ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, మార్చి 2020, సోమవారం

GK TEST-17

1. 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI ⇒ STATE BANK OF INDIA) తను ఇచ్చే 'గృహ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు' ను నిర్ణయించేటప్పుడు 'రెపో' (REPO ⇒ REPURCHASE RATE) రేట్ కు అదనంగా ఎంత శాతం కలుపుతుంది ?
(ఎ) 2.35%
(బి) 2.45%
(సి) 2.55%
(డి) 2.65%

2. 'కరోనా (కొవిడ్-19)' ఉద్ధృతి కారణంగా "రిటైల్ రుణ గ్రహీతలు తీసుకున్న అన్ని రకాల టర్మ్ రుణాల వాయిదాల చెల్లింపులు" (EMI ⇒ EQUATED MONTHLY INSTALLMENT) పై 'ఆర్ బీ ఐ' (RBI ⇒ RESERVE BANK OF INDIA) మూడు నెలల 'మారటోరియం' (వాయిదాల వాయిదా) ప్రకటించింది. ఆ మూడు నెలలు ... ?
(ఎ) ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్
(బి) మార్చ్, ఏప్రిల్, మే
(సి) ఏప్రిల్, మే, జూన్
(డి) మే, జూన్, జూలై 

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి 'కరోనా (కొవిడ్-19)' (COVID-19 (Corona Virus Disease-2019)) కేసు ఎప్పుడు నమోదైంది ?
(ఎ) 2020 మార్చ్ 2
(బి) 2020 మార్చ్ 3
(సి) 2020 మార్చ్ 4
(డి) 2020 మార్చ్ 5

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'కరోనా (కొవిడ్-19)' నియంత్రణకు జిల్లా కలెక్టర్ల వద్ద ఎంత మొత్తంతో "అత్యవసర నిధి" ని ఏర్పాటు చేసింది ?
(ఎ) రూ. కోటి
(బి) రూ. 2 కోట్లు
(సి) రూ. 3 కోట్లు
(డి) రూ. 4 కోట్లు

5. 'కరోనా (కొవిడ్-19)' కారణంగా దేశవ్యాప్తంగా 'లాక్ డౌన్' (LOCK DOWN) ప్రకటించిన నేపథ్యంలో 'సంఘటిత రంగంలోని కార్మికులు' ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వారి 'పీ ఎఫ్' (PF ⇒ PROVIDENT FUND) ఖాతాలో ఉన్న మొత్తంలో 75% కానీ, మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తం కానీ (ఏది తక్కువైతే అది) ఏ పద్దు కింద తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
(ఎ) లోన్ వితౌట్ ఇంట్రెస్ట్
(బి) లోన్ విత్ ఇంట్రెస్ట్
(సి) నాన్ రిఫండబుల్ అడ్వాన్స్
(డి) రిఫండబుల్ అడ్వాన్స్



6. 'కరోనా (కొవిడ్-19)' వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలకు సహాయం చేయడంలో భాగంగా "రూ. 5-10 లక్షల వరకు  విలువ చేసే అధునాతన వెంటిలేటర్" (Automated Bag Valve Mask Ventilator) ను కేవలం రూ. 7,500 కే తయారు చేయగలమని ప్రకటించిన కంపెనీ ?
(ఎ) టాటా మోటార్స్ (TATA MOTORS)
(బి) మహీంద్రా & మహీంద్రా (MAHINDRA & MAHINDRA)
(సి) ఆదిత్య బిర్లా గ్రూప్ (ADITYA BIRLA GROUP)
(డి) రిలయన్స్ (RIL ⇒ RELIANCE INDUSTRIES LIMITED)

7. 'కరోనా (కొవిడ్-19)' పై పోరాటానికి "ప్రాజెక్ట్ కవచ్" (PROJECT KAVACH) ను ఆవిష్కరించిన వైద్య సేవల సంస్థ ?
(ఎ) శ్రీ గంగారాం హాస్పిటల్
(బి) కోకిల ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్
(సి) టాటా మెమోరియల్ హాస్పిటల్
(డి) అపోలో హాస్పిటల్స్

8. 'కరోనా (కొవిడ్-19)' మహమ్మారి కారణంగా కలిగే ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సుమారు "5 లక్షల కోట్ల డాలర్లు" (రూ. 370 లక్షల కోట్లు) ను ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలోకి చొప్పించాలని నిర్ణయించిన వివిధ దేశాల కూటమి ?
(ఎ) జి-5 దేశాల కూటమి
(బి) జి-7 దేశాల కూటమి
(సి) జి-20 దేశాల కూటమి
(డి) బ్రిక్స్ దేశాల కూటమి

9. ఒకే వెంటిలేటర్ ద్వారా అనేకమంది 'కరోనా (కొవిడ్-19)' రోగులకు సేవలందించే వినూత్న వెంటిలేటర్ ను రూపొందించిన "డీ ఆర్ డీ ఓ" (DRDO ⇒ DEFENCE RESEARCH and DEVELOPMENT ORGANISATION) ల్యాబ్ ? (ఒక్కో వెంటిలేటర్ ధర రూ. 4 లక్షలు ఉంటుంది)
(ఎ) బెంగళూరు
(బి) హైదరాబాద్
(సి) గ్వాలియర్
(డి) జోధ్ పూర్

10. "మెల్ట్ బ్లోన్" (Meltblown) వస్త్రంతో తయారైన '3 పొరల మాస్క్' (3-PLY MOSK) కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర (MRP ⇒ MAXIMUM RETAIL PRICE) ? (ఈ ధర 2020 జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది)
(ఎ) రూ. 14
(బి) రూ. 15
(సి) రూ. 16
(డి) రూ. 17            



కీ (GK TEST-17 DATE : 2020 MARCH 30)
1) డి 2) బి 3) ఎ 4) బి 5) సి 6) బి 7) డి 8) సి 9) ఎ 10) సి


All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి