E & OE (Errors & Omissions Expected)
Gk bits in telugu, Current Affairs bits in telugu, Gk and Current Affairs bits in Telugu Language
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
15, డిసెంబర్ 2021, బుధవారం
జి.కె.టెస్ట్ : 76 GK TEST-76. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)
E & OE (Errors & Omissions Expected)
గ్రామీణ నిరుద్యోగ యువతకు 'సీడాప్' ద్వారా వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ∣ What Is SEEDAP ?
"సీడాప్" (SEEDAP) అంటే ఏమిటి ?
ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకునేలా నిరుద్యోగులకు పలు కోర్సులను ఉచితంగా అందించే సంస్థ "సీడాప్". సీడాప్ అంటే 'సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్' (SEEDAP).
ప్రస్తుతం సీడాప్ (SEEDAP) చైర్మన్ గా 'శ్యాంప్రసాదరెడ్డి' వ్యవహరిస్తున్నారు.
సీడాప్ (SEEDAP) సంస్థ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా యువతకు తర్ఫీదు ఇస్తుంది.
సీడాప్ (SEEDAP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 180 ప్రైవేట్ ఏజెన్సీలు, 14 ప్రభుత్వరంగ సంస్థల ద్వారా వివిధ రకాల కోర్సులను నిర్వహిస్తున్నది.
పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐ.ఐ.టి., పాలిటెక్నిక్ పూర్తి చేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు 90 నుంచి 120 రోజుల వ్యవధి కోర్సుల్లో .. ఉచిత భోజనం, వసతితో పాటు ఏకరూప దుస్తులను కూడా అందిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగమేళా నిర్వహిస్తారు.
సీడాప్ (SEEDAP) లో ఉచిత శిక్షణకు ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ?
సెల్ ఫోన్ల ద్వారా సీడాప్ (SEEDAP) వెబ్ సైట్ (www.seedap.ap.gov.in) లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
సీడాప్ (SEEDAP) లో ఉచిత శిక్షణకు గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది.
ఒక్కో కోర్సులో ఒక్కో బ్యాచ్ కు 35 మందికి అవకాశం ఉంటుంది.
విశాఖపట్నం జిల్లాలో 13 శిక్షణ సంస్థలు సీడాప్ (SEEDAP) ద్వారా 15 కోర్సులను నిర్వహిస్తున్నారు.
సీడాప్ (SEEDAP) లక్ష్యం
2019-2023 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 మందికి ఉచిత శిక్షణ ఇచ్చి, వారిలో 70 శాతం మందికి ఉద్యోగాలను కల్పించాలని సీడాప్ (SEEDAP) లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో 'జాబ్ రిసోర్స్ పర్సన్' (JRP) లతో విస్తృతంగా ప్రచారం కల్పించి ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.
14, నవంబర్ 2021, ఆదివారం
జి.కె.టెస్ట్ : 77 GK TEST-77. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)
E & OE (Errors & Omissions Expected)
6, నవంబర్ 2021, శనివారం
జి.కె.టెస్ట్ : 75 GK TEST-75. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)
E & OE (Errors & Omissions Expected)
30, అక్టోబర్ 2021, శనివారం
జి.కె.టెస్ట్ : 74 GK TEST-74. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)
E & OE (Errors & Omissions Expected)
8, జులై 2021, గురువారం
2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-73
E & OE (Errors & Omissions Expected)
15, జూన్ 2021, మంగళవారం
2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-72
E & OE (Errors & Omissions Expected)
11, జూన్ 2021, శుక్రవారం
2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-71
![]() |
SUBMARINE |
E & OE (Errors & Omissions Expected)
10, జూన్ 2021, గురువారం
పి-75 (ఇండియా) ∣ PROJECT-75 (INDIA) DETAILS IN TELUGU
![]() |
జలాంతర్గామి |
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో .. 2021 జూన్ 4న భారత రక్షణ మంత్రి 'రాజ్ నాథ్ సింగ్' అధ్యక్షతన సమావేశమైన 'రక్షణ కొనుగోళ్ల మండలి' (DAC) "పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] అనే మెగా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
"పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] ద్వారా అధునాతన పరిజ్ఞానంతో 6 సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మిస్తారు. శత్రువులకు ఆచూకీ దొరకని రీతిలో వీటిని 'స్టెల్త్' పరిజ్ఞానంతో (STEALTH TECHNOLOGY) రూపొందిస్తారు. "పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] కింద నిర్మించే ఆరు సబ్మెరైన్లకు (SIX SUBMARINES) అధునాతన 'ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్' (Air-Independent Propulsion) వ్యవస్థ ఉంటుంది. అందువల్ల అవి ఎక్కువసేపు నీటి అడుగున ఉండగలవు.
'వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' (STRATEGIC PARTNERSHIP MODEL) కింద ఈ జలాంతర్గాములను నిర్మిస్తారు. దేశీయ కంపెనీలు .. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని భారత్ లోనే అధునాతన ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయడం ఈ నమూనా ఉద్దేశ్యం. తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. 'వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' కింద చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ ఇదే ("పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)]). 'భారత్ లో తయారీ' (MAKE IN INDIA) కింద చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ సబ్ మెరైన్ల నిర్మాణం కోసం ప్రభుత్వ రంగంలోని 'మఙ్గావ్ డాక్స్ లిమిటెడ్' (MDL), ప్రైవేటు సంస్థ 'ఎల్ అండ్ టీ' (L&T) లకు టెండర్లు జారీ చేసేందుకు 'డీఏసీ' (DAC) ఆమోదం తెలిపింది.
"పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] విలువ రూ. 43 వేల కోట్లు. ఈ జలాంతర్గాముల్లో అమర్చే ఆయుధ వ్యవస్థలను బట్టి అంతిమంగా ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి 12 ఏళ్లు పడుతుంది.
ప్రస్తుతం మనదేశం వద్ద 15 సంప్రదాయ జలాంతర్గాములు, 2 అణు జలాంతర్గాములు ఉన్నాయి.
4, జూన్ 2021, శుక్రవారం
2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-70
![]() |
జస్టిస్ అరుణ్ మిశ్ర |
E & OE (Errors & Omissions Expected)
3, జూన్ 2021, గురువారం
2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-69
E & OE (Errors & Omissions Expected)
31, మే 2021, సోమవారం
2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-68
UPDATES (నవీకరణలు) :
- 2021 జూన్ 7 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్' 2021 మే 27న వెల్లడించారు.
- 'కరోనా' ఉద్ధృతి, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా 'సీఎం' వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.