ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, మార్చి 2022, గురువారం

'డీమ్యాట్' (DEMAT) అకౌంట్ ఓపెన్ చేయబడును

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC of India) త్వరలో పబ్లిక్ ఇష్యూ (IPO = Initial Public Offering) కి సిద్ధమవుతోంది. అంటే ఎల్ ఐ సి (LIC) తన సంస్థలో కొన్ని షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా పబ్లిక్ కి ఆఫర్ చేస్తుంది. పబ్లిక్ కి ఆఫర్ చేసే షేర్లలో 10% వాటాను ప్రత్యేకంగా ఎల్ ఐ సి పాలసీదారులకు రిజర్వ్ చేసింది. ఈ షేర్లను ప్రత్యక్షంగా గానీ (లేదా) లాటరి ద్వారా గానీ కేటాయిస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో పాల్గొనాలి అనుకునేవారు తప్పనిసరిగా తమ పేరుమీద ఒక 'డీమ్యాట్' (DEMAT) అకౌంట్ ని కలిగి ఉండాలి.

ఏదైనా పబ్లిక్ ఇష్యూలో షేర్లను కొనాలన్నా, ఆ తర్వాత వాటిని అమ్మాలన్నా 'డీమ్యాట్' (DEMAT) అకౌంట్ తప్పనిసరి. ఆర్ధిక సెక్యూరిటీలను (ఉదా : ఈక్విటీలు (షేర్లు), డెరివేటివ్స్, కమొడిటీస్ .. మొదలగునవి) ఒక ఎలక్ట్రానిక్ ఫామ్ లో నిర్వహించబడే అకౌంట్ ను 'డీమ్యాట్' (DEMAT) అకౌంట్ అని అంటారు.

పబ్లిక్ ఇష్యూ ద్వారా జారీ చేయబడే ఒక్కో ఎల్ ఐ సి షేర్ విలువ రూ. 2,000 నుంచి రూ. 3,000 కు మధ్యన ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పూర్తి వివరాలకు క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. 

9963309837 (లేదా) 9908216775 (A. శ్రీనివాసరావు)    

3, ఫిబ్రవరి 2022, గురువారం

జి.కె.టెస్ట్-12 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-12 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU


1వ ప్రశ్న : ఐక్యరాజ్య సమితి (UNO) కి చెందిన 'ప్రపంచ వాతావరణ సంస్థ' (WMO) తెలిపిన వివరాల ప్రకారం .. ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపు ఎక్కడ సంభవించింది ?

జవాబు : అమెరికా

2020 ఏప్రిల్ 29న అమెరికాలో కనిపించిన 'మెరుపు' ఇంతవరకు అతి పొడవైనదిగా 'డబ్ల్యుఎంఓ' తేల్చింది. ఈ మెరుపు పొడవు దాదాపు 770 కి.మీ. లు. అమెరికా దక్షిణ ప్రాంతంలోని మిసిసిపి, లూసియానా, టెక్సాస్ ల మీదుగా ఈ మెరుపు మెరిసినట్లు డబ్ల్యుఎంఓ తెలిపింది.

అంతకుముందు అతి పొడవైన మెరుపు బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలో కనిపించింది. 2018 అక్టోబర్ 31న అది 709 కి.మీ.ల మేర విస్తరించింది.

అత్యంత ఎక్కువ సమయం మెరిసిన మెరుపు కూడా 2020లోనే కనిపించినట్లు డబ్ల్యుఎంఓ తెలిపింది. ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనా మీదుగా జూన్ 18న 17.102 సెకన్ల పాటు (0.002 సెకన్లు అటు ఇటుగా) ఈ మెరుపు మెరిసింది.

2వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి ప్రయాణ టికెట్, ప్రత్యేక దర్శనం బుక్ చేసుకున్న వారికి .. తిరుమల కొండ పైకి వెళ్లి తిరిగి వచ్చే టిక్కెట్లను కూడా (Online booking for Tirumala travel on APSRTC buses) ఏ తేదీ నుంచి జారీ చేయనున్నారు ?

జవాబు : 2022 ఫిబ్రవరి 3

ఈ టిక్కెట్లకు ఆన్లైన్ లోనే అదనంగా రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.

3వ ప్రశ్న : సివిల్ సర్వీసెస్-2022 నోటిఫికేషన్ (Civil Services-2022 Notification) ఎప్పుడు విడుదలయ్యింది ?

జవాబు : 2022 ఫిబ్రవరి 2

గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య పెరిగింది. ప్రస్తుత నోటిఫికేషన్ లో మొత్తం 861 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. 

2020లో 796, 2021లో 712 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2019లో మాత్రం 896 ఖాళీలను భర్తీ చేశారు.

 సివిల్ సర్వీసెస్-2022 ప్రాథమిక పరీక్ష జూన్ 5న జరగనుంది. దరఖాస్తు గడువు 2022 ఫిబ్రవరి 22 వరకు ఉంది.

4వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'అమరావతి' ని తమ రాజధానిగా ఏ తేదీన ప్రకటించింది ?

జవాబు : 2015 ఏప్రిల్ 23

5వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా ఏ నగరంలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల (Pre-paid Electricity Meters) ను ఏర్పాటు చేశారు ?

జవాబు : విశాఖపట్నం

విశాఖపట్నం సర్కిల్ కార్యాలయంలోని జోన్-1 పరిధిలో వంద గృహ, వాణిజ్య విద్యుత్తు (95 సింగిల్ ఫేజ్, 5 త్రీ ఫేజ్) కనెక్షన్లకు ఈ మీటర్లను అనుసంధానం చేశారు. 

6వ ప్రశ్న : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏ సంస్థ భారత సైన్యం కోసం 'కొంకర్స్-ఎం' యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను సరఫరా చేయనుంది ?

జవాబు : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

దీనికి సంబంధించిన ఒప్పందంపై 'బీడీఎల్' భారత సైన్యంతో 2022 ఫిబ్రవరి 2న సంతకాలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 3,131.82 కోట్లు. మూడేళ్లలో ఈ క్షిపణులను సరఫరా చేయాల్సి ఉంటుంది.

'కొంకర్స్-ఎం' యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను రష్యాకు చెందిన 'ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్' (OEM) కంపెనీతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుని మనదేశంలో ఉత్పత్తి చేస్తున్నట్లు బీడీఎల్ సిఎండి 'సిద్ధార్థ మిశ్రా' వివరించారు. శత్రువుకు చెందిన యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేయగల సత్తా ఈ క్షిపణులకు (ATGM) ఉంది. 'బీఎంపీ-2' ట్యాంక్ లాంచర్ లేదా భూమి మీద నుంచి ఈ క్షిపణులను ప్రయోగించవచ్చు. కేవలం 19 సెకన్ల వ్యవధిలోనే నాలుగు వేల మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. పూర్తిగా దేశీయంగా తయారైన విడిభాగాలతో వీటిని మనదేశంలో బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది.

7వ ప్రశ్న : ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే ఐపీల్ వేలంలో పాల్గొనే తుది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి ?

జవాబు : మనోజ్ తివారి

గతంలో టీంఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించిన 36 ఏళ్ల మనోజ్ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి రానున్నాడు.

గతేడాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి మమతా బెనర్జీ మంత్రివర్గంలో క్రీడల శాఖ బాధ్యతలు చూస్తున్నాడు.

8వ ప్రశ్న : 2021 సంవత్సరానికి ఐసీసీ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డును ఎవరు గెలుచుకున్నారు ?

జవాబు : డరిల్ మిచెల్ (న్యూజిలాండ్)

 ఇంగ్లాండ్ తో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి, తేలిగ్గా వచ్చే ఓ సింగిల్ ను తీయడానికి నిరాకరించినందుకు అతడు ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.

కివీస్ ఇన్నింగ్స్ లో నీషమ్ బంతిని కొట్టి సింగిల్ తీయాలనుకున్నాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న మిచెల్ పరుగు తీయడానికి నిరాకరించాడు. బంతిని పట్టుకోవాలనుకున్న రషీద్ కు తాను అడ్డుగా వచ్చానని భావించడమే అందుకు కారణం. 

9వ ప్రశ్న : 24 ఏళ్ల తర్వాత తొలిసారి ఏ దేశ క్రికెట్ జట్టు 'అండర్-19 ప్రపంచకప్' ఫైనల్ చేరింది ?

జవాబు : ఇంగ్లాండ్

ఉత్కంఠగా సాగిన సెమీస్ లో ఆ జట్టు డక్ వర్త్ లూయిస్ పధ్ధతి ప్రకారం 15 పరుగుల తేడాతో ఆఫ్గానిస్థాన్ పై గెలిచింది. 

10వ ప్రశ్న : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్ల కొత్త మార్కెట్ విలువలు (రిజిస్ట్రేషన్) ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ?  

జవాబు : 2022 ఫిబ్రవరి 1

తెలంగాణ రాష్ట్రంలో కనీస పెరుగుదల వ్యవసాయ భూముల విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, ఫ్లాట్ల విలువ 25 శాతంగా ఉంది.

హైదరాబాద్ బంజారాహిల్స్ లో చదరపు గజానికి రూ. 1,14,100 గా నిర్ణయించారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక ధర.

26, జనవరి 2022, బుధవారం

జి.కె.టెస్ట్-11 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-11 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. మానవ మెదడులో కంప్యూటర్ చిప్ ను చొప్పించేందుకు ఏ సంవత్సరంలో 'న్యూరాలింక్' (NEURALINK) అనే అంకుర సంస్థను ఎలన్ మస్క్ ఏర్పాటు చేశారు ? ['బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ పేస్' (BCI) సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు ఈ సంస్థ చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్ళు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుంది]

(ఎ) 2015

(బి) 2016

(సి) 2017

(డి) 2018


2. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి 'సుభాష్ చంద్ర బోస్' జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో దాని హాలోగ్రామ్ విగ్రహాన్ని డిజిటల్ రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ తేదీన ఆవిష్కరించారు ?

(ఎ) 2022 జనవరి 20

(బి) 2022 జనవరి 21

(సి) 2022 జనవరి 22

(డి) 2022 జనవరి 23


3. కొవిడ్ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రంలో ఏ తేదీ నుంచి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ చేస్తున్నారు ? [ఉచిత దర్శనం, రూ. 150 చెల్లించి శీఘ్ర దర్శనం, రూ. 300 చెల్లించి అతిశీఘ్ర దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను www.srisailadevasthanam.org ద్వారా పొందవచ్చు. భక్తులు తమ కొవిడ్ వాక్సినేషన్ ధ్రువపత్రాన్ని ఆన్లైన్ లో పొందుపరచాల్సి ఉంటుంది]

(ఎ) 2022 జనవరి 23

(బి) 2022 జనవరి 24

(సి) 2022 జనవరి 25

(డి) 2022 జనవరి 26


4. అంటార్కిటికాలో వాతావరణ మార్పుల్ని పరిశీలించేందుకు 'అంటార్కిటికా ఎక్స్ పిడిషన్-2022' (ANTARCTIC EXPEDITION-2022) పేరిట నిర్వహిస్తున్న యాత్రకు ఎంపికైన 'అభిషేక్ సొబ్బన' ఏ జిల్లాకు చెందినవాడు ? [అతనితోపాటు 45 దేశాలకు చెందిన 150 మందికి పైగా ఈ యాత్రలో పాల్గొననున్నారు. '2041 ఫౌండేషన్' వ్యవస్థాపకుడు రాబర్ట్ స్వాన్ 'ది లీడర్షిప్ ఆన్ ది ఎడ్జ్' కార్యక్రమంలో భాగంగా అంటార్కిటికా ఎక్స్ పిడిషన్ ను ఏటా నిర్వహిస్తున్నారు. 2022 మార్చ్ 17 నుంచి 28వ తేదీ మధ్య ఈ యాత్ర జరుగుతుంది]

(ఎ) వైఎస్సార్ కడప 

(బి) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

(సి) తూర్పుగోదావరి

(డి) విశాఖపట్నం


5. భారతదేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తి (India's 'Tallest Man') గా పేరొందిన 'ధర్మేంద్ర ప్రతాప్ సింగ్' ఏ రాజకీయ పార్టీలో చేరారు ? [ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు 8.1 అడుగులు]

(ఎ) కాంగ్రెస్

(బి) బీజేపీ

(సి) సమాజ్ వాదీ పార్టీ

(డి) బహుజన్ సమాజ్ పార్టీ 


6. కొవిడ్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో వ్యాపిస్తుందో తెలిపేది ? [ఇది 1 కంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లుగా పరిగణిస్తారు]

(ఎ) పీ-వాల్యూ

(బి) క్యూ-వాల్యూ

(సి) ఆర్-వాల్యూ 

(డి) ఎస్-వాల్యూ 


7. నేతాజీ రీసెర్చ్ బ్యూరో 2022 సంవత్సరానికి నేతాజీ పురస్కారాన్ని (NETAJI AWARD 2022) ఎవరికి ప్రదానం చేసింది ?

(ఎ) షింజో అబే

(బి) జో బైడెన్

(సి) వ్లాదిమిర్ పుతిన్

(డి) బరాక్ ఒబామా


8. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ 'బచేంద్రిపాల్' సారథ్యంలో 50 ఏళ్లు పైబడిన పదిమంది మహిళల జట్టుతో అరుణాచల్ ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా చేపట్టనున్న సుదీర్ఘ యాత్ర ఏ తేదీన ప్రారంభం కానుంది ? [ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా 5 నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగుతుంది. 'టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్', కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 'ఫిట్ ఇండియా' (FIT INDIA) బ్యానరుపై ఈ యాత్రను నిర్వహిస్తున్నారు]

(ఎ) 2022 మార్చ్ 6

(బి) 2022 మార్చ్ 7

(సి) 2022 మార్చ్ 8

(డి) 2022 మార్చ్ 9


9. భారతదేశంలో ఏ తేదీన 'జాతీయ బాలికా దినోత్సవం' ను జరుపుతారు ? [భారతీయ సమాజంలో బాలికల విషయంలో నెలకొన్న దుర్విచక్షణ పట్ల అందరినీ చైతన్యవంతం చేసేందుకు 2008లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'జాతీయ బాలికా దినోత్సవం' (NATIONAL GIRL CHILD DAY) ను ప్రారంభించారు] 

(ఎ) 2022 జనవరి 21

(బి) 2022 జనవరి 22

(సి) 2022 జనవరి 23

(డి) 2022 జనవరి 24


10. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి (GDP Growth in 2022-23) ఎంత శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని 2021-22 ఆర్ధిక సర్వేలో అంచనా వేయనున్నారు ?

(ఎ) 7%

(బి) 8%

(సి) 9%

(డి) 10%


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-11 ; సంవత్సరం : 2022 (GK TEST-11 ; YEAR : 2022)

1) సి 2) డి 3) సి 4) బి 5) సి 6) సి 7) ఎ 8) సి 9) డి 10) సి    


E&OE. (Errors and Omissions Expected)

25, జనవరి 2022, మంగళవారం

జి.కె.టెస్ట్-10 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-10 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏయే తేదీలలో జరగనున్నాయి ? 

(ఎ) 2022 ఫిబ్రవరి 20 నుంచి 2022 మార్చ్ 2 వరకు 

(బి) 2022 ఫిబ్రవరి 21 నుంచి 2022 మార్చ్ 3 వరకు

(సి) 2022 ఫిబ్రవరి 22 నుంచి 2022 మార్చ్ 4 వరకు

(డి) 2022 ఫిబ్రవరి 23 నుంచి 2022 మార్చ్ 5 వరకు


2. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడి పేరేమిటి ? [ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏటా 'డాక్టర్ జె.కె. త్రివేది జీవన సాఫల్య పురస్కారం' నిమిత్తం దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా ఉన్న మానసిక వైద్యుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి ఇతనిని ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరిలో భువనేశ్వర్ లో జరిగే జాతీయ సైకియాట్రిక్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డు అందజేస్తారు]

(ఎ) డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి

(బి) డాక్టర్ కూటికుప్పల సూర్యారావు

(సి) డాక్టర్ కర్రి రామారెడ్డి 

(డి) డాక్టర్ పి. ఉదయ్ కిరణ్


3. గణతంత్ర వేడుకల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 29న ఏర్పాటు చేసే 'బీటింగ్ రిట్రీట్' కార్యక్రమంలో మహాత్మా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ కీర్తన 'అబైడ్ విత్ మీ' ని తొలగించారు. ఏటా ఈ గేయంతోనే వేడుక ముగిసేది. ఈసారి మాత్రం 'సారే జహా సే అచ్చా' తో కార్యక్రమం సమాప్తమవుతుంది. 'అబైడ్ విత్ మీ' ని స్కాటిష్ ఆంగ్లికన్ కవి 'హెన్రీ ఫ్రాన్సిస్ లైట్' ఏ సంవత్సరంలో రచించారు ? [1950 నుంచి ఈ కీర్తన 'బీటింగ్ రిట్రీట్' లో భాగంగా ఉంటోంది]

(ఎ) 1846

(బి) 1847

(సి) 1848

(డి) 1849


4. ఏ దేశంలోని బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా పరమాణు స్థాయిలో ఒమిక్రాన్ యొక్క నిర్మాణ తీరుతెన్నులను ఆవిష్కరించారు ? [ఈ పరిశోధక బృందంలో భారత సంతతికి చెందిన 'శ్రీరాం సుబ్రహ్మణ్యం' కూడా ఉన్నారు ]

(ఎ) యూ ఎస్ ఏ

(బి) ఇంగ్లాండ్

(సి) ఆస్ట్రేలియా

(డి) కెనడా


5. 2022 జనవరి 22న భారత ప్రధాని నరేంద్ర మోదీ 'ఆకాంక్షిత జిల్లాల పథకం' పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ జిల్లాను కూడా ఒక ఉదాహరణగా ప్రధాని ప్రస్తావించారు ? [2018లో 112 వెనుకబడిన జిల్లాలతో ఆకాంక్షిత జిల్లాల పథకాన్ని ప్రారంభించారు]

(ఎ) విశాఖపట్నం

(బి) భద్రాద్రి కొత్తగూడెం

(సి) అనంతపురం

(డి) ఆదిలాబాద్


6. ఏ సంవత్సరంలో 'డోలో' పేరుతో 650 ఎంజీ డోసు పారాసెట్మాల్ టాబ్లెట్ ను బెంగళూరుకు చెందిన 'మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్' తీసుకొచ్చింది ? [ఈ ఫార్మా కంపెనీ విజయానికి ఈ డోసే ప్రధాన కారణం. అప్పటి వరకు మార్కెట్ లో పారాసెట్మాల్ 500 ఎంజీ మాత్రమే అందుబాటులో ఉండేది]

(ఎ) 1991

(బి) 1992

(సి) 1993

(డి) 1994


7. 2022 జనవరి 21న జరిగిన 'భారత పెట్రోలియం, శక్తి సంస్థ' (IIPE) మొదటి స్నాతకోత్సవానికి ఎవరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ?

(ఎ) రామ్ నాథ్ కోవింద్

(బి) ఎం.వెంకయ్య నాయుడు

(సి) నరేంద్ర మోదీ 

(డి) వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి


8. ఆస్ట్రేలియాలో 2022 అక్టోబర్ 22న ప్రారంభమయ్యే '2022 టీ20 క్రికెట్ ప్రపంచకప్' టోర్నీ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఢీకొనే జట్టేది ? [2022 నవంబర్ 9, 10 తేదీల్లో సెమీఫైనల్స్ (సిడ్నీ, అడిలైడ్), 13న ఫైనల్ (మెల్ బోర్న్) జరుగుతాయి]

(ఎ) న్యూజీలాండ్

(బి) ఇంగ్లాండ్ 

(సి) భారత్

(డి) దక్షిణాఫ్రికా


9. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ 'నవోమి ఒసాకా' (జపాన్) ను మూడో రౌండ్ లో ఓడించినది ? [ఈమె రెండో రౌండ్లో ఒలింపిక్ ఛాంపియన్ 'బెన్సిచ్' కు షాక్ ఇచ్చింది]  

(ఎ) అనిసిమోవా (అమెరికా)

(బి) అజరెంక (బెలారస్)

(సి) స్వితోలిన (ఉక్రెయిన్)

(డి) ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)


10. మలయాళ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'మరక్కార్' చిత్ర దర్శకుని పేరేమిటి ? [94వ ఆస్కార్ వేడుకల కోసం బరిలో నిలిచిన 276 చిత్రాలలో మనదేశం నుంచి 'మరక్కార్' మరియు 'జై భీమ్' కూడా ఉన్నాయి]

(ఎ) గోవిందన్ అరవిందన్

(బి) ప్రతాప్ పోతన్ 

(సి) ప్రియదర్శన్

(డి) రాజీవ్ కుమార్


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-10 ; సంవత్సరం : 2022 (GK TEST-10 ; YEAR : 2022)

1) సి 2) ఎ 3) బి 4) డి 5) బి 6) సి 7) బి 8) ఎ 9) ఎ 10) సి    


E&OE. (Errors and Omissions Expected)

19, జనవరి 2022, బుధవారం

జి.కె.టెస్ట్-9 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-9 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఏ తేదీలోగా ఉద్యోగాలు ఇవ్వనున్నారు ?

(ఎ) 2022 మే 31

(బి) 2022 జూన్ 30

(సి) 2022 జూలై 31

(డి) 2022 ఆగస్ట్ 31


2. 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష' పథకం (YSR JAGANANNA SASWATHA BHU HAKKU AND BHU RAKSHA PATHAKAM) లో భాగంగా తొలిదశ కింద 51 గ్రామాల్లో పూర్తి చేసిన భూముల రీ-సర్వే రికార్డులను ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రజలకు ఏ తేదీన అంకితం చేశారు ? [ఇందులో 37 గ్రామాల్లో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు]

(ఎ) 2022 జనవరి 15

(బి) 2022 జనవరి 16

(సి) 2022 జనవరి 17

(డి) 2022 జనవరి 18


3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఈ మార్కెట్ వేదిక ద్వారా పొలం నుంచే విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థను ఏర్పాటు చేస్తోంది ? [ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యాన నర్సరీల నమోదు చట్టం 2022 జనవరి 18 నుంచి అమల్లోకి వస్తుందని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది]

(ఎ) ఈ-క్రయ కార్పొరేషన్ 

(బి) ఈ-విక్రయ కార్పొరేషన్

(సి) ఈ-సేల్ కార్పొరేషన్

(డి) ఈ-మార్కెట్ కార్పొరేషన్


4. వీధులను వాహన కేంద్రాలుగానే కాకుండా ప్రజా కేంద్రాలుగా మార్చాలన్న '2006 నేషనల్ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ పాలసీ' (2006 NATIONAL URBAN TRANSPORT POLICY) ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2020లో శ్రీకారం చుట్టిన "స్త్రీట్స్ 4 పీపుల్ ఛాలెంజ్" (STREETS 4 PEOPLE CHALLENGE) పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయస్థాయిలో తొలి 11 స్థానాల్లో నిలిచిన నగరం ? [దేశంలోని 100 నగరాల మధ్య ఈ పోటీని నిర్వహించారు]

(ఎ) తిరుపతి

(బి) విజయవాడ

(సి) విశాఖపట్నం

(డి) కాకినాడ


5. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న దిల్లీ రాజ్ పథ్ లో జరిగే వేడుకల్లో మొత్తం ఎన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు మాత్రమే కవాతులో పాల్గొననున్నాయి ?

(ఎ) 10

(బి) 11

(సి) 12

(డి) 13


6. భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక 'ఐ ఎన్ ఎస్ రణ్ వీర్' (INS RANVIR) లో 2022 జనవరి 18 సాయంత్రం 4.30 గంటలకు జరిగిన పేలుడు ఘటనలో నేవీ కి చెందిన ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. రాజ్ పుత్ తరగతి డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో 'ఐ ఎన్ ఎస్ రణ్ వీర్' ఎన్నోది ?

(ఎ) 1

(బి) 2

(సి) 3

(డి) 4


7. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా 'భగవంత్ మాన్' (BHAGWANT MANN) ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరపున ఖరారు చేశారు ? 

(ఎ) పంజాబ్

(బి) ఉత్తర్ ప్రదేశ్

(సి) ఉత్తరాఖండ్

(డి) గోవా


8. ఐపీల్ కొత్త ఫ్రాంచైజీ 'లఖ్ నవూ' కు (IPL TEAM LUCKNOW CAPTAIN) ఏ ఆటగాడు సారథ్యం వహించనున్నాడు ?

(ఎ) కే ఎల్ రాహుల్

(బి) రిషబ్ పంత్ 

(సి) హార్దిక్ పాండ్య

(డి) మయాంక్ అగర్వాల్


9. ఫార్ములా వన్ కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే 'ఫార్ములా ఈ-రేస్' (FORMULA E-RACE) పోటీలకు కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారిగా అవకాశం దక్కించుకున్న నగరం ? [2022 నవంబర్ 22 నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఫార్ములా ఈ-రేస్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరగనున్నాయి. 'పినాకిల్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్' (THE PINNACLE OF ELECTRIC CAR RACING CHAMPIONSHIP) పేరుతో ఈ పోటీలు జరగనున్నాయి]

(ఎ) నయా రాయపూర్ 

(బి) ఇండోర్

(సి) హైదరాబాద్

(డి) బెంగళూరు


10. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు ఇకపై రాత్రి ఎన్ని గంటల వరకు తెరిచే ఉంటాయి ? [కొవిడ్ మార్గదర్శకాలను పాటించేందుకు పని వేళలను పెంచినట్లు ఆయా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విక్రయాల ఖాతాల నిర్వహణకు ఈ సమయాన్ని పెంచినట్లు వెల్లడించారు]

(ఎ) 8

(బి) 9

(సి) 10

(డి) 11


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-9 ; సంవత్సరం : 2022 (GK TEST-9 ; YEAR : 2022)

1) బి 2) డి 3) బి 4) బి 5) సి 6) డి 7) ఎ 8) ఎ 9) సి 10) సి    


E&OE. (Errors and Omissions Expected)

9, జనవరి 2022, ఆదివారం

జి.కె.టెస్ట్-8 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-8 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. 2022 జనవరి 5న జరిగిన పంజాబ్ రాష్ట్ర పర్యటనలో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ని ఏ జిల్లాలో నిరసనకారులు దిగ్బంధించారు ? [ఈ పరిణామంతో ప్రధాని దిల్లీకి తిరుగు పయనమయ్యారు] 

(ఎ) ఫరీద్ కోట్

(బి) ఫతేగర్ సాహెబ్ 

(సి) ఫజిల్క 

(డి) ఫిరోజ్ పుర్ 


2. కొవిడ్ బారిన పడిన వారికి ఇంట్లో ఏకాంతంలో ఉండాల్సిన (HOME ISOLATION) కాల పరిమితిని భారత ప్రభుత్వం 10 రోజుల నుంచి ఎన్ని రోజులకు తగ్గించింది ? [ఈ సమయంలో వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే ఐసొలేషన్ ను ముగించవచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు]

(ఎ) 9

(బి) 8

(సి) 7

(డి) 6


3. భారతదేశంలో తొలి ఒమిక్రాన్ కారక మరణం ఏ రాష్ట్రంలో నమోదైంది ? [ఈ విషయాన్ని భారత ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది] (India's first Omicron-related Death)

(ఎ) రాజస్థాన్

(బి) మహారాష్ట్ర

(సి) కేరళ

(డి) గుజరాత్


4. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి ఏ తేదీ నుంచి కొవిడ్ టీకా ముందు జాగ్రత్త డోసు (COVID VACCINE THIRD DOSE) ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు నీతి ఆయోగ్ (NITI AAYOG) సభ్యుడు 'వీకే పాల్' తెలిపారు ?

(ఎ) 2022 జనవరి 8

(బి) 2022 జనవరి 9

(సి) 2022 జనవరి 10

(డి) 2022 జనవరి 11


5. ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన అధికారుల బృందం ఎయిర్ మార్షల్ 'మానవేంద్ర సింగ్' నేతృత్వంలో జరిపిన దర్యాప్తు ప్రకారం .. భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 12 మంది మృతి చెందిన వైమానికదళ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణం ? [తమిళనాడులోని కూనూర్ సమీపంలో 2021 డిసెంబర్ 8న రష్యా తయారీ ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కుప్పకూలింది] (IAF Helicopter Crashed in Tamilnadu)

(ఎ) ప్రతికూల వాతావరణం

(బి) సాంకేతిక లోపం

(సి) విద్రోహచర్య

(డి) అంతర్గత కుట్రలు


6. ఈ ఏడాది మొత్తం ఎంత మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు ? [వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు]

(ఎ) 76

(బి) 77

(సి) 78

(డి) 79


7. అమెరికా నౌకాదళ చరిత్రలో మొట్టమొదటిసారిగా అణు ఇంధనంతో నడిచే విమానవాహక నౌక (USS ABRAHAM LINCOLN) కు సారథిగా నియమితులైన మహిళగా 'కెప్టెన్ బావర్న్ ష్మిట్' (Capt. Amy Bauernschmidt) చరిత్ర సృష్టించారు. ఆమెకు మొత్తం ఎన్ని గంటలపాటు విమానాలు, హెలీకాఫ్టర్లను నడిపిన అనుభవం ఉంది ? [అబ్రహాం లింకన్ నౌక సమూహంలో అత్యాధునిక యుద్ధ విమానాలు, ఒక గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ నౌక, మూడు డిస్ట్రాయర్ నౌకలు ఉంటాయి. ఈ సమూహం ఇండో-పసిఫిక్ జలాలకు పయనమై వెళుతోంది]

(ఎ) 1,000

(బి) 2,000

(సి) 3,000

(డి) 4,000


8. 'భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం' (AAPI) 15వ అంతర్జాతీయ సదస్సు 2022 జనవరి 5న ఎక్కడ ప్రారంభమైంది ? ['ఆపీ' (AAPI) లో దాదాపు లక్ష మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు]

(ఎ) చెన్నై

(బి) విశాఖపట్నం

(సి) హైదరాబాద్

(డి) దిల్లీ 


9. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళల ఆర్ధిక సాయానికి ఉద్దేశించిన 'ఈబీసీ నేస్తం' (EBC NESTHAM) పథకం ప్రారంభ తేదీని 2022 జనవరి 9 నుంచి ఏ తేదీకి మార్చారు ? [ఈ పథకం కింద అర్హులైన ఒక్కో మహిళకు రూ. 15 వేలు ఇస్తారు. 'ఈబీసీ నేస్తం' (EBC NESTHAM) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రారంభించనున్నారు]   

(ఎ) 2022 జనవరి 10

(బి) 2022 జనవరి 11

(సి) 2022 జనవరి 12

(డి) 2022 జనవరి 13


10. 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2022' చేపట్టిన ఎన్నికల సంఘం 2022 జనవరి 5న ప్రచురించిన తుది జాబితా ప్రకారం .. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య ?

(ఎ) 4,06,36,279

(బి) 4,07,36,279

(సి) 4,08,36,279

(డి) 4,09,36,279


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-8 ; సంవత్సరం : 2022 (GK TEST-8 ; YEAR : 2022)

1) డి 2) సి 3) ఎ 4) సి 5) ఎ 6) బి 7) సి 8) సి 9) ఎ 10) బి    


E&OE. (Errors and Omissions Expected)

7, జనవరి 2022, శుక్రవారం

జి.కె.టెస్ట్-7 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-7 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

 

1. గంటలో 910 మందికి గోరింటాకు పెట్టి గిన్నిస్ రికార్డు సృష్టించిన 'ఆదిత్యా నితిన్' స్వరాష్ట్రమేది ? [గతంలో లండన్ కు చెందిన 'సామినా హుస్సేన్' గంటలో 600 మందికి మెహందీ డిజైన్లు వేసిన రికార్డుని ఆదిత్యా నితిన్ కేవలం 37 నిమిషాల్లోనే దాటేసింది] (Adithya Nitin's Home State)

ADITHYA NITIN
ఆదిత్యా నితిన్Image Source : www.shethepeople.tv

 

(ఎ) కేరళ

(బి) కర్ణాటక

(సి) గోవా

(డి) తమిళనాడు


2. రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్న 'సత్యపాల్ మాలిక్' (SATYAPAL MALIK) ప్రస్తుతం ఏ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు ?

(ఎ) మణిపూర్

(బి) మిజోరాం

(సి) మేఘాలయ

(డి) నాగాలాండ్


3. కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగులకు 'హామీతో కూడిన కెరీర్ పురోగతి' (ACP) పథకానికి సంబంధించిన ఉత్తర్వులు ఏ సంవత్సరంలో జారీ అయ్యాయి ? [12 ఏళ్ల సర్వీస్ తర్వాత కూడా పదోన్నతి లభించని వారికి తదుపరి గ్రేడ్ వేతనం ఇవ్వాలనేది 'ఏసీపీ' పథకం ఉద్దేశ్యం. 24 ఏళ్ల తర్వాత రెండోసారి ఇలాంటిది ఇవ్వాలి]

(ఎ) 1996

(బి) 1997

(సి) 1998

(డి) 1999


4. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తులను 'మైలార్డ్, యువరానర్' (MY LORD, YOUR HONOUR) అని న్యాయవాదులు సంబోధిస్తారని, ఇకపై దానికి బదులుగా 'సార్' అని పిలిస్తే సరిపోతుంది అనే చారిత్రాత్మక నిర్ణయం తీసున్న హైకోర్ట్ ?

(ఎ) ఆంద్రప్రదేశ్

(బి) ఒడిశా

(సి) పశ్చిమ బెంగాల్

(డి) ఉత్తర్ ప్రదేశ్


5. 'సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్' (CDSCO) తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం 'కొవాగ్జిన్' టీకా తయారైన తేదీ నుంచి ఎన్ని నెలల వరకు వినియోగించవచ్చు ? (COVAXIN VACCINE EXPIRY DATE) [ఇదే తరహాలో 'కోవిషీల్డ్' టీకా వినియోగం గడువును 6 నెలల నుంచి 9 నెలల వరకు 'సీ డీ ఎస్ సీ ఓ' (CDSCO) పెంచింది]

(ఎ) 6 నెలలు

(బి) 9 నెలలు

(సి) 12 నెలలు

(డి) 18 నెలలు


6. ఏ ప్రభుత్వరంగ సంస్థకు 'చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్' (CMD) గా 'అల్కా మిత్తల్' (ALKA MITTAL) నియమితులయ్యారు ? [ఈ సంస్థ సీఎండీ గా ఒక మహిళ పనిచేయనుండటం ఇదే ప్రథమం. ఆమె ఈ పదవిలో ఆరు నెలలు లేదా సాధారణ నియామకం జరిగేంత వరకు కొనసాగుతారు. 2021 మార్చ్ 31న శశి శంకర్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ సంస్థకు శాశ్వత సీఎండీ ని నియమించలేదు]

(ఎ) గైల్ (GAIL)

(బి) సెయిల్ (SAIL)

(సి) ఐ ఓ సీ ఎల్ (IOCL)

(డి) ఓ ఎన్ జీ సీ (ONGC)


7. ఇంటర్నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) అందుకు సంబంధించిన విధివిధానాలను ఏ తేదీన విడుదల చేసింది ? [ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఒక లావాదేవీకి రూ. 200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ. 2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫ్ లైన్ చెల్లింపులు కచ్చితంగా సంబంధిత వ్యక్తులు ప్రత్యక్షంగా (FACE TO FACE) చేయాలి] (Digital Payments Offline)

(ఎ) 2022 జనవరి 1

(బి) 2022 జనవరి 2

(సి) 2022 జనవరి 3

(డి) 2022 జనవరి 4


8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల బాలబాలికలకు ప్రారంభమైన తొలివిడత టీకా పంపిణీ ఈ నెల 7వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏ టీకాను వినియోగిస్తున్నారు ?

(ఎ) కొవాగ్జిన్

(బి) కొవిషీల్డ్ 

(సి) స్పుత్నిక్-వి

(డి) మోడెర్నా ఎం ఆర్ ఎన్ ఏ 


9. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కొవిడ్-19 చికిత్సకు పరిహారం ఇవ్వాలని 'బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ' (IRDAI) ఏ తేదీన ఆదేశాలిచ్చింది ? [కొవిడ్ చికిత్సకు ఉపయోగపడుతున్న ఆరోగ్య బీమా పాలసీలు 'ఒమిక్రాన్' (OMICRON) వ్యాధిగ్రస్తులకూ ఉపయోగపడతాయని 'ఐ ఆర్ డీ ఏ ఐ' (IRDAI) 2022 జనవరి 3న మార్గదర్శకాలు జారీ చేసింది]  

(ఎ) 2020 మార్చ్ 25

(బి) 2020 ఏప్రిల్ 1

(సి) 2020 జూలై 1

(డి) 2020 ఆగస్ట్ 16


10. ఏ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'అనిల్ చంద్ర పునేఠా' (ANIL CHANDRA PUNETHA) నియమితులయ్యారు ? [పదవీకాలం పూర్తయ్యే వరకు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు అతను ఈ పదవిలో కొనసాగుతారు] (Chief Information Commissioner)

(ఎ) హిమాచల్ ప్రదేశ్

(బి) ఉత్తరాఖండ్

(సి) పంజాబ్

(డి) రాజస్థాన్


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-7 ; సంవత్సరం : 2022 (GK TEST-7 ; YEAR : 2022)

1) ఎ 2) సి 3) డి 4) బి 5) సి 6) డి 7) సి 8) ఎ 9) బి 10) బి    


E&OE. (Errors and Omissions Expected)