1. ఝార్ఖండ్ కు చెందిన 'కొర్వా' గిరిజన తెగ ప్రజలు మాట్లాడే భాషకు నిఘంటువు తయారు చేసిన వ్యక్తి ? (ఈ నిఘంటువు తయారీకి 12 ఏళ్లు పట్టింది)
E & OE (Errors & Omissions Expected)
(ఎ) ఎన్ కే హేమలత
(బి) హీరామాన్
(సి) టి.శ్రీనివాసాచార్య స్వామీజీ
(డి) ప్రదీప్ సంగ్వాన్
2. డ్రైవింగ్ లైసైన్సు, ఆర్ సీ, ఇతర పర్మిట్లకు సంబంధించిన వాహన దస్తావేజుల గడువును కేంద్ర ప్రభుత్వం ఏ తేదీ వరకు పొడిగించింది ? (ఫిబ్రవరి 1 నుంచి కాలం చెల్లిన అన్ని పత్రాలకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది)
(ఎ) 2020 డిసెంబర్ 31
(బి) 2021 జనవరి 31
(సి) 2021 మార్చి 31
(డి) 2021 ఏప్రిల్ 30
3. ఇటలీలో తొలి కరోనా కేసు బయటపడిన ప్రాంతం ? (2020 జనవరిలో చైనా నుంచి వచ్చిన దంపతులకు ఇక్కడే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అనంతరం ఐరోపాలో కరోనా వ్యాప్తికి ఈ ప్రాంతమే కేంద్రబిందువైంది. అందువల్ల కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా 2020 డిసెంబర్ 27న ఈ ప్రాంతంనుంచే ప్రారంభించారు)
(ఎ) స్పాలాంజని
(బి) పోర్టోఫినో
(సి) మతేర
(డి) పియెట్రాసాంటా
4. 2020 డిసెంబర్ 17న 'భారత అంతరిక్ష పరిశోధన సంస్థ' (ISRO) విజయవంతంగా ప్రయోగించిన 'పీ ఎస్ ఎల్ వీ - సీ 50' (PSLV - C50) వాహకనౌక ద్వారా 'జియో స్టేషనరీ ఆర్బిట్' లో ప్రవేశపెట్టబడిన కమ్యూనికేషన్ ఉపగ్రహం ?
(ఎ) జీశాట్ - 12
(బి) ఆనంద్
(సి) యూనివ్ శాట్
(డి) సీఎంఎస్ - 01
5. 2020 డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "బీసీ సంక్రాతి" పేరుతో 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిన ప్రాంతం ?
(ఎ) తిరుపతి
(బి) విజయవాడ
(సి) ఏలూరు
(డి) విశాఖపట్నం
6. 'మిషన్ బిల్డ్ ఏపీ' (Mission Build AP) పథకం ద్వారా విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లోని 9 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల ఈ-వేలం యత్నంపై దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ న్యాయమూర్తిపై పిటిషన్ దాఖలు చేసింది ?
(ఎ) జస్టిస్ జె.కె.మహేశ్వరి
(బి) జస్టిస్ బట్టు దేవానంద్
(సి) జస్టిస్ రాకేశ్ కుమార్
(డి) జస్టిస్ ప్రవీణ్ కుమార్
7. భారత క్రీడామంత్రిత్వ శాఖ 'యోగాసనం' (YOGASANAM) ను పోటీ పడగల క్రీడగా లాంఛనంగా గుర్తించిన తేదీ ? (దీనివల్ల 'యోగాసనం' అధికారికంగా క్రీడ అవుతుంది. ప్రభుత్వ నిధులు కూడా అందుతాయి)
(ఎ) 2020 డిసెంబర్ 15
(బి) 2020 డిసెంబర్ 16
(సి) 2020 డిసెంబర్ 17
(డి) 2020 డిసెంబర్ 18
8. వచ్చే రెండు ఒలింపిక్స్, వచ్చే రెండేళ్లలో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో తన పేరు, జెండాను వాడకుండా ఆర్బిట్రేషన్ కోర్టుచే నిషేధం విధించబడిన దేశం ? (పతకాల కోసం ఆ దేశ ప్రభుత్వం తమ ఆటగాళ్లను డోపింగ్ కు ప్రోత్సహించిందన్న అభియోగాలు రుజువు కావడంతో ఈ శిక్షను విధించడం జరిగింది. కానీ ఆ దేశ అథ్లెట్లు ఒలింపిక్స్ తో పాటు రెండేళ్లలో జరిగే అన్ని ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో పోటీపడొచ్చు)
(ఎ) అమెరికా
(బి) రష్యా
(సి) చైనా
(డి) ఇజ్రాయెల్
9. డేనైట్ క్రికెట్ మ్యాచ్ లలో ఉపయోగించే బంతి ?
(ఎ) తెల్ల బంతి
(బి) ఎర్ర బంతి
(సి) గులాబి బంతి
(డి) ఆకుపచ్చ బంతి
10. రోజుకు 10 కోట్ల లీటర్ల తాగునీరు ఉత్పత్తి లక్ష్యంతో, సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే "నిర్లవణీకరణ కేంద్రం" ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' గుజరాత్ లో వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన తేదీ ? (గుజరాత్ లోని 'కచ్' జిల్లా "మండవీ" లో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం ద్వారా 8 లక్షల మంది అవసరాలను తీర్చడానికి వీలవుతుంది)
(ఎ) 2020 డిసెంబర్ 15
(బి) 2020 డిసెంబర్ 16
(సి) 2020 డిసెంబర్ 17
(డి) 2020 డిసెంబర్ 18
కీ (KEY) (GK TEST-1 DATE : 2021 JANUARY 1)
1) బి 2) సి 3) ఎ 4) డి 5) బి 6) సి 7) సి 8) బి 9) ఎ 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి