ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, ఏప్రిల్ 2020, శనివారం

INDIA COVID-19 EMERGENCY RESPONSE and HEALTH SYSTEM PREPAREDNESS PACKAGE

భారత్ కొవిడ్-19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీ

(INDIA COVID-19 EMERGENCY RESPONSE and HEALTH SYSTEM PREPAREDNESS PACKAGE)


  • కొవిడ్-19 కారణంగా దేశంలో ఏర్పడిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి 'కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ' రూ. 15,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
  • ఈ కార్యక్రమం కింద తక్షణం రూ. 7,500 కోట్లు ఖర్చు చేస్తారు. మిగిలిన మొత్తాన్ని నాలుగేళ్ల లోపు అందిస్తారు.
  • నిధులను పూర్తిగా కేంద్రమే సమకూరుస్తుంది.
  • దేశంలో కరోనా వైరస్ వేగాన్ని నియంత్రించే అత్యవసర సేవలను సత్వరం చేపట్టడమే ప్యాకేజీ ప్రధాన లక్ష్యం.
  • రోగ నిర్ధారణ పరీక్షలు పెంచడం, ప్రత్యేక చికిత్స కేంద్రాల ఏర్పాటు, చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలు / ఔషధాలు కేంద్రీకృత వ్యవస్థ ద్వారా సేకరించడం, జాతీయ-రాష్ట్ర స్థాయిల్లో వైద్య ఆరోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం తక్షణ కర్తవ్యాలు. భవిష్యత్తులో ఇలాంటి రోగాలు ప్రబలకుండా ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టడం కూడా ఇందులో అంతర్భాగం.
  • మొత్తం కార్యక్రమాలు కేంద్ర వైద్య-ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో సాగుతాయి.

ప్యాకేజీ నిధులు ఖర్చు ఇలా ... :

  • ప్యాకేజీ లో అత్యధిక భాగాన్ని అత్యవసర స్పందన వ్యవస్థ నెలకొల్పడానికే ఖర్చు చేస్తారు.
  • జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వినియోగిస్తారు.

ఈ ప్యాకేజీ నిధులతో రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలు :

  • ప్రత్యేక ఆసుపత్రులు, ఐసొలేషన్ బ్లాకులు, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ లు, ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా, ప్రయోగశాలల బలోపేతం, అదనపు సిబ్బంది నియామకం, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్రాలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు.
  • అవసరమైతే పీపీఈ లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలు.
  • ప్రయోగశాలల గుర్తింపు పనిని మరింత వేగవంతం చేయడం.
  • వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులకు శిక్షణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
  • ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలు, అంబులెన్సు ల శుభ్రత.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి