ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన
(PRADHAN MANTRI GARIB KALYAN YOJANA) - (PMGKY)
- 'కరోనా (కొవిడ్-19)' వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ (LOCK DOWN) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం .. నిరుపేదలను ఆదుకోవడానికి "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA) - (PMGKY) పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
- వచ్చే మూడు నెలల పాటు దీన్ని అమలు చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (NIRMALA SITHARAMAN), సహాయ మంత్రి 'అనురాగ్ సింగ్ ఠాకూర్' (ANURAG SINGH THAKUR) లు 2020 మార్చ్ 26 న ప్రకటించారు.
వైద్య సిబ్బందికి వైద్య బీమా :
ప్రాణాలను పణంగా పెట్టి, కరోనా వైరస్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న 'ఆశా వర్కర్లు, వైద్య సాంకేతిక, పారిశుద్ధ్య, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, వైద్యులకు' రూ. 50 లక్షల వ్యక్తిగత వైద్య బీమా. దీనివల్ల 20 లక్షల మందికి ప్రయోజనం.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన :
80 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డుల ద్వారా ప్రస్తుతం నెలకు 5 కిలోల చొప్పున గోధుమలు/బియ్యం ఇస్తున్నారు. దీనికి అదనంగా .. వచ్చే మూడు నెలల పాటు నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా ఇస్తారు. ప్రతి కుటుంబానికి నెలకు కేజీ పప్పు ధాన్యాలను అందిస్తారు.
ఉపాధి హామీ వేతనం రూ.20 పెంపు :
ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాలు రూ.182 నుంచి రూ.202 కి పెంపు. దీనివల్ల 5 కోట్ల కుటుంబాలకు అదనపు లబ్ధి.
దుర్బల వర్గాలకు రెండు విడతల్లో రూ.వెయ్యి :
60 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎక్స్ గ్రేషియా కింద వచ్చే 3 నెలల్లో రెండు విడతల్లో రూ.వెయ్యి జమ.
రైతులకు రూ.2 వేలు :
ప్రస్తుతం "పీఎం కిసాన్" (
PM-KISAN) కింద ఏటా రూ. 6 వేలను మూడు వాయిదాల్లో అందిస్తున్నారు. ఈ దఫా తొలి వాయిదా రూ. 2 వేలను ఏప్రిల్ మొదటి వారంలోనే జమ చేస్తారు. దీనివల్ల 8.69 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
జన్ ధన్ మహిళలకు నెలకు రూ. 500 :
జన్ ధన్ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు వచ్చే మూడు నెలల పాటు నెలకు రూ.500 చొప్పున జమ చేస్తారు.
3 నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్ :
"ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన" (
PMUY ⇒ PRADHAN MANTRI UJJWALA YOJANA) కింద లబ్ధి పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు వచ్చే 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా.
మహిళా స్వయం సహాయక సంఘాల రుణ పరిమితి రెట్టింపు :
దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల స్వయం సహాయక సంఘాలకు పూచీకత్తు లేకుండా ఇస్తున్న రుణ పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. దీనివల్ల 7 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం.
సంఘటిత రంగ కార్మికులు :
100 మంది వరకు పనిచేస్తున్న సంస్థల్లో 90% మంది ఉద్యోగులు నెలకు రూ.15 వేల లోపు వేతనాలు పొందుతున్నట్లయితే వారికి సంబంధించిన 'ప్రావిడెంట్ ఫండ్' (PF ⇒ PROVIDENT FUND) ను మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగి వాటా 12%, యజమాని వాటా 12% కలిపి 24% మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా జమవుతుంది. దీనివల్ల 80 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది.
సంఘటిత రంగంలోని కార్మికులు ప్రస్తుత పరిస్థితులలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వారి పీ ఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 75% కానీ మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తం కానీ (ఏది తక్కువైతే అది) "నాన్ రిఫండబుల్ అడ్వాన్స్" (NON-REFUNDABLE ADVANCE) కింద తీసుకోవచ్చు. ఈపీఎఫ్ కింద నమోదైన 4.8 కోట్ల మంది కార్మికులు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు.
నిర్మాణరంగ కార్మికులు :
'భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి' కింద జమ అయిన రూ.31 వేల కోట్లను .. 3.5 కోట్ల మంది రిజిస్టర్డ్ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పిస్తారు.
జిల్లా ఖనిజ నిధి :
రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్న 'జిల్లా ఖనిజ నిధి' ని "కొవిడ్-19 వైద్య పరీక్షలు, స్క్రీనింగ్, మందులు, కరోనా నియంత్రణకు అవసరమయ్యే ఇతర సౌకర్యాలు" కు ఉపయోగించుకునే వెసులుబాటు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి