ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, మార్చి 2020, మంగళవారం

GK TEST-5

1. చాలా వేగంగా వ్యాప్తి చెందే సామర్ధ్యమున్న వైరస్ లను నిర్దిష్ట పరిస్థితుల్లోనే పరీక్షించాలి. వీటిని "బయో సేఫ్టీ ప్రమాణాలు" (BSL ⇒ BIO SAFETY LEVELS) గా పేర్కొంటారు. మనదేశంలో 'పుణె' లో ఉన్న 'ఎన్ ఐ వి' (NIV ⇒ NATIONAL INSTITUTE OF VIROLOGY) కి ఉన్న 'బీ ఎస్ ఎల్' (BSL) స్థాయి ?
(ఎ) బీ ఎస్ ఎల్ - 1
(బి) బీ ఎస్ ఎల్ - 2
(సి) బీ ఎస్ ఎల్ - 3
(డి) బీ ఎస్ ఎల్ - 4

2. దాదాపు మూడోవంతు ప్రజలపై "కరోనా (కొవిడ్-19)" ఆంక్షలు అమల్లోకి తెచ్చి, వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సి వస్తోందని ప్రకటించిన "జిస్సెప్పే కాంటే" ఏ దేశ ప్రధాని ?
(ఎ) చైనా
(బి)  స్విట్జర్లాండ్
(సి) ఫ్రాన్స్
(డి) ఇటలీ

3. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చ్ 8) నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని "దిశ" పోలీస్  స్టేషన్ల ను ప్రారంభించారు ? (వీటితో రాష్ట్రంలో గల మొత్తం "దిశ" పోలీస్ స్టేషన్ల సంఖ్య : 18)
(ఎ) 10
(బి) 11
(సి) 12
(డి) 13

4. అంటురోగాల చట్టం-1897 అనుసరించి "కొవిడ్-19 నియంత్రణ-2020" పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం "కరోనా (కొవిడ్-19)" కు సంబంధించిన వివరాలు ప్రజలు తెలియజేయాల్సిన హెల్ప్ లైన్ నంబర్ ?
(ఎ) 100
(బి) 101
(సి) 104
(డి) 108

5. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న "డీ ఏ" (DA ⇒ DEARNESS ALLOWANCE) ను 17%  నుంచి ఎంత శాతానికి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ? (పెంచిన "డీ ఏ" 2020 జనవరి 1 నుండి వర్తిస్తుంది)
(ఎ) 18%
(బి) 19%
(సి) 20%
(డి) 21%



6. 30 ఏళ్లకు పైబడి ఉన్న దేశీయ యూరియా తయారీ కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం టన్నుకు ఇవ్వనున్న అదనపు స్థిర ధర ?
(ఎ)  రూ. 400
(బి) రూ. 450
(సి) రూ. 500
(డి) రూ. 550

7. గృహ నిర్బంధంలో ఉన్న 'జమ్మూ-కశ్మీర్' మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుడు 'ఫరూఖ్ అబ్దుల్లా' పై "ప్రజా భద్రతా చట్టం" (PSA ⇒ PUBLIC SAFETY ACT) ను ఏ రోజున ఎత్తి వేశారు ? (ఇతను మొత్తంగా 220 రోజులపాటు (ఏడు నెలలకు పైబడి) నిర్బంధంలో ఉన్నారు)
(ఎ) 2020 మార్చ్ 12
(బి) 2020 మార్చ్ 13
(సి) 2020 మార్చ్ 14
(డి) 2020 మార్చ్ 15

8. 'జమ్మూ-కశ్మీర్' లో "370 అధికరణం" రద్దైన తేదీ ?
(ఎ) 2019 ఆగస్ట్ 5
(బి) 2019 ఆగస్ట్ 6
(సి) 2019 ఆగస్ట్ 7
(డి) 2019 ఆగస్ట్ 8

9. 'అత్యవసర ఉత్పత్తుల చట్టం' పరిధిలో మాస్కులు, శానిటైజర్లను చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం 2020 మార్చ్ 13 న నోటిఫై చేసింది. 2020 జూన్ 30 వరకు "2-ప్లే, 3-ప్లే, ఎన్-95 మాస్కులు, శానిటైజర్లు" ను నిత్యావసర ఉత్పత్తులుగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించేవారికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8

10. "ఈ-ఇన్వాయిస్, క్యూ ఆర్ కోడ్" (E-INVOICE, Q R CODE) ను ఎప్పటినుండి అమలు చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది ?
(ఎ) 2020 ఏప్రిల్ 1
(బి) 2020 అక్టోబర్ 1
(సి) 2021 జనవరి 1
(డి) 2021 ఏప్రిల్ 1                 





కీ (GK TEST-5 DATE : 2020 MARCH 17)
1) డి 2) డి 3) బి 4) సి 5) డి 6) సి 7) బి 8) ఎ 9) సి 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి