1. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్ సైట్ ?
All the best by www.gkbitsintelugu.blogspot.com
(ఎ) www.ttdbalaji.ap.gov.in
(బి) www.tirumalabalaji.ap.gov.in
(సి) www.tirupatibalaji.ap.gov.in
(డి) www.tirumalatirupatibalaji.ap.gov.in
2. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 2020 డిసెంబర్ 12న విడుదల చేసిన 5వ 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20)' (NFHS ⇒ National Family Health Survey) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం కాన్పుల్లో 42.4% 'సిజేరియన్' ద్వారానే జరుగుతున్నాయి. గత అయిదేళ్లలో ఈ సంఖ్య ఎంత శాతం పెరిగింది ?
(ఎ) 2.1 %
(బి) 2.2 %
(సి) 2.3 %
(డి) 2.4 %
3. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 2020 డిసెంబర్ 12న విడుదల చేసిన 5వ 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20)' ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం సగటున ఒక్కొక్కరు ఎంత మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది ?
(ఎ) రూ. 3,100
(బి) రూ. 3,105
(సి) రూ. 3,110
(డి) రూ. 3,115
4. గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న "కాలిగిట్టల వ్యాధి" (TOE DISEASE) మనదేశంలో తొలుత కన్పించిన ప్రాంతం ? (శాస్త్రవేత్త డాక్టర్ రాణీ ప్రమీల నేతృత్వంలో తిరుపతిలోని 'శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం' లో ఈ వ్యాధికి టీకాను అభివృద్ధి చేసారు. ఈ టీకాలను 'ఐఐఎల్' (IIL ⇒ Indian Immunologicals Limited) తయారుచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురానుంది)
(ఎ) జమ్మూ & కాశ్మిర్
(బి) ఆంధ్రప్రదేశ్
(సి) కర్ణాటక
(డి) రాజస్థాన్
5. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయిన తేదీ ?
(ఎ) 2020 డిసెంబర్ 11
(బి) 2020 డిసెంబర్ 12
(సి) 2020 డిసెంబర్ 13
(డి) 2020 డిసెంబర్ 14
6. ప్రపంచంలోనే అత్యధికంగా పంచదారను ఉత్పత్తి చేస్తున్న దేశం ?
(ఎ) భారత్
(బి) బ్రెజిల్
(సి) మెక్సికో
(డి) చెక్ రిపబ్లిక్
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు' కార్యక్రమానికి 'పైలట్ ప్రాజెక్ట్' గా ఎంపికైన జిల్లా ?
(ఎ) వైఎస్సార్ కడప
(బి) పశ్చిమ గోదావరి
(సి) గుంటూరు
(డి) శ్రీకాకుళం
8. "ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్" (The Presidential Years) అనేది ఎవరి ఆత్మకథ ?
(ఎ) ప్రణబ్ ముఖర్జీ
(బి) బరాక్ ఒబామా
(సి) అబ్దుల్ కలాం
(డి) డొనాల్డ్ ట్రంప్
9. అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక "అర్టెమిస్" (ARTEMIS) మిషన్ కోసం 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. ఇందులో భారతీయ అమెరికన్ అయిన 'రాజా జాన్ ఫుర్పుతూర్ చారి' (రాజా చారి) కూడా ఉన్నారు. వీరు జాబిల్లిని చేరుకునే సంవత్సరం ? (సగం మంది మహిళలే ఉన్న ఈ బృందంలో ఈ మిషన్ ద్వారా తొలిసారిగా మహిళ చంద్రుడిపై కాలు మోపనుంది)
(ఎ) 2022
(బి) 2023
(సి) 2024
(డి) 2025
10. 'మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే రాజ్ భవన్ లో ఫిడేల్ వాయించుకుంటూ ఉండబోను' అని వ్యాఖ్యానించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ? (2020 డిసెంబర్ 10న 'భాజపా' (BJP) జాతీయ అధ్యక్షుడు 'జేపీ నడ్డా' వాహనశ్రేణిపై దాడి అనంతరం పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించిన సందర్భంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేసారు)
(ఎ) జగ్ దీప్ ధన్కర్
(బి) వి.పి.సింగ్ బద్నోరే
(సి) సత్యదేవ్ నారాయణ్ ఆర్య
(డి) ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
కీ (GK TEST-85 DATE : 2020 DECEMBER 18)
1) సి 2) సి 3) బి 4) ఎ 5) డి 6) బి 7) డి 8) ఎ 9) సి 10) ఎ All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి