ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, ఏప్రిల్ 2020, మంగళవారం

IMPORTANT INCIDENTS AND THEIR DATES

ముఖ్య సంఘటనలు - తేదీలు

తేదీసంఘటన వివరాలు
2020 మార్చ్ 22భారతదేశమంతా "జనతా కర్ఫ్యూ" (JANATA CURPHEW) పాటించడం జరిగింది.
2020 మార్చ్ 25భారతదేశమంతా "లాక్ డౌన్" (LOCK DOWN) అమలు ప్రారంభం అయింది.
2020 మార్చ్ 27కరోనా (CORONA) నేపథ్యంలో రుణాలకు సంబంధించిన 'నెలవారీ వాయిదాల' (EMI) పై మూడు నెలల మారటోరియం (MARATORIUM) విధిస్తూ 'రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) సర్కులర్ (CIRCULAR) జారీ చేసింది.
2020 ఏప్రిల్ 11ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) గా జస్టిస్ వి. కనగరాజ్ (JUSTICE V.KANAGA RAJ) బాధ్యతలు స్వీకరించారు.
2020 ఏప్రిల్ 11కరోనా (CORONA) వైరస్ కు సంబంధించిన ప్రాథమిక సమాచారం, సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కచ్చితమైన సమాచారం కోసం 'వాట్సాప్ (Whatsapp number : 8297104104), ఫేస్ బుక్ (FACEBOOK) మెసెంజర్ లో "చాట్ బోట్" లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి' ప్రారంభించారు.
2020 ఏప్రిల్ 12కరోనా (CORONA) నేపథ్యంలో "పొగాకు, పాన్ మసాలా, సుపారి, ఖైనీ" (TOBACCO, PAN MASALA, SUPARI, KHAINI) తదితర ఉత్పత్తులను బహిరంగంగా నమలడం, ఉమ్మి వేయడాన్ని 'ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ' నిషేధించింది.
2020 ఏప్రిల్ 13తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్ఆర్ టెలీ మెడిసిన్" (YSR TELE MEDICINE) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి' ప్రారంభించారు.
2020 ఏప్రిల్ 14తూర్పు తీరంలో కేంద్ర ప్రభుత్వం విధించే "చేపల వేట నిషేధం" (BAN ON FISHING) 2020 ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి 61 రోజులపాటు అంటే 2020 జూన్ 14 వరకు అమలు ప్రారంభం.
2020 ఏప్రిల్ 14కరోనా (CORONA) మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 2020 మార్చ్ 25 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ (LOCK DOWN) ను 2020 మే 3 వరకు పొడిగిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ (NARENDRA MODI) ప్రకటించారు.
2020 ఏప్రిల్ 15ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీవో లను రద్దు చేస్తున్నట్లు హైకోర్ట్ (HIGH COURT) ప్రకటించింది.
2020 ఏప్రిల్ 15ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం (CM CAMP OFFICE) లోని సమావేశ మందిరంలో గోడకి ఉండే "పూర్ణ వికసిత పద్మం" నమూనా ని తొలగించారు.
2020 ఏప్రిల్ 15సామజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు "ఏపీ సీఐడీ ఫ్యాక్ట్ చెక్" (AP CID FACT CHECK) పేరిట తీసుకొచ్చిన వాట్సాప్ నంబర్ (Whatsapp Number) 9071666667 ను డీజీపీ (DGP) గౌతమ్ సవాంగ్ మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఆవిష్కరించారు.
2020 ఏప్రిల్ 16విద్యుత్ సంస్థల్లో ఆరు నెలలపాటు (SIX MONTHS) సమ్మెలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhrapradesh Governament) ఉత్తర్వులు జారీ చేసింది.
2020 ఏప్రిల్ 19ఆంధ్రప్రదేశ్ లో కరోనా (CORONA) వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసేందుకు స్వయం సహాయక సంఘాల (DWCRA) మహిళలు తయారు చేసిన మాస్కులను (MASKS) రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి నివాసంలో ఆవిష్కరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి