1. భారత 'స్పైసెస్ కింగ్' (SPICE KING) గా సుపరిచితులైన 'ఎండీహెచ్' (Mahashian Di Hatti) మసాలా యజమాని "మహషాయ్ ధరమ్ పాల్ గులాటి" 2020 డిసెంబర్ 3న మరణించారు. ఇతని జన్మస్థలం ? ('ఎండీహెచ్' దాదాజీగా ప్రాచుర్యం పొందిన 'మహషాయ్ ధరమ్ పాల్ గులాటి' 94 ఏళ్ల వయసులో మనదేశంలోని 'ఎఫ్ ఎం సీ జీ' (FMCG ⇒ Fast-Moving Consumer Goods) రంగంలో అత్యధిక వేతనం (రూ. 25 కోట్లు) అందుకున్న 'సీఈఓ' (CEO ⇒ Chief Executive Officer) గా నిలిచారు)
All the best by www.gkbitsintelugu.blogspot.com
(ఎ) లాహోర్
(బి) రావల్పిండి
(సి) ముల్తాన్
(డి) సియాల్ కోట్
2. రెండేళ్లుగా బ్యాంక్ ఆన్ లైన్ సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో 'సరికొత్త డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఆవిష్కరించకుండా, కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా' ఏ ప్రైవేట్ రంగ బ్యాంక్ పై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ 'ఆర్బీఐ' (RBI) 2020 డిసెంబర్ 2న ఆదేశాలు జారీ చేసింది ?
(ఎ) హెచ్ డీ ఎఫ్ సి
(బి) ఐసిఐసిఐ
(సి) డీబీఎస్
(డి) లక్ష్మీ విలాస్ బ్యాంక్
3. 2020 సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల సంపదను పరిగణనలోకి తీసుకుని కోటక్ వెల్త్ - హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన 'కోటక్ వెల్త్ హురున్ - లీడింగ్ వెల్దీ విమెన్ 2020' (Kotak Wealth Hurun - Leading Wealthy Women 2020) నివేదిక ప్రకారం "రోష్నీ నాడార్ (రూ. 54,850 కోట్లు), కిరణ్ మజుందార్ షా (రూ. 36,600 కోట్లు), లీనా గాంధీ తివారి (రూ. 21,340 కోట్లు)" లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు వరుసగా ... ?
(ఎ) హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్, బయోకాన్, బయోలాజికల్ ఇ. లిమిటెడ్
(బి) హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్, బయోకాన్, యూ ఎస్ వీ
(సి) హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్, బయోకాన్, జోహో
(డి) హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్, బయోకాన్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్
4. విద్యుత్ డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు వెంటనే ఉత్పత్తి చేయడానికి వీలుగా .. 1350 మెగావాట్ల (9 X 150 MW) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల "పీ ఎస్ పీ" (PSP ⇒ Pumped Storage hydal Project) ను 'ఏపీజెన్కో' (APGENCO ⇒ Andhrapradesh Power Generation Corporation) మొదటగా ఏర్పాటు చేయనున్న ప్రాంతం ? (ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 10,444 కోట్ల అంచనాలతో 'సవివర ప్రాజెక్ట్ నివేదిక'ను 'వ్యాప్కోస్' (WAPCOS) రూపొందించింది)
(ఎ) ఎగువ సీలేరు
(బి) దిగువ సీలేరు
(సి) ఎగువ పెన్నా
(డి) మాచ్ ఖండ్
5. భారత తయారీ పరిశ్రమలో లాభాల వృద్ధికి ఉపకరించే విధివిధానాలను (ALGORITHMS) ఏ ఐఐటీ పరిశోధకులు రూపొందించారు ? (వీటివల్ల పరిశ్రమలు ఉత్పాదకతలో ఏటా రూ. కోటి లాభం పొందవచ్చు. మానవ వనరుల వినియోగంలో 400 గంటలు, డౌన్ టైమ్ లో 40 గంటలు, ఖర్చులో రూ. 8 లక్షల వరకూ తగ్గించుకోవచ్చు)
(ఎ) ఐఐటీ - మద్రాస్
(బి) ఐఐటీ - బాంబే
(సి) ఐఐటీ - కాన్పూర్
(డి) ఐఐటీ - ఖరగ్ పుర్
6. ఈ శతాబ్ది చివరకు భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలనే లక్ష్యంతో కుదిరిన "ప్యారిస్ ఒప్పందం" (The Paris Agreement) జరిగిన సంవత్సరం ?
(ఎ) 2013
(బి) 2014
(సి) 2015
(డి) 2016
7. అమెరికాలోని 'వాల్ స్ట్రీట్ స్టాక్ ఫ్యూచర్ మార్కెట్' (Wall Street Stock Future Market) లో అధికారికంగా "నీటి ట్రేడింగ్" (Water Trading) ను మొదలు పెట్టిన 'సీఎంఈ' గ్రూప్ (CME Group) ప్రధాన కార్యాలయం గల నగరం ? ('సీఎంఈ' (CME) కంపెనీ 'కాలిఫోర్నియా' లో నీటి సరఫరా కాంట్రాక్ట్ ను సంపాదించింది)
(ఎ) న్యూయార్క్
(బి) షికాగో
(సి) వాషింగ్టన్
(డి) హూస్టన్
8. 'బయో ఎన్ టెక్' (BioNTech SE) సంస్థతో కలిసి 'ఫైజర్' (Pfizer) రూపొందించిన 'కొవిడ్-19' వ్యాధి నిరోధక టీకా (బీ ఎన్ టీ 162 బీ 2) కు అమెరికా దేశ 'ఆహార ఔషధ నియంత్రణ సంస్థ' (FDA ⇒ Food and Drug Administration) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. 'బయో ఎన్ టెక్' (BioNTech SE) సంస్థది ఏ దేశం ?
(ఎ) అమెరికా
(బి) రష్యా
(సి) జర్మనీ
(డి) స్విట్జర్లాండ్
9. ఐక్యరాజ్యసమితికి చెందిన "అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి" (IFAD ⇒ International Fund for Agricultural Development) లో డిజిటల్ విభాగానికి 'సీనియర్ సాంకేతిక నిపుణుడు' గా భారత ప్రభుత్వం నియమించిన 'భారత వ్యవసాయ పరిశోధన మండలి' (ICAR ⇒ Indian Council of Agricultural Research) ప్రధాన శాస్త్రవేత్త ? (కృష్ణా జిల్లాలోని 'నందిగామ' వీరి స్వస్థలం)
(ఎ) కృతి కుమారి
(బి) డాక్టర్ వివేక్ మూర్తి
(సి) రాజా చారి
(డి) డాక్టర్ షేక్ ఎన్. మీరా
10. 'ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్' సంస్థ రూపొందించిన "గ్లోబల్ కరప్షన్ బారోమీటర్ - ఆసియా" (Global Corruption Barometer : Asia 2020) నివేదిక ప్రకారం తొలి మూడు స్థానాలలో ఉన్న దేశాలు వరుసగా ... ?
(ఎ) కంబోడియా, ఇండోనేషియా, భారత్
(బి) ఇండోనేషియా, భారత్, కంబోడియా
(సి) భారత్, కంబోడియా, ఇండోనేషియా
(డి) భారత్, ఇండోనేషియా, కంబోడియా
కీ (GK TEST-84 DATE : 2020 DECEMBER 16)
1) డి 2) ఎ 3) బి 4) ఎ 5) డి 6) సి 7) బి 8) సి 9) డి 10) సి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి