కొవిడ్ ఆసుపత్రులు - భారతదేశం - విభాగాలు
(COVID HOSPITALS-INDIA-DIVISIONS)
- కరోనా ఆసుపత్రులను మూడు విభాగాలుగా వర్గీకరించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేసింది.
- "కొవిడ్ సంరక్షణ కేంద్రం, కొవిడ్ ఆరోగ్య కేంద్రం, కొవిడ్ ఆసుపత్రి" పేరుతో వీటిని వర్గీకరించాలని సూచించింది.
- "రోగ తీవ్రత తక్కువ, మధ్యస్థాయి, ఎక్కువ స్థాయి" లో ఉన్న రోగులను వీటి మధ్య విభజించాలని స్పష్టం చేసింది.
1. కొవిడ్ సంరక్షణ కేంద్రం :
- తక్కువ (MILD), అతి తక్కువ (VERY MILD), అనుమానిత కేసులను ఇక్కడ పెట్టాలి. ఇది తాత్కాలికం కావచ్చు.
- వసతి గృహాలు, హోటళ్లు, పాఠశాలలు, స్టేడియంలు, లాడ్జ్ లు, ధర్మశాలల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
- క్వారంటైన్ (QUARANTINE) కేంద్రాలను కొవిడ్ సంరక్షణ కేంద్రాలుగానూ మార్చుకోవచ్చు. ఈ కేంద్రాన్ని ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రంతో మ్యాపింగ్ చేయాలి.
- ఇక్కడున్న రోగులకు తదుపరి వైద్య సేవలు అవసరమైతే అందుకు అవసరమైన ప్రణాళిక తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
2. కొవిడ్ ఆరోగ్య కేంద్రం (డెడికేటెడ్) :
- ఇందులో రోగ తీవ్రత కొంత ఎక్కువ (MODERATE) ఉన్నవారిని ఉంచాలి.
- పూర్తి ఆసుపత్రిని లేదా ఆసుపత్రిలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయించాలి.
- ఆక్సిజన్ తో కూడిన పడకలు ఉండాలి.
3. కొవిడ్ ఆసుపత్రులు (డెడికేటెడ్) :
- లక్షణాల తీవ్రత, ప్రమాదం ఎక్కువగా ఉన్న రోగులకు ఇక్కడ చికిత్స అందించాలి.
- ఆసుపత్రులు లేదంటే బ్లాక్ లను ఇందుకు కేటాయించాలి.
- వీటిలో ఐసీయూ (ICU) సౌకర్యం, వెంటిలేటర్లు (VENTILATORS) ఉండాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి