1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'జగనన్న సంపూర్ణ గృహ హక్కు' పథకంలో భాగంగా 'వన్ టైం సెటిల్మెంట్' (OTS) కింద రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఎవరికి అప్పగించారు ?
(ఎ) పంచాయతీ కార్యదర్శి
(బి) వార్డు/గ్రామ పంచాయతీ కార్యదర్శి
(సి) గ్రామ రెవిన్యూ అధికారి
(డి) డిజిటల్ అసిస్టెంట్
2. భక్తులకు విశేష సేవలందిస్తున్న 'తిరుమల తిరుపతి దేవస్థానం' (తితిదే) నకు 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు దక్కింది. 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' ఏ దేశానికి చెందినది ?
(ఎ) ఇంగ్లాండ్
(బి) అమెరికా
(సి) స్విట్జర్లాండ్
(డి) ఆస్ట్రేలియా
3. 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (సెకి) నుంచి ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ను మూడు విడతల్లో తీసుకోవడానికి అనుమతించాలంటూ డిస్కంలు చేసిన ప్రతిపాదన మేరకు త్రైపాక్షిక విద్యుత్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోవడానికి 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి' (ఏపీఈఆర్సీ) అనుమతించింది ? [ఈ ఒప్పందం కింద సెప్టెంబర్ 2024 నుంచి ప్రతి సంవత్సరం గరిష్ఠంగా 17వేల మిలియన్ యూనిట్ల వంతున 25 సంవత్సరాల వరకు 'సెకి' నుంచి విద్యుత్ తీసుకోవడానికి డిస్కంలకు వీలవుతుంది]
(ఎ) 5000 మెగావాట్లు
(బి) 6000 మెగావాట్లు
(సి) 7000 మెగావాట్లు
(డి) 8000 మెగావాట్లు
4. 'ప్రపంచ మధుమేహ దినోత్సవం' ను ఏ తేదీన జరుపుతారు ?
(ఎ) నవంబర్ 11
(బి) నవంబర్ 12
(సి) నవంబర్ 13
(డి) నవంబర్ 14
5. 'భారతీయ గ్రంథాలయ దినోత్సవం' ను ఏ తేదీన జరుపుతారు ? [భారతీయ గ్రంథాలయాలకు విశేష సేవ చేసిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యులు 'ఎస్.ఆర్.రంగనాథన్' సేవలకు గుర్తింపుగా అతని జయంతిని 'భారతీయ గ్రంథాలయ దినోత్సవం' గా జరుపుతారు. గ్రంథాలయాల్లో పుస్తకాలను క్రమపద్ధతిలో పేర్చడానికి రంగనాథన్ ప్రతిపాదించిన 'ఎనలటికో-సింథటిక్ క్లాసిఫికేషన్' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది]
(ఎ) ఆగస్ట్ 11
(బి) ఆగస్ట్ 12
(సి) ఆగస్ట్ 13
(డి) ఆగస్ట్ 14
6. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే సంప్రదాయం భారత్ లో ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది ?
(ఎ) 1958
(బి) 1968
(సి) 1978
(డి) 1988
7. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' ను అందుకున్న తొలి మహిళా క్రికెటర్ ?
(ఎ) స్మృతి మంథాన
(బి) మిథాలీ రాజ్
(సి) హర్మన్ ప్రీత్ కౌర్
(డి) జులన్ గోస్వామి
8. గడచిన 580 ఏళ్లలో ఎన్నడూ లేనంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఏ తేదీన సంభవించనుంది ? [మొత్తం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు ఇది సాగుతుంది. చివరిసారిగా ఇంత సుదీర్ఘ చంద్రగ్రహణం 1440వ సంవత్సరంలో ఫిబ్రవరి 18న చోటుచేసుకుంది]
(ఎ) 2021 నవంబర్ 16
(బి) 2021 నవంబర్ 17
(సి) 2021 నవంబర్ 18
(డి) 2021 నవంబర్ 19
9. 'మన దేశానికి 1947లో లభించిన స్వాతంత్య్రం ఆంగ్లేయుల భిక్ష మాత్రమే. నిజమైన స్వాతంత్య్రం వచ్చింది 2014లోనే' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి ఎవరు ?
(ఎ) దీపికా పదుకొణె
(బి) అలియాభట్
(సి) కంగనా రనౌత్
(డి) కరీనా కపూర్
10. దివాలా స్మృతిలోని సెక్షన్ 29(ఎ) ప్రకారం వ్యవస్థాపకులు రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించడానికి అనర్హులు. కానీ ఏ కేటగిరీలో వారు రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించవచ్చు ?
(ఎ) ఎంఎస్ఎంఈ
(బి) గనుల తవ్వకం
(సి) రసాయనాలు మరియు పెట్రో రసాయనాలు
(డి) కుటీర పరిశ్రమ
కీ (KEY) (GK TEST-77 YEAR : 2021)
1) బి 2) ఎ 3) సి 4) డి 5) బి 6) బి 7) బి 8) డి 9) సి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com