ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, ఏప్రిల్ 2020, బుధవారం

GK TEST-28

1. 2020 మార్చ్ 26 న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించిన "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA - PMGKY) ప్యాకేజీ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల స్వయం సహాయక సంఘాలకు పూచీకత్తు లేకుండా ఇస్తున్న రుణ పరిమితిని రూ. 10 లక్షల నుంచి ఎంతకు పెంచారు ? (దీని వల్ల 7 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది)
(ఎ) రూ. 15 లక్షలు
(బి) రూ. 20 లక్షలు
(సి) రూ. 25 లక్షలు
(డి) రూ. 30 లక్షలు

2. క్రీ.శ. 541 - క్రీ.శ. 542 లో ప్రబలిన 'ప్లేగ్' వ్యాధిని "జస్టీనియన్ ప్లేగ్" (PLAGUE OF JUSTINIAN) గా పిలవడానికి గల కారణం ?
(ఎ) చక్రవర్తి జస్టీనియన్ కు ప్లేగ్ సోకి ... మరణించడం
(బి) చక్రవర్తి జస్టీనియన్ కు ప్లేగ్ సోకి ... కోలుకోవడం
(సి) చక్రవర్తి జస్టీనియన్ ఆ పేరును అధికారికంగా ప్రకటించడం
(డి) చక్రవర్తి జస్టీనియన్ కాలంలో ఆ వ్యాధి ప్రబలడం

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న "బఫర్ జోన్" (BUFFER ZONE) ప్రాంత పరిధి ?
(ఎ) 1 కి.మీ
(బి) 3 కి.మీ
(సి) 5 కి.మీ
(డి) 7 కి.మీ

4. 'ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994' సెక్షన్ 200 ప్రకారం ప్రస్తుతం "ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, అంతకంటే పై స్థాయి అధికారి" గా పనిచేసిన వారిని మాత్రమే 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్' (SEC ⇒ STATE ELECTION COMMISSIONER) గా నియమించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 10 న జీవో నంబర్ 617 (G O No. 617) ద్వారా జారీ చేసిన ఆర్డినెన్స్ (ORDINANCE) ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎవరిని నియమిస్తారు ?
(ఎ) హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారిని
(బి) సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారిని
(సి) హైకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేసిన వారిని
(డి) సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేసిన వారిని

5. ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో పెంపుడు కుక్క (PET DOG) కు 'కొవిడ్-19' (COVID-19) వ్యాధి సోకింది ?
(ఎ) తైవాన్
(బి) సింగపూర్
(సి) మలేసియా
(డి) హాంకాంగ్



6. భూగోళంపై నాణ్యమైన మౌలిక వసతుల నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి "అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా" లు కలిసి ప్రవేశ పెట్టిన పథకం ?
(ఎ) బీ ఆర్ ఐ (BRI ⇒ BELT and ROAD INITIATIVE)
(బి) బీ డీ ఎన్ (BDN ⇒ BLUE DOT NETWORK)
(సి) సిపెక్ (CPEC)
(డి) ఏ ఏ జీ సీ (AAGC)

7. 2020 ఏప్రిల్ 10 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ (ORDINANCE) ప్రకారం 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్' (SEC ⇒ STATE ELECTION COMMISSIONER) పదవీ కాలం ?
(ఎ) ఒక సంవత్సరం
(బి) మూడు సంవత్సరాలు
(సి) ఐదు సంవత్సరాలు
(డి) ఆరు సంవత్సరాలు

8. 2020 ఏప్రిల్ 10 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ (ORDINANCE) ప్రకారం 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్' (SEC ⇒ STATE ELECTION COMMISSIONER) గా ఒక వ్యక్తిని ఎన్నిసార్లు నియమించే వీలుంది ?
(ఎ) ఒకసారి
(బి) రెండు సార్లు
(సి) మూడు సార్లు
(డి) నాలుగు సార్లు

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల మొత్తం మండలాలు ?
(ఎ) 675
(బి) 676
(సి) 677
(డి) 678

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ?
(ఎ) జస్టిస్ వి. కనగరాజ్
(బి) జస్టిస్ కె.జి. బాలకృష్ణన్
(సి) జస్టిస్ సి. నాగార్జున రెడ్డి
(డి) జస్టిస్ ఏ. ధర్మాధికారి       



కీ (GK TEST-28 DATE : 2020 APRIL 15)
1) బి 2) బి 3) డి 4) సి 5) డి 6) బి 7) బి 8) బి 9) బి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి