Welcome To GK BITS IN TELUGU Blog
ఆస్కార్ అవార్డు విజేతలు - 2021వ సంవత్సరం (93వ అకాడమీ అవార్డులు)[OSCAR WINNERS 2021 (93RD ACADEMY AWARDS)]
వ. సం. | విభాగం | విజేత |
---|---|---|
1 | ఉత్తమ నటుడు | ఆంథోని హాప్కిన్స్ (ది ఫాదర్) |
2 | ఉత్తమ సహాయ నటుడు | డేనియల్ కలువోయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ) |
3 | ఉత్తమ నటి | ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ (నోమాడ్ ల్యాండ్) |
4 | ఉత్తమ సహాయ నటి | యు జంగ్ యున్ (మినారి) |
5 | ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రం | సోల్ |
6 | ఉత్తమ సినిమాటోగ్రఫీ | ఎరిక్ (మాంక్) |
7 | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | అన్ రోత్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్) |
8 | ఉత్తమ దర్శకత్వం | క్లోయూ జావ్ |
9 | ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) | మై ఆక్టోపస్ టీచర్ |
10 | ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్) | కొలెట్టే |
11 | ఉత్తమ ఎడిటింగ్ | మిక్కెల్ ఇ జి.నీల్సన్ (సౌండ్ ఆఫ్ మెటల్) |
12 | అంతర్జాతీయ ఉత్తమ చిత్రం | అనదర్ రౌండ్ (డెన్మార్క్) |
13 | ఉత్తమ మేకప్ హెయిర్ స్టైలింగ్ | సెర్గియో లోపేజ్ రివేరా, మియా నీల్, జమికా విల్సన్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్) |
14 | ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్) | ట్రెంట్ రెజ్ నోర్, అట్టికస్ రోస్, జాన్ బటిస్టే (సోల్) |
15 | ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్) | ఫైట్ ఫర్ యు (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ) |
16 | ఉత్తమ చిత్రం | నోమాడ్ ల్యాండ్ |
17 | ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | డోనాల్డ్ గ్రాహం బర్ట్, జాన్ పాస్కల్ (మాంక్) |
18 | ఉత్తమ లఘు చిత్రం (యానిమేటెడ్) | ఇఫ్ ఎనీథింగ్ హాపెన్స్ ఐ లవ్యూ |
19 | ఉత్తమ లఘు చిత్రం (లైవ్ యాక్షన్) | టు డిస్టెంట్ స్ట్రేంజర్స్ |
20 | ఉత్తమ సౌండ్ | సౌండ్ ఆఫ్ మెటల్ |
21 | ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ | టెనెట్ |
22 | ఉత్తమ రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) | క్రిస్టోఫర్ హాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్ (ది ఫాదర్) |
23 | ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్ ప్లే) | ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ వుమన్) |
ఇతర విశేషాలు
ఉత్తమ దర్శకురాలు (BEST DIRECTOR) :
- 'ఉత్తమ దర్శకత్వం' విభాగంలో "క్లోయూ జావ్" (CHLOE ZHAO) అనే మహిళ ఎంపికైంది. ఆస్కార్ చరిత్రలో ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా మరియు ఆసియా నుంచి తొలిసారిగా ఈ అవార్డుని అందుకున్న మొదటి మహిళగా 'క్లోయూ జావ్' రికార్డు సృష్టించింది. 'క్లోయూ జావ్' తన మూడో సినిమా (NOMADLAND) కే ఈ ఘనతను సాధించింది.
ఉత్తమ నటి (BEST ACTRESS) :
- 'నోమాడ్ ల్యాండ్' (NOMADLAND) చిత్రంలో నటించిన "ప్రాన్సెస్ మెక్ డోర్మండ్" (FRANCES MCDORMAND) ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇప్పటికే 1997లో 'ఫర్గో' లో నటనకు, 2018లో 'త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి' లో నటనకు 'ఉత్తమ నటి' గా అవార్డులు అందుకున్నారు.
- ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో అమెరికా ఎదుర్కొన్న అతి పెద్ద నిరుద్యోగ విపత్తు .. దాని వల్ల జరిగిన పరిణామాల నేపథ్యంలో సంచార జీవితంపై 'నోమాడ్ ల్యాండ్' (NOMADLAND) తెరకెక్కింది. ఇలా 'ఫెర్న్' అనే మహిళ పాత్రలో సంచార జీవిగా చేసిన నటనకు 'ప్రాన్సెస్ మెక్ డోర్మండ్' ను ఆస్కార్ అవార్డు వరించింది.
ఉత్తమ నటుడు (BEST ACTOR) :
- 'ది ఫాదర్' (THE FATHER) చిత్రంలోని నటనకు "ఆంథోని హాప్కిన్స్" (ANTHONY HOPKINS) ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్నారు. ఈ చిత్రంలో మతిమరుపున్న వృద్ధుడిగా .. ఆయన నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఆయన వయసు 83 ఏళ్లు. దీంతో ఎక్కువ వయసులో ఈ అవార్డును గెలుచుకున్న నటుడిగా రికార్డు సృష్టించారు. ఈయన కన్నా ముందు 2012లో 82 ఏళ్ల వయసులో 'బిగినర్స్' చిత్రంలో నటించిన 'క్రిస్టోఫర్ ప్లమ్మర్' పేరిట ఈ రికార్డు ఉండేది. 'ఆంథోని హాప్కిన్స్' ఇంతకుముందు 1992లో 'సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్' చిత్రానికిగానూ అవార్డు గెలుచుకున్నారు.
ఉత్తమ సహాయ నటి (BEST SUPPORTING ACTRESS) :
- 'మినారి' (MINARI) లో అమ్మమ్మగా ప్రేక్షకుల హృదయాలను తడి చేసిన నటి "యు జంగ్ యున్" (YOUN YUH-JUNG) కు 'ఉత్తమ సహాయ నటి' విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ ఘనత సాధించిన రెండో ఆసియన్ నటిగా 'యు జంగ్ యున్' చరిత్ర సృష్టించింది. ఈమె కన్నా ముందు 'మియోషి ఉమెకి' అనే జపనీస్ నటి 'సయోనర' (1957) చిత్రానికి గానూ ఇదే విభాగానికి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఎక్కువ వయసులో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకున్న వారిలో 'యు జంగ్ యున్' మూడో స్థానంలో నిలిచారు. 73 ఏళ్లకు ఈమెను పురస్కారం వరించగా .. 'పెగ్గీ యాష్ క్రాఫ్ట్ (77), జోసెఫైన్ హల్ (74)' ఈమె కంటే ముందున్నారు.
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (BEST COSTUME DESIGNER) :
- 'మా రైనీస్ బ్లాక్ బాటమ్' (MA RAINEY'S BLACK BOTTOM) చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన "అన్ రోత్" (ANN ROTH) ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. 89 ఏళ్ల వయసులో ఆస్కార్ ను చేజిక్కించుకొని అత్యధిక వయస్సులో ఈ అవార్డును సొంతం చేసుకున్న మహిళగా చరిత్రకెక్కారు. ఈవిడే ఇంతకుముందు 'ది ఇంగ్లీష్ పేషెంట్' సినిమాకూ ఆస్కార్ అందుకున్నారు.
ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్ ప్లే) (BEST ORIGINAL SCREEN PLAY) :
- దాదాపు 13 ఏళ్ల తర్వాత 'ఒరిజినల్ స్క్రీన్ ప్లే' విభాగంలో మహిళకు ఆస్కార్ దక్కింది. 2007లో వచ్చిన 'జునో' చిత్రానికి గానూ 'డియాబ్లో క్లోడి' చివరిసారిగా అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. 'ప్రామిసింగ్ యంగ్ వుమన్' (PROMISING YOUNG WOMAN) చిత్రానికి గానూ "ఎమరాల్డ్ ఫెన్నెల్" (EMERALD FENNELL) అనే మహిళకు 'ఒరిజినల్ స్క్రీన్ ప్లే' విభాగంలో ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు లభించింది. 'ఎమరాల్డ్ ఫెన్నెల్' ఈ చిత్రానికి దర్శకురాలిగా కూడా వ్యవహరించారు.
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రం (BEST ANIMATED FEATURE FILM) :
- "సోల్" (SOUL) ఈ సంవత్సరం ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. 'పీట్ డాక్టర్' ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతో ఆయన దర్శకత్వం వహించిన మూడు సినిమాలు (సోల్, ఇన్ సైడ్ అవుట్, అప్) 'బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం' కేటగిరీలో ఆస్కార్ గెలుచుకున్నట్లైంది. జాజ్ సంగీతకారుడు కావాలనుకునే 'జో' అనే స్కూల్ టీచర్ జీవితం చుట్టూ తిరిగే ఈ చిత్రం సినీ అభిమానుల గుండెల్లో ప్రత్యేక ముద్ర వేసింది.
- 2002లో 'యానిమేటెడ్ పిక్చర్' ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు "ఫిక్సర్" నిర్మాణ సంస్థ మొత్తం 11 సార్లు ఆస్కార్ గెలుచుకుంది.