ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, డిసెంబర్ 2020, శనివారం

GK TEST-86

1. తపాలా శాఖ, 'ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్' (IPPB) ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలను నిర్వహించుకునేందుకు వీలుగా "డాక్ పే" (DAK PAY) యాప్ ను కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖా మంత్రి 'రవిశంకర్ ప్రసాద్' ఆవిష్కరించిన తేదీ ? (నగదు పంపడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్, వ్యాపారులకు చేసే చెల్లింపులు వంటి సేవలను ఖాతాదారులు డిజిటల్ గా పూర్తి చేయవచ్చు)    
(ఎ) 2020 డిసెంబర్ 15 
(బి) 2020 డిసెంబర్ 16  
(సి) 2020 డిసెంబర్ 17  
(డి) 2020 డిసెంబర్ 18 

2. 2020 డిసెంబర్ 14న జరిగిన అమెరికా ఎలెక్టోరల్ కాలేజీ వోటింగ్ లో కాబోయే అధ్యక్షుడు "జో బైడెన్", ప్రస్తుత అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' లకు వచ్చిన ఓట్లు వరుసగా ... ? (ఈ ఓట్లను అమెరికా చట్ట సభ 'కాంగ్రెస్' కు పంపిస్తారు. వచ్చే నెలలో అక్కడ వాటిని అధికారికంగా లెక్కిస్తారు) 
(ఎ) 305, 233 
(బి) 306, 232  
(సి) 307, 231  
(డి) 308, 230 

3. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న వ్యక్తి ?  
(ఎ) బోరిస్ జాన్సన్   
(బి) షేక్ హసీనా 
(సి) ఏంజెలా మెర్కెల్ 
(డి) బెంజమిన్ నెతన్యాహు 



4. నూతనంగా ఏర్పాటైన "డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం" గల జిల్లా ? 
(ఎ) పశ్చిమ గోదావరి  
(బి) విజయనగరం  
(సి) వైఎస్సార్ కడప 
(డి) అనంతపురం 

5. 'శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం'-తిరుపతి పరిధిలోని విజయనగరం జిల్లా "గరివిడి" (GARIVIDI) లో రూ. 91.25 కోట్లతో నిర్మించిన పశువైద్య కళాశాలలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు అనుమతి లభించింది. మిగతా పశువైద్య కళాశాలల్లో ఉన్నట్లుగానే ఈ కళాశాలలో ఉండే మొత్తం సీట్లు ? (ప్రస్తుతం రాష్ట్రంలో 'తిరుపతి (చిత్తూరు జిల్లా), గన్నవరం (కృష్ణా జిల్లా), ప్రొద్దుటూరు (వైఎస్సార్ కడప)' లలో పశువైద్య కళాశాలలు ఉన్నాయి) 
(ఎ) 80   
(బి) 81  
(సి) 82  
(డి) 83 

6. 'ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ' (APEPDCL) విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు చేయవలసిన టోల్ ఫ్రీ నంబర్ ?
(ఎ) 1902 
(బి) 1912 
(సి) 1942 
(డి) 1907 



7. మనదేశంలో రూ. 1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన రెండో ఫార్మా కంపెనీ మరియు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయికి చేరిన తొలి సంస్థ ? (దేశం మొత్తమ్మీద మొదటి స్థానంలో 'సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' ఉంది) 
(ఎ) డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 
(బి) దివీస్ లేబొరేటరీస్ 
(సి) హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ 
(డి) అరబిందో ఫార్మా లిమిటెడ్ 

8. ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ ప్రాజెక్ట్ అయిన "హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్" (Hybrid Renewable Energy Park) ను గుజరాత్ లో నెలకొల్పనున్న 'విఘాకోట్' గ్రామం గల జిల్లా ? (ఈ ప్రాజెక్ట్ ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 డిసెంబర్ 15న వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసారు. 72,600 హెక్టార్ల భూమిలో సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నారు)  
(ఎ) సూరత్  
(బి) ఆనంద్  
(సి) అహ్మదాబాద్ 
(డి) కచ్  

9. భారత పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నేత ?
(ఎ) గులాం నబీ ఆజాద్ 
(బి) జైరామ్ రమేష్ 
(సి) మల్లికార్జున ఖర్గే  
(డి) అధీర్ రంజన్ చౌదరి  



10. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2020-21) రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ. 974 (19480%) ను మధ్యంతర డివిడెండుగా చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఆ కంపెనీ పేరు ? 
(ఎ) బైనరీ రిపబ్లిక్ 
(బి) మేజేస్కో లిమిటెడ్ 
(సి) విజువల్ బై సొల్యూషన్స్ 
(డి) తుడిప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్              

కీ (GK TEST-86 DATE : 2020 DECEMBER 19)
1) ఎ   2) బి   3) ఎ   4) సి   5) సి   6) బి   7) బి   8) డి   9) డి   10) బి  

All the best by www.gkbitsintelugu.blogspot.com 

18, డిసెంబర్ 2020, శుక్రవారం

GK TEST-85

1. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్ సైట్ ? 
(ఎ) www.ttdbalaji.ap.gov.in  
(బి) www.tirumalabalaji.ap.gov.in  
(సి) www.tirupatibalaji.ap.gov.in  
(డి) www.tirumalatirupatibalaji.ap.gov.in 

2. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 2020 డిసెంబర్ 12న విడుదల చేసిన 5వ 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20)' (NFHS ⇒ National Family Health Survey) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం కాన్పుల్లో 42.4% 'సిజేరియన్' ద్వారానే జరుగుతున్నాయి. గత అయిదేళ్లలో ఈ సంఖ్య ఎంత శాతం పెరిగింది ? 
(ఎ) 2.1 % 
(బి) 2.2 %  
(సి) 2.3 %  
(డి) 2.4 % 

3. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 2020 డిసెంబర్ 12న విడుదల చేసిన 5వ 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20)' ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం సగటున ఒక్కొక్కరు ఎంత మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది ? 
(ఎ) రూ. 3,100  
(బి) రూ. 3,105 
(సి) రూ. 3,110 
(డి) రూ. 3,115 



4. గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న "కాలిగిట్టల వ్యాధి" (TOE DISEASE) మనదేశంలో తొలుత కన్పించిన ప్రాంతం ? (శాస్త్రవేత్త డాక్టర్ రాణీ ప్రమీల నేతృత్వంలో తిరుపతిలోని 'శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం' లో ఈ వ్యాధికి టీకాను అభివృద్ధి చేసారు. ఈ టీకాలను 'ఐఐఎల్' (IIL ⇒ Indian Immunologicals Limited) తయారుచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురానుంది) 
(ఎ) జమ్మూ & కాశ్మిర్ 
(బి) ఆంధ్రప్రదేశ్ 
(సి) కర్ణాటక 
(డి) రాజస్థాన్ 

5. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయిన తేదీ ? 
(ఎ) 2020 డిసెంబర్ 11   
(బి) 2020 డిసెంబర్ 12  
(సి) 2020 డిసెంబర్ 13  
(డి) 2020 డిసెంబర్ 14 

6. ప్రపంచంలోనే అత్యధికంగా పంచదారను ఉత్పత్తి చేస్తున్న దేశం ?
(ఎ) భారత్ 
(బి) బ్రెజిల్ 
(సి) మెక్సికో  
(డి) చెక్ రిపబ్లిక్ 



7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు' కార్యక్రమానికి 'పైలట్ ప్రాజెక్ట్' గా ఎంపికైన జిల్లా ? 
(ఎ) వైఎస్సార్ కడప 
(బి) పశ్చిమ గోదావరి 
(సి) గుంటూరు 
(డి) శ్రీకాకుళం 

8. "ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్" (The Presidential Years) అనేది ఎవరి ఆత్మకథ ?  
(ఎ) ప్రణబ్ ముఖర్జీ  
(బి) బరాక్ ఒబామా  
(సి) అబ్దుల్ కలాం 
(డి) డొనాల్డ్ ట్రంప్   

9. అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక "అర్టెమిస్" (ARTEMIS) మిషన్ కోసం 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. ఇందులో భారతీయ అమెరికన్ అయిన 'రాజా జాన్ ఫుర్పుతూర్ చారి' (రాజా చారి) కూడా ఉన్నారు. వీరు జాబిల్లిని చేరుకునే సంవత్సరం ? (సగం మంది మహిళలే ఉన్న ఈ బృందంలో ఈ మిషన్ ద్వారా తొలిసారిగా మహిళ చంద్రుడిపై కాలు మోపనుంది)
(ఎ) 2022 
(బి) 2023 
(సి) 2024 
(డి) 2025  



10. 'మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే రాజ్ భవన్ లో ఫిడేల్ వాయించుకుంటూ ఉండబోను' అని వ్యాఖ్యానించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ? (2020 డిసెంబర్ 10న 'భాజపా' (BJP) జాతీయ అధ్యక్షుడు 'జేపీ నడ్డా' వాహనశ్రేణిపై దాడి అనంతరం పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించిన సందర్భంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేసారు) 
(ఎ) జగ్ దీప్ ధన్కర్  
(బి) వి.పి.సింగ్ బద్నోరే  
(సి) సత్యదేవ్ నారాయణ్ ఆర్య 
(డి) ఆరిఫ్ మహమ్మద్ ఖాన్              

కీ (GK TEST-85 DATE : 2020 DECEMBER 18)
1) సి   2) సి   3) బి   4) ఎ   5) డి   6) బి   7) డి   8) ఎ   9) సి   10) ఎ   

All the best by www.gkbitsintelugu.blogspot.com 

16, డిసెంబర్ 2020, బుధవారం

GK TEST-84

1. భారత 'స్పైసెస్ కింగ్' (SPICE KING) గా సుపరిచితులైన 'ఎండీహెచ్' (Mahashian Di Hatti) మసాలా యజమాని "మహషాయ్  ధరమ్ పాల్ గులాటి" 2020 డిసెంబర్ 3న మరణించారు. ఇతని జన్మస్థలం ? ('ఎండీహెచ్' దాదాజీగా ప్రాచుర్యం పొందిన 'మహషాయ్  ధరమ్ పాల్ గులాటి' 94 ఏళ్ల వయసులో మనదేశంలోని 'ఎఫ్ ఎం సీ జీ' (FMCG ⇒ Fast-Moving Consumer Goods) రంగంలో అత్యధిక వేతనం (రూ. 25 కోట్లు) అందుకున్న 'సీఈఓ' (CEO ⇒ Chief Executive Officer) గా నిలిచారు)  
(ఎ) లాహోర్  
(బి) రావల్పిండి  
(సి) ముల్తాన్  
(డి) సియాల్ కోట్  

2. రెండేళ్లుగా బ్యాంక్ ఆన్ లైన్ సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో 'సరికొత్త డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఆవిష్కరించకుండా, కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా' ఏ ప్రైవేట్ రంగ బ్యాంక్ పై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ 'ఆర్బీఐ' (RBI) 2020 డిసెంబర్ 2న ఆదేశాలు జారీ చేసింది ?  
(ఎ) హెచ్ డీ ఎఫ్ సి 
(బి) ఐసిఐసిఐ  
(సి) డీబీఎస్  
(డి) లక్ష్మీ విలాస్ బ్యాంక్ 

3. 2020 సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల సంపదను పరిగణనలోకి తీసుకుని కోటక్ వెల్త్ - హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన 'కోటక్ వెల్త్ హురున్ - లీడింగ్ వెల్దీ విమెన్ 2020' (Kotak Wealth Hurun - Leading Wealthy Women 2020) నివేదిక ప్రకారం "రోష్నీ నాడార్ (రూ. 54,850 కోట్లు), కిరణ్ మజుందార్ షా (రూ. 36,600 కోట్లు), లీనా గాంధీ తివారి (రూ. 21,340 కోట్లు)" లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు వరుసగా ... ? 
(ఎ) హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్, బయోకాన్, బయోలాజికల్ ఇ. లిమిటెడ్     
(బి) హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్, బయోకాన్, యూ ఎస్ వీ    
(సి) హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్, బయోకాన్, జోహో 
(డి) హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్, బయోకాన్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ 



4. విద్యుత్ డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు వెంటనే ఉత్పత్తి చేయడానికి వీలుగా .. 1350 మెగావాట్ల (9 X 150 MW) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల "పీ ఎస్ పీ" (PSP ⇒ Pumped Storage hydal Project) ను 'ఏపీజెన్కో' (APGENCO ⇒ Andhrapradesh Power Generation Corporation) మొదటగా ఏర్పాటు చేయనున్న ప్రాంతం ? (ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 10,444 కోట్ల అంచనాలతో 'సవివర ప్రాజెక్ట్ నివేదిక'ను 'వ్యాప్కోస్' (WAPCOS) రూపొందించింది)   
(ఎ) ఎగువ సీలేరు 
(బి) దిగువ సీలేరు 
(సి) ఎగువ పెన్నా 
(డి) మాచ్ ఖండ్ 

5. భారత తయారీ పరిశ్రమలో లాభాల వృద్ధికి ఉపకరించే విధివిధానాలను (ALGORITHMS) ఏ ఐఐటీ పరిశోధకులు రూపొందించారు ? (వీటివల్ల పరిశ్రమలు ఉత్పాదకతలో ఏటా రూ. కోటి లాభం పొందవచ్చు. మానవ వనరుల వినియోగంలో 400 గంటలు, డౌన్ టైమ్ లో 40 గంటలు, ఖర్చులో రూ. 8 లక్షల వరకూ తగ్గించుకోవచ్చు)  
(ఎ) ఐఐటీ - మద్రాస్   
(బి) ఐఐటీ - బాంబే  
(సి) ఐఐటీ - కాన్పూర్  
(డి) ఐఐటీ - ఖరగ్ పుర్  

6. ఈ శతాబ్ది చివరకు భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలనే లక్ష్యంతో కుదిరిన "ప్యారిస్ ఒప్పందం" (The Paris Agreement) జరిగిన సంవత్సరం ? 
(ఎ) 2013 
(బి) 2014
(సి) 2015 
(డి) 2016 



7. అమెరికాలోని 'వాల్ స్ట్రీట్ స్టాక్ ఫ్యూచర్ మార్కెట్' (Wall Street Stock Future Market) లో అధికారికంగా "నీటి ట్రేడింగ్" (Water Trading) ను మొదలు పెట్టిన 'సీఎంఈ' గ్రూప్ (CME Group) ప్రధాన కార్యాలయం గల నగరం ? ('సీఎంఈ' (CME) కంపెనీ 'కాలిఫోర్నియా' లో నీటి సరఫరా కాంట్రాక్ట్ ను సంపాదించింది)  
(ఎ) న్యూయార్క్ 
(బి) షికాగో 
(సి) వాషింగ్టన్ 
(డి) హూస్టన్  

8. 'బయో ఎన్ టెక్' (BioNTech SE) సంస్థతో కలిసి 'ఫైజర్' (Pfizer) రూపొందించిన 'కొవిడ్-19' వ్యాధి నిరోధక టీకా (బీ ఎన్ టీ 162 బీ 2) కు అమెరికా దేశ 'ఆహార ఔషధ నియంత్రణ సంస్థ' (FDA ⇒ Food and Drug Administration) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. 'బయో ఎన్ టెక్' (BioNTech SE) సంస్థది ఏ దేశం ?    
(ఎ) అమెరికా  
(బి) రష్యా  
(సి) జర్మనీ 
(డి) స్విట్జర్లాండ్  

9. ఐక్యరాజ్యసమితికి చెందిన "అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి" (IFAD ⇒ International Fund for Agricultural Development) లో డిజిటల్ విభాగానికి 'సీనియర్ సాంకేతిక నిపుణుడు' గా భారత ప్రభుత్వం నియమించిన 'భారత వ్యవసాయ పరిశోధన మండలి' (ICAR ⇒ Indian Council of Agricultural Research) ప్రధాన శాస్త్రవేత్త ? (కృష్ణా జిల్లాలోని 'నందిగామ' వీరి స్వస్థలం)
(ఎ) కృతి కుమారి 
(బి) డాక్టర్ వివేక్ మూర్తి 
(సి) రాజా చారి   
(డి) డాక్టర్ షేక్ ఎన్. మీరా  



10. 'ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్' సంస్థ రూపొందించిన "గ్లోబల్ కరప్షన్ బారోమీటర్ - ఆసియా" (Global Corruption Barometer : Asia 2020) నివేదిక ప్రకారం తొలి మూడు స్థానాలలో ఉన్న దేశాలు వరుసగా ... ? 
(ఎ) కంబోడియా, ఇండోనేషియా, భారత్ 
(బి) ఇండోనేషియా, భారత్, కంబోడియా 
(సి) భారత్, కంబోడియా, ఇండోనేషియా 
(డి) భారత్, ఇండోనేషియా, కంబోడియా              

కీ (GK TEST-84 DATE : 2020 DECEMBER 16)
1) డి   2) ఎ   3) బి   4) ఎ   5) డి   6) సి   7) బి   8) సి   9) డి   10) సి  

All the best by www.gkbitsintelugu.blogspot.com 

Latest Gk and Current Affairs Bits in Telugu Language of the Year 2021

  1. GK TEST-1 DATE : 2021 JANUARY 1
  2. GK TEST-2 DATE : 2021 JANUARY 15
  3. GK TEST-3 DATE : 2021 JANUARY 25
  4. GK TEST-4 DATE : 2021 JANUARY 30
  5. GK TEST-5 DATE : 2021 FEBRUARY 1
  6. GK TEST-6 DATE : 2021 FEBRUARY 2
  7. GK TEST-7 DATE : 2021 FEBRUARY 3
  8. GK TEST-8 DATE : 2021 FEBRUARY 4
  9. GK TEST-9 DATE : 2021 FEBRUARY 5
  10. GK TEST-10 DATE : 2021 FEBRUARY 6
  11. GK TEST-11 DATE : 2021 FEBRUARY 7
  12. GK TEST-12 DATE : 2021 FEBRUARY 8
  13. GK TEST-13 DATE : 2021 FEBRUARY 9
  14. GK TEST-14 DATE : 2021 FEBRUARY 10
  15. GK TEST-15 DATE : 2021 FEBRUARY 11
  16. GK TEST-16 DATE : 2021 FEBRUARY 12
  17. GK TEST-17 DATE : 2021 FEBRUARY 13
  18. GK TEST-18 DATE : 2021 FEBRUARY 14
  19. GK TEST-19 DATE : 2021 FEBRUARY 15
  20. GK TEST-20 DATE : 2021 FEBRUARY 16
  21. GK TEST-21 DATE : 2021 FEBRUARY 17
  22. GK TEST-22 DATE : 2021 FEBRUARY 18
  23. GK TEST-23 DATE : 2021 FEBRUARY 19
  24. GK TEST-24 DATE : 2021 FEBRUARY 20
  25. GK TEST-25 DATE : 2021 FEBRUARY 21
  26. GK TEST-26 DATE : 2021 FEBRUARY 22
  27. GK TEST-27 DATE : 2021 FEBRUARY 23
  28. GK TEST-28 DATE : 2021 FEBRUARY 24
  29. GK TEST-29 DATE : 2021 FEBRUARY 25
  30. GK TEST-30 DATE : 2021 FEBRUARY 26
  31. GK TEST-31 DATE : 2021 FEBRUARY 27
  32. GK TEST-32 DATE : 2021 FEBRUARY 28
  33. GK TEST-33 DATE : 2021 MARCH 1
  34. GK TEST-34 DATE : 2021 MARCH 2
  35. GK TEST-35 DATE : 2021 MARCH 3
  36. GK TEST-36 DATE : 2021 MARCH 4
  37. GK TEST-37 DATE : 2021 MARCH 5
  38. GK TEST-38 DATE : 2021 MARCH 6
  39. GK TEST-39 DATE : 2021 MARCH 7
  40. GK TEST-40 DATE : 2021 MARCH 8
  41. GK TEST-41 YEAR : 2021
  42. GK TEST-42 YEAR : 2021
  43. GK TEST-43 YEAR : 2021
  44. GK TEST-44 YEAR : 2021
  45. GK TEST-45 YEAR : 2021
  46. GK TEST-46 YEAR : 2021
  47. GK TEST-47 YEAR : 2021
  48. GK TEST-48 YEAR : 2021
  49. GK TEST-49 YEAR : 2021
  50. GK TEST-50 YEAR : 2021
  51. GK TEST-51 YEAR : 2021
  52. GK TEST-52 YEAR : 2021
  53. GK TEST-53 YEAR : 2021
  54. GK TEST-54 YEAR : 2021
  55. GK TEST-55 YEAR : 2021
  56. GK TEST-56 YEAR : 2021
  57. GK TEST-57 YEAR : 2021
  58. GK TEST-58 YEAR : 2021
  59. GK TEST-59 YEAR : 2021
  60. GK TEST-60 YEAR : 2021
  61. GK TEST-61 YEAR : 2021
  62. GK TEST-62 YEAR : 2021
  63. GK TEST-63 YEAR : 2021
  64. GK TEST-64 YEAR : 2021
  65. GK TEST-65 YEAR : 2021
  66. GK TEST-66 YEAR : 2021
  67. GK TEST-67 YEAR : 2021
  68. GK TEST-68 YEAR : 2021
  69. GK TEST-69 YEAR : 2021
  70. GK TEST-70 YEAR : 2021
  71. GK TEST-71 YEAR : 2021
  72. GK TEST-72 YEAR : 2021
  73. GK TEST-73 YEAR : 2021

9, డిసెంబర్ 2020, బుధవారం

GK TEST-83

1. చక్రవర్తుల బియ్యం (EMPEROR RICE) గా పేరొందిన బియ్యం ? (మనిషి శరీరంలో క్యాన్సర్ గడ్డలు, రొమ్ము క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఈ బియ్యం అడ్డుకుంటున్నట్లు చైనాలోని 'థర్డ్ మిలిటరీ చైనా విశ్వవిద్యాలయం' శాస్త్రవేత్తలు గుర్తించారు)   
(ఎ) తెల్ల బియ్యం 
(బి) నల్ల బియ్యం  
(సి) బ్రౌన్ బియ్యం  
(డి) ఎరుపు బియ్యం  

2. 2019-20కి ప్రతీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4.68 రేటింగ్ ఉంటేనే అత్యుత్తమ ప్రమాణమని 'ఏసీఐ' (AIRPORT COUNCIL INTERNATIONAL) నిర్ణయించింది. ప్రతి మూఢు నెలలకోసారి విడుదలయ్యే 'ఏసీఐ' (ACI) రేటింగ్ ల్లో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి 4.97 రేటింగ్ తో మనదేశంలో తొలి ర్యాంక్, అంతర్జాతీయంగా 21వ ర్యాంక్ సాధించిన విమానాశ్రయం ?  
(ఎ) హైదరాబాద్ 
(బి) విశాఖపట్నం  
(సి) చెన్నై  
(డి) వారణాసి 

3. 2020 డిసెంబర్ 7న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చైర్మన్ 'వై.వీ.సుబ్బారెడ్డి', రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి 'వెలంపల్లి శ్రీనివాస్' తో కలిసి "గుడికో గోమాత" (Gudiko Gomatha) కార్యక్రమాన్ని ఏ దేవస్థానంలో లాంఛనంగా ప్రారంభించారు ? (తితిదే, హిందూ ధర్మ ప్రచార పరిషత్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి) 
(ఎ) వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం - అన్నవరం  
(బి) శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం - సింహాచలం 
(సి) శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం - శ్రీకాళహస్తి 
(డి) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం - విజయవాడ 



4. టెండర్ల ఖరారుకు ముందు నిబంధనలు సక్రమంగా ఉన్నాయా ? లేదా ? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం-2019" తీసుకొచ్చిన తేదీ ?  
(ఎ) 2019 ఆగస్ట్ 15 
(బి) 2019 ఆగస్ట్ 20 
(సి) 2019 ఆగస్ట్ 25 
(డి) 2019 ఆగస్ట్ 30 

5. 'సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ' (CMFRI ⇒ Central Marine Fisheries Research Institute) శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన "అప్పలు" (స్నాపర్) చేపల వంగడాలను 2020 డిసెంబర్ 7న జాతికి అంకితం చేసినది ?   
(ఎ) రామ్ నాథ్ కోవింద్   
(బి) ఎం.వెంకయ్య నాయుడు  
(సి) నరేంద్ర మోదీ   
(డి) రాజ్ నాథ్ సింగ్ 

6. ప్రపంచ అథ్లెటిక్స్ లో పతకం గెలిచిన భారత ఏకైక అథ్లెట్ ? (ఈమెకు పుట్టుక నుంచి ఒక్కటే కిడ్నీ ఉంది) 
(ఎ) అంజూ బాబీ జార్జ్  
(బి) సీమా పునియా  
(సి) హిమ దాస్ 
(డి) దీపా మలిక్  



7. ప్రస్తుత పరిస్థితుల్లో అంకుర సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, నిధుల సమీకరణ, వ్యాపారాభివృద్ధికి అవసరమైన వ్యూహాలు, కొత్త అంకుర ఆలోచనలు ఇలా అనేక అంశాలపై దాదాపు 60 గంటలపాటు చర్చ జరిగే " టై ప్రపంచస్థాయి సదస్సు" (TiE GLOBAL SUMMIT 2020) ను భారత ఉప రాష్ట్రపతి 'ఎం.వెంకయ్య నాయుడు' దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించిన తేదీ ?  
(ఎ) 2020 డిసెంబర్ 5 
(బి) 2020 డిసెంబర్ 6
(సి) 2020 డిసెంబర్ 7 
(డి) 2020 డిసెంబర్ 8 

8. ద్రవ్య లభ్యత సంక్షోభం కారణంగా 'జెట్ ఎయిర్ వేస్' (Jet Airways) కార్యకలాపాలు నిలిచిపోయిన తేదీ ? (జెట్ ఎయిర్ వేస్ పునరుజ్జీవానికి సంబంధించిన బిడ్ ను యూఏఈ (UAE) కి చెందిన 'మురళీ లాల్ జలాన్', లండన్ కు చెందిన 'కల్రాక్ క్యాపిటల్' ల కన్సార్టియం గెలుచుకుంది)  
(ఎ) 2019 ఏప్రిల్ 15  
(బి) 2019 ఏప్రిల్ 16  
(సి) 2019 ఏప్రిల్ 17 
(డి) 2019 ఏప్రిల్ 18  

9. కాఫీ ఉత్పత్తుల విక్రయాల్లో పేరొందిన 'కాఫీ డే ఎంటర్ ఫ్రైజెస్ లిమిటెడ్' (CDEL) నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) ? (ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా 'కెఫె కాఫీ డే' (CAFE COFFEE DAY) ఔట్ లెట్ల (Outlets) ను ఈ సంస్థ నిర్వహిస్తోంది) 
(ఎ) మాళవిక హెగ్డే 
(బి) సీ.హెచ్.వసుంధరా దేవి 
(సి) గిరి దేవనూర్  
(డి) మోహన్ రాఘవేంద్ర  



10. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ప్రముఖ పంజాబ్ కవి "సుర్జిత్ పతార్" తనకు బహూకరించిన పౌర పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పురస్కారం పేరు ?  
(ఎ) పద్మ విభూషణ్ 
(బి) పద్మ భూషణ్ 
(సి) పద్మశ్రీ  
(డి) భారత రత్న              

కీ (GK TEST-83 DATE : 2020 DECEMBER 9)
1) బి   2) డి   3) డి   4) బి   5) బి   6) ఎ   7) డి   8) సి   9) ఎ   10) సి  

All the best by www.gkbitsintelugu.blogspot.com