ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, జనవరి 2021, శనివారం

GK TEST-4 DATE : 2021 JANUARY 30

1. ఒకే పర్యటనలో అన్ని ఫార్మాట్లలోనూ ("T20, ONE DAY, TEST" Cricket Matches) అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించినది ? 
(ఎ) వాషింగ్టన్ సుందర్ 
(బి) శుభ్ మన్ గిల్   
(సి) మహమ్మద్ సిరాజ్  
(డి) తంగరసు నటరాజన్ 

2. "ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఓటరు చైతన్యవంతం కావాలి" అని తెలియజేసిన రాజనీతి శాస్త్ర పితామహుడు ? 
(ఎ) సోక్రటీస్ 
(బి) అరిస్టాటిల్  
(సి) కౌటిల్యుడు  
(డి) ఎపిక్యురస్ 

3. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించే 'ప్రధానమంత్రి బాల పురస్కార్' కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చిన్నారులు ఎంపికయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి "అమేయ లగుడు" (విశాఖపట్నం) ఏ విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు ? [మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 32 మంది విద్యార్థులను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. వీరిలో తెలంగాణ నుంచి 'హేమేష్ చదలవాడ' కూడా ఉన్నారు] 
(ఎ) కళలు, సంస్కృతి  
(బి) సామాజిక సేవ 
(సి) నవకల్పన 
(డి) స్కాలస్టిక్ అచీవ్మెంట్  



4. పర్యవేక్షణ సౌలభ్యం కోసం 'ఏపీ ఫైబర్ నెట్' (AP FiberNet) ను ఏ శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? 
(ఎ) పర్యటక శాఖ 
(బి) ఆర్ధిక శాఖ 
(సి) విద్యుత్ శాఖ 
(డి) హోం శాఖ 

5. హైదరాబాద్ (తెలంగాణ రాష్ట్రం) లోని 'రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల' (DRDL) లో కొత్తగా ఏర్పాటు చేసిన "వెపన్స్ సిస్టమ్ డిజైన్ సెంటర్" (Weapon System Design Centre) ను భారత ఉప రాష్ట్రపతి 'ఎం.వెంకయ్య నాయుడు' ప్రారంభించిన తేదీ ? 
(ఎ) 2021 జనవరి 24   
(బి) 2021 జనవరి 25  
(సి) 2021 జనవరి 26  
(డి) 2021 జనవరి 27 

6. 'జమ్మూ - కాశ్మిర్' లో 370, 35-ఏ అధికరణలు రద్దైన తేదీ ?
(ఎ) 2019 ఆగస్ట్ 5 
(బి) 2019 ఆగస్ట్ 6 
(సి) 2019 ఆగస్ట్ 7 
(డి) 2019 ఆగస్ట్ 8 



7. ప్రపంచ ఆర్ధిక వేదిక 2019లో వెలువరించిన 'ప్రయాణ, పర్యాటక పోటీ నివేదిక' లో భారత్ స్థానం ? [ప్రపంచ ఆర్ధిక వేదిక 2019 నివేదిక ప్రకారం భారతదేశ జీడీపీ (GDP) లో ప్రయాణ, పర్యాటక రంగం వాటా 4.9 శాతంగా ఉంది] 
(ఎ) 32 
(బి) 33 
(సి) 34 
(డి) 35 

8. అమెరికా అధ్యక్షుల పదవీ స్వీకార సందర్భాల్లో పాల్గొన్న కవులందరికన్నా అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్రలో నిలిచిన "అమందా గోర్మాన్" (AMANDA GORMAN) వయసు ? [2021 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా 'జో బైడెన్' ప్రమాణం చేసిన సందర్భంలో అయిదు నిముషాలపాటు 'అమందా గోర్మాన్' చెప్పిన "ది హిల్ ఉయ్ క్లైమ్బ్" (THE HILL WE CLIMB) కవితలో అమెరికాలో వరుసగా జరిగిన రాజకీయ పరిణామాలను, ప్రస్తుత పరిస్థితులతోపాటు భవిష్యత్తులో ఏదిశగా అడుగులేస్తే ప్రజలంతా సుభిక్షంగా జీవిస్తారో తెలియజేసింది]   
(ఎ) 21 సంవత్సరాలు  
(బి) 22 సంవత్సరాలు  
(సి) 23 సంవత్సరాలు 
(డి) 24 సంవత్సరాలు  

9. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా, పదవిని స్వచ్చందంగా వీడేందుకు ఒప్పుకోని పరిస్థితుల్లో 'ఉపాధ్యక్షుడు, మెజారిటీ కేబినెట్' నిర్ణయించడం ద్వారా అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తప్పించేందుకు అమెరికా రాజ్యాంగంలో 25వ సవరణ తీసుకొచ్చిన సంవత్సరం ?
(ఎ) 1961 
(బి) 1962 
(సి) 1963  
(డి) 1964  



10. 100 మంది సభ్యులున్న అమెరికా 'సెనేట్' (SENATE) లో రిపబ్లికన్లకు, డెమొక్రాట్లకు ప్రస్తుతం ఉన్న సీట్లు ? 
(ఎ) 52, 48 
(బి) 51, 49 
(సి) 50, 50 
(డి) 49, 51              

కీ (KEY) (GK TEST-4 DATE : 2021 JANUARY 30)
1) డి    2) బి    3) ఎ    4) సి    5) బి    6) ఎ    7) సి    8) బి    9) సి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

25, జనవరి 2021, సోమవారం

GK TEST-3 DATE : 2021 JANUARY 25

1. గువాహటి హైకోర్టు నుంచి వెలువడే 'ద్వైవార్షిక వార్తా బులెటిన్' (Biannual News Bulletin) ?   
(ఎ) బంధన్ 
(బి) నౌ కాస్ట్  
(సి) ఆత్మన్  
(డి) నిమిట్జ్ 

2. భారతదేశ నూతన పార్లమెంటు భవన సముదాయ నిర్మాణానికి సంబంధించిన 'సెంట్రల్ విస్టా' (CENTRAL VISTA) ప్రాజెక్ట్ లో భాగమైన 'రాజ్ పథ్' (RAJPATH) పునర్నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను దక్కించుకున్న సంస్థ ? 
(ఎ) షాపూర్జీ పల్లోంజీ 
(బి) ఐటీడీ సెమెంటేషన్ ఇండియా లిమిటెడ్  
(సి) టాటా ప్రాజెక్ట్స్  
(డి) ఎన్ సీ సీ లిమిటెడ్ 

3. పౌర సేవల్లోని "ఒకే దేశం - ఒకే కార్డు, సులభతర వాణిజ్యం, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్ సంస్కరణలు" లో మొదటి మూడింటిని పూర్తి చేసినందుకుగాను ఏయే రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక శాఖ రూ. 1,004 కోట్ల రివార్డ్ (అదనపు సహాయం) ను ప్రకటించింది ? [ఇందులో ఆంధ్రప్రదేశ్ కు రూ. 344 కోట్లు విడుదలయ్యాయి] 
(ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  
(బి) కేరళ, ఆంధ్రప్రదేశ్ 
(సి) మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 
(డి) గుజరాత్, ఆంధ్రప్రదేశ్ 



4. నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన 'జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి' (జస్టిస్ జేకే మహేశ్వరి) ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు ?   
(ఎ) సిక్కిం 
(బి) అసోం 
(సి) దిల్లీ 
(డి) తెలంగాణ 

5. 'ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి' (APPCB) చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ? 
(ఎ) నీలం సాహ్ని   
(బి) ఏకే పరీడా  
(సి) ఎల్.వి.సుబ్రహ్మణ్యం  
(డి) జయప్రకాష్ నారాయణ్ 

6. ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏర్పాటు చేసిన 'ప్రత్యేక దర్యాప్తు బృందం' (SIT) నకు నేతృత్వం వహిస్తున్న 'ఏసీబీ' (ACB) అదనపు డైరెక్టర్ ? [15 మంది సభ్యులు గల ఈ బృందం 2020 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన విగ్రహాల ధ్వంసం, దేవాలయాల్లో దుశ్చర్యల ఘటనలపై దర్యాప్తు చేస్తుంది]
(ఎ) డాక్టర్ విజయ్ కుమార్ 
(బి) రవీంద్రనాథ్ బాబు 
(సి) రాహుల్ శర్మ 
(డి) జీవీజీ అశోక్ కుమార్ 



7. ఏయే దేశాల మధ్య ఈ ఏడాదితో 'దౌత్య సంబంధాలకు 70 వసంతాలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి 20 ఏళ్లు ' పూర్తవుతాయి ? 
(ఎ) భారత్ - అమెరికా 
(బి) భారత్ - ఫ్రాన్స్ 
(సి) భారత్ - బ్రిటన్ 
(డి) భారత్ - జర్మనీ 

8. కొవిడ్-19 టీకాకు సంబంధించి రెండు డోసులను పొందాల్సి ఉంటుంది. ఈ రెండు డోసుల మధ్య ఉండే విరామం ? [రెండో డోసు పొందిన 14 రోజుల తర్వాతే వ్యాక్సిన్ రక్షణ మొదలవుతుంది]  
(ఎ) 7 రోజులు  
(బి) 14 రోజులు  
(సి) 21 రోజులు 
(డి) 28 రోజులు  

9. వ్యవసాయ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాలపై రైతుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఉభయులతో సంప్రదింపులు జరిపేందుకు సుప్రీంకోర్టు 2021 జనవరి 12న నియమించిన నలుగురు సభ్యుల కమిటీలో గతంలో 'వ్యవసాయ ధరల కమిషన్' చైర్మన్ గా పనిచేసిన 'భారత ఆర్ధిక పరిశోధన సంస్థ' (ICRIER) ఆచార్యుడు ? [అనేక ఆహార ధాన్యాల మద్దతు ధర పెంచటానికి ఈయనే మూలకారకుడని చెబుతారు]
(ఎ) అనిల్ ఘన్వాట్  
(బి) అశోక్ గులాటి 
(సి) భూపీందర్ సింగ్ మాన్  
(డి) ప్రమోద్ కుమార్ జోషి  



10. "శేత్కరీ సంగఠన్" అనే పేరుతో రైతులకు సంబంధించిన సంఘం ఏ రాష్ట్రంలో ఉంది ?  
(ఎ) ఉత్తరాఖండ్ 
(బి) మహారాష్ట్ర 
(సి) పంజాబ్ 
(డి) హరియాణా              

కీ (KEY) (GK TEST-3 DATE : 2021 JANUARY 25)
1) సి    2) ఎ    3) సి    4) ఎ    5) బి    6) డి    7) డి    8) డి    9) బి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

15, జనవరి 2021, శుక్రవారం

GK TEST-2 DATE : 2021 JANUARY 15

1. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన "సెంట్రల్ విస్టా" (CENTRAL VISTA) ప్రాజెక్ట్ కు అంగీకారం తెలియజేస్తూ 2021 జనవరి 5న సుప్రీంకోర్టు 2-1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ కేసులో అసమ్మతి తీర్పునిచ్చిన న్యాయమూర్తి ? [నిబంధనలను పూర్తిగా పాటించకపోవడం, ప్రజాభిప్రాయాన్ని సేకరించకపోవడాన్ని తప్పుపడుతూ.. ఈ న్యాయమూర్తి 179 పేజీల అసమ్మతి తీర్పునిచ్చారు]
(ఎ) జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్
(బి) జస్టిస్ దినేశ్ మహేశ్వరి 
(సి) జస్టిస్ సంజీవ్ ఖన్నా 
(డి) జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి

2. 'జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం' (NDRF) లోకి తొలిసారిగా ప్రవేశించిన మహిళల మొదటి బృందం (100 మందికి పైగా ఉన్నారు) విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని అత్యవసర విధుల నిర్వహణ కోసం మోహరింపబడిన 'గఢ్ ముక్తేశ్వర్' పట్టణం గల రాష్ట్రం ?
(ఎ) ఉత్తరాఖండ్
(బి) హిమాచల్ ప్రదేశ్ 
(సి) ఉత్తర్ ప్రదేశ్ 
(డి) బీహార్

3. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 'ప్రధాన న్యాయమూర్తి' (CJ) గా "జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి" (జస్టిస్ ఏకే గోస్వామి) 2021 జనవరి 6న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేశారు. 'జస్టిస్ ఏకే గోస్వామి' నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి ? [ సీజే' (CJ) రాకతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది]
(ఎ) 1 
(బి) 2
(సి) 3
(డి) 4



4. పశ్చిమ గోదావరి జిల్లా 'ఏలూరు' (ELURU) లో 2020 డిసెంబర్ 4 నుంచి 2020 డిసెంబర్ 12వ తేదీ మధ్య 622 మంది బాధితులు అంతుచిక్కని వ్యాధి (మూర్ఛతో కింద పడిపోవడం, నోటివెంట నురగ, స్పృహ కోల్పోవడం, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలు) తో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. "నీరు, పాలు, కూరగాయలు, పండ్లు" వాడకం ద్వారా బాధితుల శరీరంలోకి 'ఆర్గానోక్లోరైడ్' (ORGANOCHLORIDE) వెళ్లి ఉండొచ్చని ఉన్నతస్థాయి కమిటీ బలంగా అభిప్రాయపడింది. వీటిలోనూ ఏది ప్రధాన కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు ?
(ఎ) నీరు
(బి) పాలు
(సి) కూరగాయలు
(డి) పండ్లు

5. 'బర్డ్ ఫ్లూ' (BIRD FLU (OR) AVIAN INFLUENZA) వైరస్ భారత్ లో తొలిసారిగా 2006 మార్చిలో "నవపూర్" అనే గ్రామంలో వెలుగు చూసింది. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ? [భారత్ లోకి ఈ వైరస్ ప్రవేశించిన తరవాత ఇప్పటివరకు 72 లక్షలకు పైగా కోళ్లను వధించారు]
(ఎ) మధ్యప్రదేశ్  
(బి) మహారాష్ట్ర 
(సి) ఉత్తర్ ప్రదేశ్ 
(డి) రాజస్థాన్

6. పార్లమెంటు సభ్యుల సంఖ్య స్థిరీకరణ 2026వ సంవత్సరంతో ముగియనున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఎంతమంది సభ్యుల్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా 'లోక్ సభ, రాజ్య సభ'నిర్మాణాలను (CENTRAL VISTA) తీర్చిదిద్దుతోంది ?
(ఎ) 886 (లోక్ సభ), 382 (రాజ్య సభ)
(బి) 887 (లోక్ సభ), 383 (రాజ్య సభ)
(సి) 888 (లోక్ సభ), 384 (రాజ్య సభ)
(డి) 889 (లోక్ సభ), 385 (రాజ్య సభ)



7. భారత దేశానికి చెందిన అయిదో తరం యుద్ధ విమానం ? [ప్రస్తుతానికి 'రూపకల్పన, అభివృద్ధి' దశలో ఉంది]
(ఎ) తేజస్
(బి) డార్నియర్ 
(సి) బేసిస్ జెట్
(డి) అమ్కా

8. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'భారత్ లో తయారీ' (MAKE IN INDIA) పథకం కింద నిర్మిస్తున్న అయిదు 'ఓపీవీ' (OPV) (సముద్ర గస్తీ నౌక) లలో "సార్థక్" (SARTHAK) ఎన్నోది ? [ఈ సముద్ర గస్తీ నౌక (సార్థక్) ను 'గోవా షిప్ యార్డ్' లో నిర్మించారు]  
(ఎ) 1 
(బి) 2 
(సి) 3
(డి) 4 

9. ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా 299వ టెస్ట్ ఆటగాడిగా బరిలోకి దిగిన పేస్ బౌలర్ ?
(ఎ) నటరాజన్
(బి) నవ్ దీప్ సైని
(సి) శార్దూల్ ఠాకూర్ 
(డి) మహమ్మద్ సిరాజ్ 



10. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారి 'ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్' (ICC Test Rankings) లో నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. గత పదేళ్లలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఎన్నో జట్టుగా 'న్యూజీలాండ్' నిలిచింది ? [ఆస్ట్రేలియా కన్నా రెండు ఎక్కువ పాయింట్ల (118) తో 'కివీస్' (న్యూజీలాండ్) తొలి స్థానంలో ఉండగా .. భారత్ 114 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది]  
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8             

కీ (KEY) (GK TEST-2 DATE : 2021 JANUARY 15)
1) సి   2) సి   3) బి   4) సి   5) బి   6) సి   7) డి   8) డి   9) బి   10) బి 

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com

1, జనవరి 2021, శుక్రవారం

GK TEST-1 DATE : 2021 JANUARY 1

1. ఝార్ఖండ్ కు చెందిన 'కొర్వా' గిరిజన తెగ ప్రజలు మాట్లాడే భాషకు నిఘంటువు తయారు చేసిన వ్యక్తి ? (ఈ నిఘంటువు తయారీకి 12 ఏళ్లు పట్టింది) 
(ఎ) ఎన్ కే హేమలత  
(బి) హీరామాన్  
(సి) టి.శ్రీనివాసాచార్య స్వామీజీ  
(డి) ప్రదీప్ సంగ్వాన్ 

2. డ్రైవింగ్ లైసైన్సు, ఆర్ సీ, ఇతర పర్మిట్లకు సంబంధించిన వాహన దస్తావేజుల గడువును కేంద్ర ప్రభుత్వం ఏ తేదీ వరకు పొడిగించింది ? (ఫిబ్రవరి 1 నుంచి కాలం చెల్లిన అన్ని పత్రాలకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది) 
(ఎ) 2020 డిసెంబర్ 31 
(బి) 2021 జనవరి 31  
(సి) 2021 మార్చి 31  
(డి) 2021 ఏప్రిల్ 30 

3. ఇటలీలో తొలి కరోనా కేసు బయటపడిన ప్రాంతం ? (2020 జనవరిలో చైనా నుంచి వచ్చిన దంపతులకు ఇక్కడే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అనంతరం ఐరోపాలో కరోనా వ్యాప్తికి ఈ ప్రాంతమే కేంద్రబిందువైంది. అందువల్ల కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా 2020 డిసెంబర్ 27న ఈ ప్రాంతంనుంచే ప్రారంభించారు) 
(ఎ) స్పాలాంజని   
(బి) పోర్టోఫినో 
(సి) మతేర  
(డి) పియెట్రాసాంటా   



4. 2020 డిసెంబర్ 17న 'భారత అంతరిక్ష పరిశోధన సంస్థ' (ISRO) విజయవంతంగా ప్రయోగించిన 'పీ ఎస్ ఎల్ వీ - సీ 50' (PSLV - C50) వాహకనౌక ద్వారా 'జియో స్టేషనరీ ఆర్బిట్' లో ప్రవేశపెట్టబడిన కమ్యూనికేషన్ ఉపగ్రహం ?
(ఎ) జీశాట్ - 12 
(బి) ఆనంద్ 
(సి) యూనివ్ శాట్ 
(డి) సీఎంఎస్ - 01 

5. 2020 డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "బీసీ సంక్రాతి" పేరుతో 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిన ప్రాంతం ? 
(ఎ) తిరుపతి   
(బి) విజయవాడ  
(సి) ఏలూరు  
(డి) విశాఖపట్నం 

6. 'మిషన్ బిల్డ్ ఏపీ' (Mission Build AP) పథకం ద్వారా విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లోని 9 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల ఈ-వేలం యత్నంపై దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ న్యాయమూర్తిపై పిటిషన్ దాఖలు చేసింది ?
(ఎ) జస్టిస్ జె.కె.మహేశ్వరి 
(బి) జస్టిస్ బట్టు దేవానంద్ 
(సి) జస్టిస్ రాకేశ్ కుమార్ 
(డి) జస్టిస్ ప్రవీణ్ కుమార్ 



7. భారత క్రీడామంత్రిత్వ శాఖ 'యోగాసనం' (YOGASANAM) ను పోటీ పడగల క్రీడగా లాంఛనంగా గుర్తించిన తేదీ ? (దీనివల్ల 'యోగాసనం' అధికారికంగా క్రీడ అవుతుంది. ప్రభుత్వ నిధులు కూడా అందుతాయి) 
(ఎ) 2020 డిసెంబర్ 15 
(బి) 2020 డిసెంబర్ 16 
(సి) 2020 డిసెంబర్ 17 
(డి) 2020 డిసెంబర్ 18 

8. వచ్చే రెండు ఒలింపిక్స్, వచ్చే రెండేళ్లలో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో తన పేరు, జెండాను వాడకుండా ఆర్బిట్రేషన్ కోర్టుచే నిషేధం విధించబడిన దేశం ? (పతకాల కోసం ఆ దేశ ప్రభుత్వం తమ ఆటగాళ్లను డోపింగ్ కు ప్రోత్సహించిందన్న అభియోగాలు రుజువు కావడంతో ఈ శిక్షను విధించడం జరిగింది. కానీ ఆ దేశ అథ్లెట్లు ఒలింపిక్స్ తో పాటు రెండేళ్లలో జరిగే అన్ని ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో పోటీపడొచ్చు)  
(ఎ) అమెరికా  
(బి) రష్యా  
(సి) చైనా 
(డి) ఇజ్రాయెల్  

9. డేనైట్ క్రికెట్ మ్యాచ్ లలో ఉపయోగించే బంతి ?
(ఎ) తెల్ల బంతి 
(బి) ఎర్ర బంతి 
(సి) గులాబి బంతి  
(డి) ఆకుపచ్చ బంతి  



10. రోజుకు 10 కోట్ల లీటర్ల తాగునీరు ఉత్పత్తి లక్ష్యంతో, సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే "నిర్లవణీకరణ కేంద్రం" ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' గుజరాత్ లో వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన తేదీ ? (గుజరాత్ లోని 'కచ్' జిల్లా "మండవీ" లో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం ద్వారా 8 లక్షల మంది అవసరాలను తీర్చడానికి వీలవుతుంది) 
(ఎ) 2020 డిసెంబర్ 15 
(బి) 2020 డిసెంబర్ 16 
(సి) 2020 డిసెంబర్ 17 
(డి) 2020 డిసెంబర్ 18              

కీ (KEY) (GK TEST-1 DATE : 2021 JANUARY 1)
1) బి   2) సి   3) ఎ   4) డి   5) బి   6) సి   7) సి   8) బి   9) ఎ   10) ఎ  

E & OE (Errors & Omissions Expected)

All the best by www.gkbitsintelugu.blogspot.com