1. 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి అమెరికా టెక్ దిగ్గజ సంస్థ ?
(ఎ) గూగుల్
(బి) ఆపిల్
(సి) మైక్రోసాఫ్ట్
(డి) ఐబీఎం
2. రెండేళ్ల వరకూ నిల్వ ఉండే "ఫావిపిరవిర్" (FAVIPIRAVIR) ఔషధాన్ని 'అవిగన్' (AVIGAN) బ్రాండ్ పేరుతో మన దేశ మార్కెట్లోకి విడుదల చేసిన ప్రముఖ ఔషధ సంస్థ ? (ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి 'కొవిడ్-19' బాధితులకు ఈ ఔషధాన్ని (FAVIPIRAVIR) వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇతర కంపెనీల 'ఫావిపిరవిర్' ఔషధం గడువు మూడు నెలలు మాత్రమే)
(ఎ) డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్
(బి) సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
(సి) అరబిందో ఫార్మా లిమిటెడ్
(డి) లుపిన్ లిమిటెడ్
3. 2019-20 ఆర్ధిక సంవత్సరం ఆడిట్ ఖాతాలను ఖరారు చేయటం కోసం పదే పదే కోరినప్పటికీ తగిన సమాచారాన్ని అందించటం లేదని ఆరోపిస్తూ, చట్టబద్ధ ఆడిటర్ (STATUTORY AUDITOR) బాధ్యతల నుంచి ఇటీవల 'పీ డబ్ల్యూ సీ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఎల్ ఎల్ సీ' (PWC CHARTERED ACCOUNTANTS LLC) తప్పుకుంది. 'పీ డబ్ల్యూ సీ' (PWC ⇒ PRICEWATERHOUSECOOPERS) ఏ గ్రూపు సంస్థలపై ఈ ఆరోపణలు చేసింది ? (ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ' ఆధ్వర్యంలో పనిచేసే 'ఎన్ ఎఫ్ ఆర్ ఏ' (NFRA ⇒ National Financial Reporting Authority) దృష్టి సారించింది)
(ఎ) హిందూజా గ్రూప్
(బి) సహారా గ్రూప్
(సి) డీ ఎల్ ఎఫ్ గ్రూప్
(డి) జీవీకే గ్రూప్
4. సర్వేయర్ జనరల్ అఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం 'సర్వే ఆఫ్ ఇండియా' (SURVEY OF INDIA) రూపొందించిన భారత పొలిటికల్ మ్యాప్ (INDIA POLITICAL MAP) లో తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ?
(ఎ) అమరావతి
(బి) విశాఖపట్నం
(సి) కర్నూలు
(డి) అమరావతి, విశాఖపట్నం, కర్నూలు
5. 'కరోనా' వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఆయుర్వేద మూలికలతో ఔషధ గుణాలను పొదువుతూ, వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందించే చేనేత చీరలు తయారవుతున్న రాష్ట్రం ? (సుగంధ మూలికలను (యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, వాము, బిర్యాని ఆకు, వివిధ రకాల పుష్పాలు) 48 గంటల పాటు నీటిలో నానబెట్టి తయారు చేసిన రసాన్ని ఆవిరిగా మార్చి ప్రతి చీరకూ దశలవారీగా పట్టిస్తారు)
(ఎ) హిమాచల్ ప్రదేశ్
(బి) ఉత్తరప్రదేశ్
(సి) ఆంధ్రప్రదేశ్
(డి) మధ్యప్రదేశ్
6. లబ్ధిదారులు తినగలిగే, నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దకే సరఫరా చేసే కార్యక్రమాన్ని 'శ్రీకాకుళం' జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఏ తేదీ నుంచి అమలు చేయనున్నారు ? (మట్టి, రాళ్లు లేకుండా, నూకలు 15 శాతానికి మించని సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ఇస్తారు)
(ఎ) 2020 అక్టోబర్ 1
(బి) 2020 నవంబర్ 1
(సి) 2020 డిసెంబర్ 1
(డి) 2021 జనవరి 1
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 'పంచాయతీరాజ్ శాఖ' లో ఎంపీడీఓ (MPDO ⇒ MANDAL PARISHAD DEVELOPMENT OFFICER) లుగా నియమితులైన వారికి పదోన్నతులకు వీలు కల్పించేందుకు కొత్తగా సృష్టిస్తున్న "డివిజినల్ డెవలప్ మెంట్ ఆఫీసర్" (DIVISIONAL DEVELOPMENT OFFICER) పోస్టులెన్ని ?
(ఎ) 51
(బి) 61
(సి) 71
(డి) 81
8. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం కాలపరిమితి ?
(ఎ) 2020-2021
(బి) 2020-2022
(సి) 2020-2023
(డి) 2020-2024
9. ఏ తేదీ నాటికి డ్వాక్రా (DWCRA) సంఘాల మహిళలు బ్యాంకులకు బకాయిపడ్డ రుణాల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఖాతాల్లో 4 విడతలుగా జమచేయనుంది ? (దీని ద్వారా 9,33,180 సంఘాలకు చెందిన సుమారు 90 లక్షల మంది సభ్యులకు రూ. 27,169 కోట్ల లబ్ది చేకూరుతుంది)
(ఎ) 2019 ఏప్రిల్ 10
(బి) 2019 ఏప్రిల్ 11
(సి) 2019 ఏప్రిల్ 12
(డి) 2019 ఏప్రిల్ 13
10. కడప జిల్లాలో 'ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్' (ELECTRONICS MANUFACTURING CLUSTER) ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
(ఎ) బుగ్గలాపల్లి
(బి) చింతకొమ్మదిన్నె
(సి) ఇప్పపెంట
(డి) కొప్పర్తి