నమోదైన భారత 'జీడీపీ' (GDP) వృద్ధి రేటు ? [అధిక పన్ను వసూళ్ల కారణంగా ద్రవ్యలోటు 2020-21లో 'జీడీపీ' (GDP) లో 9.3 శాతానికి పరిమితమై రూ. 18,21,461 కోట్లుగా నమోదైంది]    

(ఎ) -5.3%  
(బి) -6.3%  
(సి) -7.3% 
(డి) -8.3%  

9. 2021 జూన్ 1 నుంచి మూడు నెలలపాటు 'కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు' (CBDT) చైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నది ?

(ఎ) జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర 
(బి) పీసీ మోదీ  
(సి) పీసీ పంత్   
(డి) హరికృష్ణ ద్వివేది  



10. 2021-22 సంవత్సరానికి 'భారతీయ పరిశ్రమల సమాఖ్య' (CII) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనది ?  

(ఎ) ఉదయ్ కోటక్ 
(బి) పవన్ ముంజాల్  
(సి) టీవీ నరేంద్రన్  
(డి) సంజీవ్ బజాజ్              

కీ (KEY) (GK TEST-69 YEAR : 2021)
1) బి    2) డి    3) బి    4) సి    5) డి    6) బి    7) ఎ    8) సి    9) ఎ    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com