ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, జనవరి 2021, శుక్రవారం

GK TEST-2 DATE : 2021 JANUARY 15

1. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన "సెంట్రల్ విస్టా" (CENTRAL VISTA) ప్రాజెక్ట్ కు అంగీకారం తెలియజేస్తూ 2021 జనవరి 5న సుప్రీంకోర్టు 2-1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ కేసులో అసమ్మతి తీర్పునిచ్చిన న్యాయమూర్తి ? [నిబంధనలను పూర్తిగా పాటించకపోవడం, ప్రజాభిప్రాయాన్ని సేకరించకపోవడాన్ని తప్పుపడుతూ.. ఈ న్యాయమూర్తి 179 పేజీల అసమ్మతి తీర్పునిచ్చారు]
(ఎ) జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్
(బి) జస్టిస్ దినేశ్ మహేశ్వరి 
(సి) జస్టిస్ సంజీవ్ ఖన్నా 
(డి) జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి

2. 'జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం' (NDRF) లోకి తొలిసారిగా ప్రవేశించిన మహిళల మొదటి బృందం (100 మందికి పైగా ఉన్నారు) విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని అత్యవసర విధుల నిర్వహణ కోసం మోహరింపబడిన 'గఢ్ ముక్తేశ్వర్' పట్టణం గల రాష్ట్రం ?
(ఎ) ఉత్తరాఖండ్
(బి) హిమాచల్ ప్రదేశ్ 
(సి) ఉత్తర్ ప్రదేశ్ 
(డి) బీహార్

3. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 'ప్రధాన న్యాయమూర్తి' (CJ) గా "జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి" (జస్టిస్ ఏకే గోస్వామి) 2021 జనవరి 6న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేశారు. 'జస్టిస్ ఏకే గోస్వామి' నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి ? [ సీజే' (CJ) రాకతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది]
(ఎ) 1 
(బి) 2
(సి) 3
(డి) 4



4. పశ్చిమ గోదావరి జిల్లా 'ఏలూరు' (ELURU) లో 2020 డిసెంబర్ 4 నుంచి 2020 డిసెంబర్ 12వ తేదీ మధ్య 622 మంది బాధితులు అంతుచిక్కని వ్యాధి (మూర్ఛతో కింద పడిపోవడం, నోటివెంట నురగ, స్పృహ కోల్పోవడం, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలు) తో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. "నీరు, పాలు, కూరగాయలు, పండ్లు" వాడకం ద్వారా బాధితుల శరీరంలోకి 'ఆర్గానోక్లోరైడ్' (ORGANOCHLORIDE) వెళ్లి ఉండొచ్చని ఉన్నతస్థాయి కమిటీ బలంగా అభిప్రాయపడింది. వీటిలోనూ ఏది ప్రధాన కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు ?
(ఎ) నీరు
(బి) పాలు
(సి) కూరగాయలు
(డి) పండ్లు

5. 'బర్డ్ ఫ్లూ' (BIRD FLU (OR) AVIAN INFLUENZA) వైరస్ భారత్ లో తొలిసారిగా 2006 మార్చిలో "నవపూర్" అనే గ్రామంలో వెలుగు చూసింది. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ? [భారత్ లోకి ఈ వైరస్ ప్రవేశించిన తరవాత ఇప్పటివరకు 72 లక్షలకు పైగా కోళ్లను వధించారు]
(ఎ) మధ్యప్రదేశ్  
(బి) మహారాష్ట్ర 
(సి) ఉత్తర్ ప్రదేశ్ 
(డి) రాజస్థాన్

6. పార్లమెంటు సభ్యుల సంఖ్య స్థిరీకరణ 2026వ సంవత్సరంతో ముగియనున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఎంతమంది సభ్యుల్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా 'లోక్ సభ, రాజ్య సభ'నిర్మాణాలను (CENTRAL VISTA) తీర్చిదిద్దుతోంది ?
(ఎ) 886 (లోక్ సభ), 382 (రాజ్య సభ)
(బి) 887 (లోక్ సభ), 383 (రాజ్య సభ)
(సి) 888 (లోక్ సభ), 384 (రాజ్య సభ)
(డి) 889 (లోక్ సభ), 385 (రాజ్య సభ)



7. భారత దేశానికి చెందిన అయిదో తరం యుద్ధ విమానం ? [ప్రస్తుతానికి 'రూపకల్పన, అభివృద్ధి' దశలో ఉంది]
(ఎ) తేజస్
(బి) డార్నియర్ 
(సి) బేసిస్ జెట్
(డి) అమ్కా

8. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'భారత్ లో తయారీ' (MAKE IN INDIA) పథకం కింద నిర్మిస్తున్న అయిదు 'ఓపీవీ' (OPV) (సముద్ర గస్తీ నౌక) లలో "సార్థక్" (SARTHAK) ఎన్నోది ? [ఈ సముద్ర గస్తీ నౌక (సార్థక్) ను 'గోవా షిప్ యార్డ్' లో నిర్మించారు]  
(ఎ) 1 
(బి) 2 
(సి) 3
(డి) 4 

9. ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా 299వ టెస్ట్ ఆటగాడిగా బరిలోకి దిగిన పేస్ బౌలర్ ?
(ఎ) నటరాజన్
(బి) నవ్ దీప్ సైని
(సి) శార్దూల్ ఠాకూర్ 
(డి) మహమ్మద్ సిరాజ్ 



10. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారి 'ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్' (ICC Test Rankings) లో నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. గత పదేళ్లలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఎన్నో జట్టుగా 'న్యూజీలాండ్' నిలిచింది ? [ఆస్ట్రేలియా కన్నా రెండు ఎక్కువ పాయింట్ల (118) తో 'కివీస్' (న్యూజీలాండ్) తొలి స్థానంలో ఉండగా .. భారత్ 114 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది]  
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8             

కీ (KEY) (GK TEST-2 DATE : 2021 JANUARY 15)
1) సి   2) సి   3) బి   4) సి   5) బి   6) సి   7) డి   8) డి   9) బి   10) బి 

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి