ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, ఏప్రిల్ 2020, సోమవారం

GK TEST-33

1. క్రింది వాటిలో ఒప్పు (CORRECT) గా ఉన్న ఐచ్ఛికం (CHOICE) ?
(ఎ) ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ⇒ సెబాస్టియన్ కో
(బి) అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి ⇒ సెబాస్టియన్ కో
(సి) ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు ⇒ సెబాస్టియన్ కో
(డి) ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు ⇒ సెబాస్టియన్ కో

2. కరోనా ఆసుపత్రులను (CORONA HOSPITALS) ఎన్ని విభాగాలుగా వర్గీకరించాలని 'కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ' అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4

3. 2020 ఏప్రిల్ 6 న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో "ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ఎంపీ" ల వేతనాల్లో ఏడాదిపాటు ఎంత శాతం కోత విధించాలని నిర్ణయించారు ?
(ఎ) 10%
(బి) 20%
(సి) 30%
(డి) 100%

4. ఆస్ట్రేలియా కు చెందిన 'గ్రిఫిత్ విశ్వవిద్యాలయం' తో పరిశోధనా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని, 'కోడాన్ డీ - ఆప్టిమైజేషన్' టెక్నాలజీ ద్వారా కరోనా వాక్సిన్ "స్ట్రెయిన్" ను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన భారత సంస్థ ?
(ఎ) భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్
(బి) ఇండియన్ ఇమ్మ్యూనోలోజికల్స్ లిమిటెడ్
(సి) సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ప్రై) లిమిటెడ్
(డి) మై డిస్కవరీ సొల్యూషన్స్

5. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఆంక్షలను పాటించకుంటే ... ఒక్కో కరోనా రోగి నుంచి నెల రోజుల్లో ఎంత మందికి వైరస్ సోకే ముప్పుంది ?
(ఎ) 405
(బి) 406
(సి) 407
(డి) 408



6. 'కరోనా' (CORONA) వైరస్ సోకి బాధపడుతున్న వారిని ఇకపై ఏవిధంగా సంబోధించాలని 'కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ' ప్రకటన విడుదల చేసింది ?
(ఎ) కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారు
(బి) కొవిడ్ అతిథులు
(సి) కొవిడ్ కు చికిత్స తీసుకుంటున్న వారు
(డి) కొవిడ్ ప్రభావితులు

7. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం 'కొవిడ్-19' (COVID-19) వ్యాధికి సంబంధించి గత 14 రోజుల్లో కొత్తగా కేసులేవీ నమోదు కాని, "హాట్ స్పాట్" (HOT SPOT) లో ఉన్న జిల్లాలను ఏ జోన్ లోకి మారుస్తారు ?
(ఎ) ఆరంజ్ జోన్ (ORANGE ZONE)
(బి) గ్రీన్ జోన్ (GREEN ZONE)
(సి) కంటైన్మెంట్ జోన్ (CONTAINMENT ZONE)
(డి) బఫర్ జోన్ (BUFFER ZONE)

8. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గీకరణ ప్రకారం "నాన్-హాట్ స్పాట్ జిల్లా" (NON-HOTSPOT DISTRICT) అంటే ?
(ఎ) 15 లేదా అంతకంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్న జిల్లా
(బి) కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న జిల్లా
(సి) ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లా
(డి) 20 లేదా అంతకంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్న జిల్లా

9. 2020 వ సంవత్సరంలో రుతుపవనాల ఉపసంహరణకు సంబంధించి "భారత వాతావరణ విభాగం" (IMD ⇒ INDIA METEOROLOGICAL DEPARTMENT) ఏయే సంవత్సరాల మధ్య గల గణాంకాలను ఆధారంగా చేసుకుంది ?
(ఎ) 1961-2019
(బి) 1971-2019
(సి) 1981-2019
(డి) 1991-2019

10. "హెలికాప్టర్ మనీ" (HELICOPTER MONEY) అనే పదాన్ని మొదటిసారిగా 'మిల్టన్ ఫ్రీడ్ మాన్' (MILTON FRIEDMAN) అనే అమెరికా ఆర్థికవేత్త వాడుకలోకి తీసుకొచ్చిన సంవత్సరం ?
(ఎ) 1968
(బి) 1969
(సి) 1970
(డి) 1971           



కీ (GK TEST-33 DATE : 2020 APRIL 27)
1) సి 2) సి 3) సి 4) బి 5) బి 6) ఎ 7) ఎ 8) బి 9) బి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి