ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, డిసెంబర్ 2020, బుధవారం

GK TEST-83

1. చక్రవర్తుల బియ్యం (EMPEROR RICE) గా పేరొందిన బియ్యం ? (మనిషి శరీరంలో క్యాన్సర్ గడ్డలు, రొమ్ము క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఈ బియ్యం అడ్డుకుంటున్నట్లు చైనాలోని 'థర్డ్ మిలిటరీ చైనా విశ్వవిద్యాలయం' శాస్త్రవేత్తలు గుర్తించారు)   
(ఎ) తెల్ల బియ్యం 
(బి) నల్ల బియ్యం  
(సి) బ్రౌన్ బియ్యం  
(డి) ఎరుపు బియ్యం  

2. 2019-20కి ప్రతీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4.68 రేటింగ్ ఉంటేనే అత్యుత్తమ ప్రమాణమని 'ఏసీఐ' (AIRPORT COUNCIL INTERNATIONAL) నిర్ణయించింది. ప్రతి మూఢు నెలలకోసారి విడుదలయ్యే 'ఏసీఐ' (ACI) రేటింగ్ ల్లో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి 4.97 రేటింగ్ తో మనదేశంలో తొలి ర్యాంక్, అంతర్జాతీయంగా 21వ ర్యాంక్ సాధించిన విమానాశ్రయం ?  
(ఎ) హైదరాబాద్ 
(బి) విశాఖపట్నం  
(సి) చెన్నై  
(డి) వారణాసి 

3. 2020 డిసెంబర్ 7న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చైర్మన్ 'వై.వీ.సుబ్బారెడ్డి', రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి 'వెలంపల్లి శ్రీనివాస్' తో కలిసి "గుడికో గోమాత" (Gudiko Gomatha) కార్యక్రమాన్ని ఏ దేవస్థానంలో లాంఛనంగా ప్రారంభించారు ? (తితిదే, హిందూ ధర్మ ప్రచార పరిషత్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి) 
(ఎ) వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం - అన్నవరం  
(బి) శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం - సింహాచలం 
(సి) శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం - శ్రీకాళహస్తి 
(డి) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం - విజయవాడ 



4. టెండర్ల ఖరారుకు ముందు నిబంధనలు సక్రమంగా ఉన్నాయా ? లేదా ? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం-2019" తీసుకొచ్చిన తేదీ ?  
(ఎ) 2019 ఆగస్ట్ 15 
(బి) 2019 ఆగస్ట్ 20 
(సి) 2019 ఆగస్ట్ 25 
(డి) 2019 ఆగస్ట్ 30 

5. 'సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ' (CMFRI ⇒ Central Marine Fisheries Research Institute) శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన "అప్పలు" (స్నాపర్) చేపల వంగడాలను 2020 డిసెంబర్ 7న జాతికి అంకితం చేసినది ?   
(ఎ) రామ్ నాథ్ కోవింద్   
(బి) ఎం.వెంకయ్య నాయుడు  
(సి) నరేంద్ర మోదీ   
(డి) రాజ్ నాథ్ సింగ్ 

6. ప్రపంచ అథ్లెటిక్స్ లో పతకం గెలిచిన భారత ఏకైక అథ్లెట్ ? (ఈమెకు పుట్టుక నుంచి ఒక్కటే కిడ్నీ ఉంది) 
(ఎ) అంజూ బాబీ జార్జ్  
(బి) సీమా పునియా  
(సి) హిమ దాస్ 
(డి) దీపా మలిక్  



7. ప్రస్తుత పరిస్థితుల్లో అంకుర సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, నిధుల సమీకరణ, వ్యాపారాభివృద్ధికి అవసరమైన వ్యూహాలు, కొత్త అంకుర ఆలోచనలు ఇలా అనేక అంశాలపై దాదాపు 60 గంటలపాటు చర్చ జరిగే " టై ప్రపంచస్థాయి సదస్సు" (TiE GLOBAL SUMMIT 2020) ను భారత ఉప రాష్ట్రపతి 'ఎం.వెంకయ్య నాయుడు' దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించిన తేదీ ?  
(ఎ) 2020 డిసెంబర్ 5 
(బి) 2020 డిసెంబర్ 6
(సి) 2020 డిసెంబర్ 7 
(డి) 2020 డిసెంబర్ 8 

8. ద్రవ్య లభ్యత సంక్షోభం కారణంగా 'జెట్ ఎయిర్ వేస్' (Jet Airways) కార్యకలాపాలు నిలిచిపోయిన తేదీ ? (జెట్ ఎయిర్ వేస్ పునరుజ్జీవానికి సంబంధించిన బిడ్ ను యూఏఈ (UAE) కి చెందిన 'మురళీ లాల్ జలాన్', లండన్ కు చెందిన 'కల్రాక్ క్యాపిటల్' ల కన్సార్టియం గెలుచుకుంది)  
(ఎ) 2019 ఏప్రిల్ 15  
(బి) 2019 ఏప్రిల్ 16  
(సి) 2019 ఏప్రిల్ 17 
(డి) 2019 ఏప్రిల్ 18  

9. కాఫీ ఉత్పత్తుల విక్రయాల్లో పేరొందిన 'కాఫీ డే ఎంటర్ ఫ్రైజెస్ లిమిటెడ్' (CDEL) నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) ? (ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా 'కెఫె కాఫీ డే' (CAFE COFFEE DAY) ఔట్ లెట్ల (Outlets) ను ఈ సంస్థ నిర్వహిస్తోంది) 
(ఎ) మాళవిక హెగ్డే 
(బి) సీ.హెచ్.వసుంధరా దేవి 
(సి) గిరి దేవనూర్  
(డి) మోహన్ రాఘవేంద్ర  



10. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ప్రముఖ పంజాబ్ కవి "సుర్జిత్ పతార్" తనకు బహూకరించిన పౌర పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పురస్కారం పేరు ?  
(ఎ) పద్మ విభూషణ్ 
(బి) పద్మ భూషణ్ 
(సి) పద్మశ్రీ  
(డి) భారత రత్న              

కీ (GK TEST-83 DATE : 2020 DECEMBER 9)
1) బి   2) డి   3) డి   4) బి   5) బి   6) ఎ   7) డి   8) సి   9) ఎ   10) సి  

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి