ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, జనవరి 2021, సోమవారం

GK TEST-3 DATE : 2021 JANUARY 25

1. గువాహటి హైకోర్టు నుంచి వెలువడే 'ద్వైవార్షిక వార్తా బులెటిన్' (Biannual News Bulletin) ?   
(ఎ) బంధన్ 
(బి) నౌ కాస్ట్  
(సి) ఆత్మన్  
(డి) నిమిట్జ్ 

2. భారతదేశ నూతన పార్లమెంటు భవన సముదాయ నిర్మాణానికి సంబంధించిన 'సెంట్రల్ విస్టా' (CENTRAL VISTA) ప్రాజెక్ట్ లో భాగమైన 'రాజ్ పథ్' (RAJPATH) పునర్నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను దక్కించుకున్న సంస్థ ? 
(ఎ) షాపూర్జీ పల్లోంజీ 
(బి) ఐటీడీ సెమెంటేషన్ ఇండియా లిమిటెడ్  
(సి) టాటా ప్రాజెక్ట్స్  
(డి) ఎన్ సీ సీ లిమిటెడ్ 

3. పౌర సేవల్లోని "ఒకే దేశం - ఒకే కార్డు, సులభతర వాణిజ్యం, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్ సంస్కరణలు" లో మొదటి మూడింటిని పూర్తి చేసినందుకుగాను ఏయే రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక శాఖ రూ. 1,004 కోట్ల రివార్డ్ (అదనపు సహాయం) ను ప్రకటించింది ? [ఇందులో ఆంధ్రప్రదేశ్ కు రూ. 344 కోట్లు విడుదలయ్యాయి] 
(ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  
(బి) కేరళ, ఆంధ్రప్రదేశ్ 
(సి) మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 
(డి) గుజరాత్, ఆంధ్రప్రదేశ్ 



4. నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన 'జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి' (జస్టిస్ జేకే మహేశ్వరి) ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు ?   
(ఎ) సిక్కిం 
(బి) అసోం 
(సి) దిల్లీ 
(డి) తెలంగాణ 

5. 'ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి' (APPCB) చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ? 
(ఎ) నీలం సాహ్ని   
(బి) ఏకే పరీడా  
(సి) ఎల్.వి.సుబ్రహ్మణ్యం  
(డి) జయప్రకాష్ నారాయణ్ 

6. ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏర్పాటు చేసిన 'ప్రత్యేక దర్యాప్తు బృందం' (SIT) నకు నేతృత్వం వహిస్తున్న 'ఏసీబీ' (ACB) అదనపు డైరెక్టర్ ? [15 మంది సభ్యులు గల ఈ బృందం 2020 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన విగ్రహాల ధ్వంసం, దేవాలయాల్లో దుశ్చర్యల ఘటనలపై దర్యాప్తు చేస్తుంది]
(ఎ) డాక్టర్ విజయ్ కుమార్ 
(బి) రవీంద్రనాథ్ బాబు 
(సి) రాహుల్ శర్మ 
(డి) జీవీజీ అశోక్ కుమార్ 



7. ఏయే దేశాల మధ్య ఈ ఏడాదితో 'దౌత్య సంబంధాలకు 70 వసంతాలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి 20 ఏళ్లు ' పూర్తవుతాయి ? 
(ఎ) భారత్ - అమెరికా 
(బి) భారత్ - ఫ్రాన్స్ 
(సి) భారత్ - బ్రిటన్ 
(డి) భారత్ - జర్మనీ 

8. కొవిడ్-19 టీకాకు సంబంధించి రెండు డోసులను పొందాల్సి ఉంటుంది. ఈ రెండు డోసుల మధ్య ఉండే విరామం ? [రెండో డోసు పొందిన 14 రోజుల తర్వాతే వ్యాక్సిన్ రక్షణ మొదలవుతుంది]  
(ఎ) 7 రోజులు  
(బి) 14 రోజులు  
(సి) 21 రోజులు 
(డి) 28 రోజులు  

9. వ్యవసాయ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాలపై రైతుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఉభయులతో సంప్రదింపులు జరిపేందుకు సుప్రీంకోర్టు 2021 జనవరి 12న నియమించిన నలుగురు సభ్యుల కమిటీలో గతంలో 'వ్యవసాయ ధరల కమిషన్' చైర్మన్ గా పనిచేసిన 'భారత ఆర్ధిక పరిశోధన సంస్థ' (ICRIER) ఆచార్యుడు ? [అనేక ఆహార ధాన్యాల మద్దతు ధర పెంచటానికి ఈయనే మూలకారకుడని చెబుతారు]
(ఎ) అనిల్ ఘన్వాట్  
(బి) అశోక్ గులాటి 
(సి) భూపీందర్ సింగ్ మాన్  
(డి) ప్రమోద్ కుమార్ జోషి  



10. "శేత్కరీ సంగఠన్" అనే పేరుతో రైతులకు సంబంధించిన సంఘం ఏ రాష్ట్రంలో ఉంది ?  
(ఎ) ఉత్తరాఖండ్ 
(బి) మహారాష్ట్ర 
(సి) పంజాబ్ 
(డి) హరియాణా              

కీ (KEY) (GK TEST-3 DATE : 2021 JANUARY 25)
1) సి    2) ఎ    3) సి    4) ఎ    5) బి    6) డి    7) డి    8) డి    9) బి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి